Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

chanduruDu ninnu - చందురుడు నిన్ను

చిత్రం : మంగమ్మగారి మనవడు(mangammagAri manavaDu) (1984)

రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
ఆమె: చందురుడు నిన్ను చూసి
చేతులెత్తాడు (2)
తన అందం నీలో చూసి తడబడిపోయాడు తబ్బిబ్బయ్యాడు
అవునా... అతడు: ఏమో... (2)
గోదారి నిను చూసి
గుసగుసలాడింది (2)
తన వేగం నీలో చూసి తడబడిపోయింది
తబ్బిబ్బయ్యింది
అవునా... ఆమె: ఏమో... (2)
చరణం : 1
ఆ: ఎవరికి లొంగని మగసిరిలో
ఎన్నడు తరగని సుగుణంలో॥
రాముడివే నీవు... ఆ రాముడివే నీవు
అ: ఏ రాముడు... అగ్గిరాముడా! బండరాముడా!
అడవి రాముడా! శృంగార రాముడా!
ఆ: హ్మ్... అయోధ్య రాముడివీ...
ఆ సీతారాముడివీ...॥
చరణం : 2
ఆ: భామలు మెచ్చిన రసికతలో
ప్రేమలు పంచిన చతురతలో॥
కృష్ణుడివే నీవు... ఆ కృష్ణుడివే నీవు
అ: ఏ కృష్ణుడు... చిలిపి కృష్ణుడా! కొంటె కృష్ణుడా!
భలే కృష్ణుడా! గోపాల కృష్ణుడా!
ఆ: హ్మ్... బృందావన కృష్ణుడివీ... ఆ రాధాకృష్ణుడివీ...॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |