Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Om shAnthi Om shAnthi - ఓం శాంతి ఓం శాంతి

చిత్రం : చాలెంజ్ (chAllenge)(1984)

రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా
గానం : బాలు, జానకి, బృందం

పల్లవి
అతడు: ఓం శాంతి ఓం శాంతి... వయ్యారి వాసంతీ...
నీ ఈడులో ఉంది వేగం.. హ్హ నీ తోడు నాకుంది భాగం
బృందం: చాంకుచక్ చక చాం చక చంచక చక్‌చక చాం (2)
ఆమె: ఓం శాంతి ఓం శాంతి... నీదేలే పూబంతీ...
చరణం : 1
అ: ఒంపు ఒంపునా హంపి శిల్పమే చూశా... కన్నేశా
ఆ... లేతనడకలో హంసగమనమే చూశా... కాజేశా
కన్నె నడుమా కల్పనా కవులు పాడే కావ్యమా
కదిలివచ్చే శిల్పమా కరిగిపోని స్వప్నమా
ఆ: నీ ఊహలో ఇలా ఉప్పొంగినా అలా...
ఉయ్యాలలూగే యవ్వనాల నవ్వులన్నీ నీవే కాదా
అ: ఓం శాంతి ఓం శాంతి... వయ్యారి వాసంతీ...
ఆ: నీ చూపు నా పూలబాణం.. నీ ఊపిరే నాకు ప్రాణం॥॥శాంతి॥
చరణం : 2
అ: నీలవేణిలో కృష్ణవేణినే చూశా ముడివేశా
ఆ... పడతి కొంగులో కడలి పొంగులే చూశా... చుట్టేశా
మేని విరుపా మెరుపులా ఆ... బుగ్గ ఎరుపా వలపులా
నీలికనులా పిలుపులా మత్తులా మైమరపులా
ఆ: నీ చూపుతో ఇలా వేశావు సంకెలా
ఇన్నాళ్ల నించీ వేచివున్నా వెన్నెలంతా నీదే కాదా॥శాంతి॥

gaNapati bappA mOriyA - గణపతిబప్పా మోరియా

చిత్రం : ఇద్దరమ్మాయిలతో (2013)

రచన : భాస్కరభట్ల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సూరజ్ జగన్, బృందం

పల్లవి :
అతడు: గణపతిబప్పా మోరియా...
బృందం: గణపతిబప్పా మోరియా...॥
అ: వక్రతుండ మహాకాయ...
బృం: గణపతిబప్పా మోరియా...
అ: సూర్యకోటి సమప్రభ...
బృం: గణపతిబప్పా మోరియా...
అ: నిర్విఘ్నం కురుమే దేవ...
బృం: గణపతిబప్పా మోరియా...
అ: సర్వకార్యేషు సర్వదా...॥
అ: చలో చలో నచ్చేదారిలో...
నీకే నువ్వు చెప్పేయ్... హల్లో...
పూలో... ముళ్లో... నడిచే తోవలో
నీకెదురవ్వొచ్చు... భయపెట్టొచ్చు...
ముందుడుగేస్తే గెలిచేయొచ్చు...॥
చరణం :
అ: నెవ్వెళ్లే దారిలో కొండొస్తే...
ట్రక్కింగ్ అనుకొని ఎక్కేసుకో
నెవ్వెళ్లే రూటులో లొయొస్తే...
అరె... బంగీ జంపుకి వాడేసుకో
సముద్రమొస్తే నీ తోవలో...
స్విమ్మింగ్ కోసం యూజ్ చేసుకో
తుఫాను గానీ వచ్చిందో
ఆ స్పీడంతా నీలో నింపేసుకో
వుయ్ ఆర్ ఫ్రమ్ ఇండియా
విజయం మా మేనియా
అరె ఝండా ఊంఛే రహేమమారా సయ్యో సయ్యా...॥

chanduruDu ninnu - చందురుడు నిన్ను

చిత్రం : మంగమ్మగారి మనవడు(mangammagAri manavaDu) (1984)

రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
ఆమె: చందురుడు నిన్ను చూసి
చేతులెత్తాడు (2)
తన అందం నీలో చూసి తడబడిపోయాడు తబ్బిబ్బయ్యాడు
అవునా... అతడు: ఏమో... (2)
గోదారి నిను చూసి
గుసగుసలాడింది (2)
తన వేగం నీలో చూసి తడబడిపోయింది
తబ్బిబ్బయ్యింది
అవునా... ఆమె: ఏమో... (2)
చరణం : 1
ఆ: ఎవరికి లొంగని మగసిరిలో
ఎన్నడు తరగని సుగుణంలో॥
రాముడివే నీవు... ఆ రాముడివే నీవు
అ: ఏ రాముడు... అగ్గిరాముడా! బండరాముడా!
అడవి రాముడా! శృంగార రాముడా!
ఆ: హ్మ్... అయోధ్య రాముడివీ...
ఆ సీతారాముడివీ...॥
చరణం : 2
ఆ: భామలు మెచ్చిన రసికతలో
ప్రేమలు పంచిన చతురతలో॥
కృష్ణుడివే నీవు... ఆ కృష్ణుడివే నీవు
అ: ఏ కృష్ణుడు... చిలిపి కృష్ణుడా! కొంటె కృష్ణుడా!
భలే కృష్ణుడా! గోపాల కృష్ణుడా!
ఆ: హ్మ్... బృందావన కృష్ణుడివీ... ఆ రాధాకృష్ణుడివీ...॥