Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

vastAvu pOtAvu - వస్తావు పోతావు

చిత్రం : పూజాఫలం (pUjAphalam) (1964)

రచన : కొసరాజు(kosarAju)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు(sAluri rAjEswararao)
గానం : బి.వసంత(B. vasanta)

పల్లవి :
వస్తావు పోతావు నా కోసం
వచ్చి కూర్చున్నాడు నీకోసం
యముడు వచ్చి
కూర్చున్నాడు నీకోసం
చరణం : 1
పొరపాటు పడి చేత
దొరికిపోయావంటే
నా బంగారు చేపా... ఆ...
డొక్క చీలుస్తాడు డోలు కట్టిస్తాడు॥
చరణం : 2
నిక్కి నిక్కి పైకి చూసేవూ
తళుకు బెళుకు చూసి మురిసేవూ
కదలలేడనిపించి కలలు కన్నావంటే
కదలలేడనిపించి కలలు కన్నావంటే
బొక్క ముక్కలు చేసి
తిక్క వదిలిస్తాడు॥

Special Notes:
మార్చి 29, 1944లో మచిలీపట్నంలో జన్మించారు బి.వసంత. పూర్వీకులు సంగీతంలో ప్రావీణ్యం ఉన్నవారు కావడంతో చిన్నప్పటి నుండే సంగీతంపై అభిరుచి పెరిగింది. ‘వాగ్దానం’ (1961) సినిమాలో ‘మా కిట్టయ్య పుట్టిన దినం’ అనే పాట (పిఠాపురంతో యుగళం) ఆమె తొలిపాట. అక్కడినుండి ఆమె స్వరప్రస్థానం దాదాపు మూడున్నర దశాబ్దాల పైగా సాగింది. ఇప్పటికీ కూడ ఆమె గొంతు సంగీత అభిమానులకు ప్రియం. ఆమె చిన్న చెల్లెలైన సావిత్రి కూడ చాలా సినిమాల్లో పాటలు పాడారు. ఈ సావిత్రి కుమారుడే ఇప్పుడు యంగ్ మ్యూజిక్ డెరైక్టర్ ఎస్.ఎస్.థమన్. అలాగే మంగళంపల్లి బాలమురళీకృష్ణకు ప్రథమ శిష్యుడైన మోహనకృష్ణ బి.వసంతకు వరుసకు తమ్ముడు అవుతాడు. నేడు ఆమె 70వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.

oka chUpukE padipOyA - ఒక చూపుకే పడిపోయా

చిత్రం : నాయక్ (nAyak) (2013)

రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : ఎస్.ఎస్.థమన్(S.S.Thaman)
గానం : విజయ్‌‌రప్రకాష్, బిందుమహిమ



పల్లవి :
ఒక చూపుకే పడిపోయా
ఒక నవ్వుకే పడిపోయా
ఒక మాటకే పడిపోయా... అయిపోయా
తిన వెనకే వెళిపోయా
తిన వలనే చెడిపోయా
తినకుండా అయిపోయా... ఏం మాయ

బాబోయ్ బాబోయ్ ఒళ్లంతా జొరమొచ్చిందే
వామ్మో వామ్మో నా సిగ్గుకి సిగ్గొచ్చిందే
అయ్యో అయ్యో నీ అందం నాలో అగ్గెట్టిందే

ఏయ్ బుంబరబరబర బుంబరబో (2)
ఏయ్ హత్తెర హత్తెర హత్తెర హత్తెర
హత్తెర జరజర హత్తెరబో
॥॥చూపుకే॥
She saw me... She saw me...

ఎంతందంరా తస్సాదియ్యా
కాబట్టే దిల్ దియా
చరణం : 1
ఆ దేవుడే నీకు నాకు లింకేదో లగాదియా
కాబట్టే ఆనందంలో దిల్లంతా దాండియా
పై జన్మకి కూడా నిన్నే ఫిక్సైపోయా
అరెరే నువ్వే నాకే నచ్చి నన్నే దేదియా
ఎగిరి నేన్నీ ఒళ్లో పడ్డా అంతా నీ దయ
బాబోయ్ బాబోయ్ మైకంలో ముంచేసిందే
అయ్యో అయ్యో ఆకాశం నాకే అందేసిందే
॥ ఏయ్ ॥
చరణం : 2
డేగల్లే దూసుకువచ్చి నా మనసే చురాలియా
డైలీ నా కల్లోకొచ్చి ముద్దుల్తో మార్ దియా
నీవల్లే నా కుడికన్ను అదిరిందయ్యా
ఇదిగో పిల్లా నీ పెదవేమో స్వీటు సేమియా
నువు నా లైఫే మార్చేశావే బోలో క్యా కియా
బాబోయ్ బాబోయ్ మే నెలలో చలిపుట్టిందే
అయ్యో అయ్యో అరె జనవరి నెలలో
చెమటెక్కిందే
॥॥చూపుకే॥ ‘‘She‘‘

chandamAma chandamAma - చందమామ చందమామ


చిత్రం : ఆటోడ్రైవర్(Auto Driver) (1998)

రచన : వేటూరి, సంగీతం : దేవా
గానం : హ రిహరన్, సుజాత

పల్లవి :
చందమామ చందమామ
సింగారాల చందమామ (2)
చందమామ చందమామ
సాయంత్రాల చక్కనమ్మ
వస్తావా కలిసొస్తావా
కవ్వించే కన్నుల వెన్నెలతో
ఇస్తావా మనసిస్తావా కెపైక్కే కమ్మని కౌగిలితో
నింగినే ల తాళాలేసే మేళాలెన్నడో
నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో... ఓ...
చందమామ చందమామ సింగారాల చంద మామ
చరణం : 1
కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు
తెల్ల ముగ్గు వేసుకుంటా
గీకైకంతా రేగేమంటా చేస్తేవుంటా
నిన్నే జంట చేసుకుంటా
ఊరించేటి అందాలన్నీ... ఆ...
ఊరించేటి అందాలన్నీ ఆరేశాక ఆరా తీశా
చీకట్లోని చిన్నుండాలా చిత్రాలెన్నో దాచాలే
గుడిసైనా చాలే మనసుంటే
గుడికన్నా పదిలం కలిసుంటే
దాయి దాయి దాయి దాటిపోనీకు రేయి
చందమామ చందమామ
సింగారాల చందమామ
చరణం : 2
తుళ్లిపాడే గోదారల్లే ఏరు నీరు నీవునేనై
పొంగిపోదామా
చుక్క కళ్ల నీలాకాశం జాబిలమ్మ జాడే ఉండే
పున్నమైపోతాది సయ్యాటల్లో కన్నెమోజు చూశాలే
చెలికాడా నీడై నిలుచుంటా
జవరాలా ఔతా నీ జంట
చేయి చేయి చేయి దాటిపోనీకు హాయి॥