Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

nuvu whistle EstE - నువు విజిలేస్తే

చిత్రం : సింహాద్రి(simhAdri) (2003)

రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి, గానం : టిప్పు, కె.ఎస్.చిత్ర


పల్లవి :
ఆమె: నువు విజిలేస్తే
ఆంధ్రా సోడాబుడ్డి... (2)
అది వినబడుతుంది
అలజడి రేగే జారుతుంది మిడ్డీ
అతడు: నీ అధరామృతం
పుల్లారెడ్డి... (2)
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
ఆ: నువు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి...
అ: నీ అధరామృతం పుల్లారెడ్డి...
చరణం : 1
అ: కన్నెబాడీ కాదమ్మో అది జీడిపప్పు జాడీ
నిన్నుచూసి పట్టా తప్పే పడుచు రైలు గాడీ
ఆ: ఎన్ని కోట్ల విలువుంటుందో నువ్వు కాల్చు బీడీ
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో నిన్ను కన్న డాడీ
అ: వేస్తా బేడీ చే స్తా దాడి సొగసుల బావిని తోడి
ఆ: రారా రౌడీ దాదా కేడీ రాత్రికి చూసెయ్ త్రీడీ
నీ గుర్రం కోసం పెంచా నేనే...
నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డి
అ: నీ అధరామృతం పుల్లారెడ్డి... (2)
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా
వడ్డీ మీద వడ్డీ
ఆ: నువు విజిలేస్తే ఆంధ్రా సోడాబుడ్డి...
చరణం : 2
అ: కోక బ్యాంకు లాకర్లోనా
దాచుకోకు వేడి
చెక్కులిస్తే చిక్కొస్తుందే ఇచ్చుకోవే డీడీ
ఆ: నువ్వు తాకకుంటే
పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగా సుఖపడిపోరా దాన్ని నువ్వు వాడి
అ: అరె పుంజు కోడి...
పంటకు పాడి నువ్వూ నేనొక జోడీ
ఆ: చింతల్‌పూడి చిలకల్‌పూడి పోదామా జతకూడి
ఓరయ్యో నీది చెయ్యేకాదు...
అ: హేయ్
ఓరయ్యో నీది చెయ్యేకాదు... విశాఖ ఉక్కు కడ్డీ...
॥విజిలేస్తే॥
ఆ: వేస్కో... వేస్కో... విజిలేస్కో...

alalE pomgenu - అలలే పొంగేను


చిత్రం : సంభవామి యుగేయుగే (sambhavAmi yugEyugE)(2005)

రచన : కృష్ణచైతన్య
సంగీతం : అనిల్. ఆర్
గానం : రాంకీ

పల్లవి :
అలలే పొంగేను వేగంగా
అలుపే రాదంది ఈ గంగ
స్నేహం స్వరంలా నాతో వరంలా
కథకాని తీపి కలలా...
అలలే పొంగేను వేగంగా
అలుపే రాదంది ఈ గంగ
మొదలంటూ లేదు... తుదికంటూ రాదు
మిగిలుంది పోనివ్వు అలా
చరణం : 1
ఏనాటి బంధం మదిలో ఆనందం
నుదిటిరాత అనుకో...
మీ వెంటే నేను సరి నా వెంటే మీరు
విడని తోడు అనుకో...
పసి మనసులన్నీ ఈ వేళ
ఒకటైనదేమో అది నీ లీల...
చరణం : 2
చీకటి పోని... వెలుగంతా రాని మన ని ఒక్కటననీ...
ఓ... ఆడిందే ఆట మేం పాడిందే పాట
ఒట్టేసి అన్నమాట...
సెలయేటి పైన చిన్ని వాన
విడలేము నిన్ను ఓ క్షణమైనా
కలిసే ఉంటాము... కలలే కంటాము
కనులన్నీ కలల అలలే
అలలే పొంగేను వేగంగా
అలుపే రాదంది ఈ గంగా
దేహం నాదంటూ... ప్రాణం నీదంటూ
జననం నీతోనే... మరణం నీతోనే...

Special Note:
అనిల్ పూర్తిపేరు తుమ్మా అనిల్‌రెడ్డి. మే 25, 1974లో గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో పుట్టారు. సంగీత దర్శకుడిగా ‘సంభవామి యుగేయుగే’ చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత నిన్న నేడు రేపు, గ మ్యం, కళవర్ కింగ్, ఔఆగి వంటి చిత్రాలకు సంగీతం అందించారు. ఏప్రిల్ 22, 2011లో మరణించారు.

ammAy manasulO - అమ్మాయ్ మనసులో

చిత్రం : ఇద్దరమ్మాయిలతో(iddarammAyilathO) (2013)

రచన : భాస్కరభట్ల
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : సాగర్, గీతామాధురి

సాకీ :
ఆమె: అమ్మాయ్ మనసులో
అబ్బాయ్ దూరేసి
కితకితలే పెట్టేస్తే ఏమౌతాది..?
అతడు: మంచి బీటొస్తాది
పిచ్చ పాటొస్తాది
ఆ: అబ్బాయ్ మనసునే
అమ్మాయ్ లాగేసి
తలగడలా నొక్కేస్తే ఏమైతాది..?
అ: మస్త్ మాసొస్తాది బెస్ట్ ఊపొస్తాది...
పల్లవి :
అ: రాయే రాయే నా రాకాసీ...
నువ్వే పైటేసీ అట్టా దోపేస్తే
టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో... (2)
ఆ: రారో రారో నా శివకాశి...
అగ్గిరాజేసీ... సిగ్గుపేల్చేస్తే...
టాపు లేసిపోద్ది... పోద్ది... పో... పో... (2)
చెటు ్టమీద మ్యాంగోలా... నువ్వెంత సక్కగున్నావే
చాకులాంటి పిల్లాడే... ఎంతషార్ప్‌గున్నాడే
చాకొచ్చీ మ్యాంగో కోస్తే...
టాపు లేసిపోద్ది... కన్నే కొట్టావంటే
టాపు లేసిపోద్ది... ముద్దే పెట్టావంటే
ఆ: టాపు లేసిపోద్ది... చెయ్యే పట్టావంటే
టాపు టాపు టాపు లేసిపోద్దిరో... ॥
చరణం : 1
అ: ఏయ్... సమ్మర్లోనా లస్సీలా వింటర్లోనా కాఫీలా
ఊరిస్తున్నావే పట్టి లాగేస్తున్నావే
పిల్లా పొంగేపొంగే పూరీలా
ఆ: రాంబోకేమో తమ్ముళ్లా... జాకీచాన్ అల్లుళ్లా
ముద్దొస్తున్నావే వచ్చి గుద్దేస్తున్నావే
అబ్బో బ్రేకుల్లేని లారీలా
అ: రాయే రాయే నా రాకాసీ...
అట్టా న వ్వేసీ గుండె తవ్వేస్తే
ఆ: రారో రారో నువ్ చిటికేసి
షర్టు మడతేసీ కాలరెగరేస్తే
అ: టాపు లేసిపోద్ది... ఓణీ కట్టావంటే
టాపు లేసిపోద్ది... పూలే పెట్టావంటే
ఆ: టాపు లేసిపోద్ది... ఈలే కొట్టావంటే
టాపు టాపు టాపు లేసిపోద్దిరో...
చరణం : 2
అ: ఏయ్... కోతికేమో కొబ్బర్లా... పిల్లాడికి బర్గర్లా...
నచ్చేస్తున్నావే.. కల్లోకొచ్చేస్తున్నావే...
అరె కొత్త ఫిలిమ్ ట్రైలర్లా
ఆ: పోలీసుకీ రౌడీలా... ఆడోళ్లకీ చాడీలా
బుక్కైపోయావే నాకు సెట్టైపోయావే
సోడాబుడ్డిలోని గోళీలా
అ: రాయే రాయే నా రాకాసి...
గోళ్లుకొరికేసీ ఒళ్లు విరిచేస్తే
ఆ: రారో రారో నువ్ ఇటుకేసి
ప్యాంటు మార్చేసి లుంగీ కట్టేస్తే
అ: టాపు లేసిపోద్ది... కాటుకెట్టావంటే
టాపు లేసిపోద్ది... గాజులేశావంటే
ఆ: టాపు లేసిపోద్ది... గోడే దూకావంటే
టాపు లేసిపోద్ది... డోరే కొట్టావంటే
టాపు లేసిపోద్ది... టాపు లేసిపోద్ది...
టాపు టాపు టాపు... టాపు లేసిపోద్ది...