Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

mEghamai nEnu - మేఘమై నేను

చిత్రం : నువ్వు వస్తావని(nuvvu vastAvani) (2000)

రచన : పోతుల రవికిరణ్
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
గానం : రాజేష్, సుజాత

పల్లవి :
అతడు: మేఘమై నేను వచ్చాను
మెరుపులో నిన్ను వెతికాను (2)
ఎవరితో కబురే పంపను
ఎన్నటికి నిన్ను చేరెదను
ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ...||మేఘమై||

చరణం : 1
అ: నిన్ను వలచి అన్ని మరచి కలతపడి నిలుచున్నా
నిన్ను తలచి కనులు తెరచి కలలోనే ఉన్నా
ఆమె: పాటే నే విన్నది మాటే రాకున్నది
వేరే ధ్యాసన్నది ఏదీ లేకున్నది
ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ...||మేఘమై||

చరణం : 2
ఆ: నినుచూడని కనులేనని కలవరించే హృదయం
నిను వీడని నీ నీడలా సాగింది బంధం
అ: ప్రేమ బాధన్నది ఎంత తీయనైనది
ఎండమావన్నది సెలయేరైనది
ఓ ప్రియా... ఆ... ఓ ప్రియా... ఆ...||మేఘమై||

Special Note:
సిమ్రాన్ ఏప్రిల్ 4, 1976 ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు శారద, అశోక్ నావల్. ముంబైలో బి.కాం వరకు చదివారు. 1995లో ‘సనమ్ హర్‌జై’ అనే హిందీ చిత్రం ద్వారా సినీపరిశ్రమలో అడుగుపెట్టారు. హిందీ, మలయాళం, తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన తర్వాత తెలుగులో మొదటిసారిగా అబ్బాయిగారి పెళ్లి (1997) లో నటించారు. దాదాపు తెలుగులో అందరి అగ్రహీరోల సరసన కథానాయికగా నటించారు. అన్ని భాషలలో కలిపి సుమారు 80 చిత్రాలకు పైగా నటించారు. డిసెంబరు 2, 2003లో దీపక్ బగ్గాతో వివాహం అయింది. సినీపరిశ్రమకు సంబంధించి 13 అవార్డులను అందుకున్నారు. 2004, జూన్ 10న న్యూఢిల్లీలో జరిగిన ఒలింపిక్ టార్చ్ ర్యాలీలో సిమ్రాన్ పాల్గొన్నారు.

O nADu washingtonlO - ఓ నాడు వాషింగ్టన్‌లో

చిత్రం : గ్రీకువీరుడు(greeku veeruDu) (2013)

రచన : సాహితి
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : ఎస్.పి.బాలు, బృందం


పల్లవి :
అతడు:
ఓ నాడు వాషింగ్టన్‌లో
స్కేటింగ్ చేస్తూ ఉండంగా
మబ్బుల్లో జాబిలిలాగా నేనా పిల్లని చూశాగా
కళ్లే చెదిరే ఆ అందం నా ముందే కనిపించంగా
నే సంబరపడిపోయా
తను తికమక పడుతూ నాపై పడిపోయే
హాస్పిటిల్‌లో చేర్చాక ఆ పిల్లే ఓ డాక్టర్‌గా
తొలి పరిచయమయ్యాక
నే మాటలు కలిపేశాలే సరదాగా
బృందం: వింతగ మొదలే అయిన
స్నేహమే అలా ప్రేమగ మారేనంటా
ఎప్పటినుంచో కన్న తీయని
నా కల అప్పుడు తీరేనంటా॥నాడు॥
చరణం : 1
బృం: ప్యారీ ప్యారీ నీ లవ్‌స్టోరీ
చివరకు ఎట్టా గెలిచిందో చెపుతావా ఓ బావా
అ: అదో భారీ సో లాంగ్ స్టోరీ
ఓ... బాక్సింగు మల్లన్న ఆ పిల్ల తండ్రి
తిప్పులు తిప్పాడే ఎన్నో తిప్పలు పెట్టాడే
ఓ... నా ఒళ్లు గుల్లైన చేశాను
వాడి పిల్ల కోసమే ఓ మల్లయుద్ధమే
ప్రేమకోసం మృత్యువుతో పోరాడి నేనోడంగా
మనసెంతో వేదనగా
తన కన్నులు జడివానలనే కురవంగా
బిడ్డకోసం తన పంతం
ఆ తండ్రే విడిచేయంగా
నా చెలియే నవ్వంగా
తన ప్రేమనే నీ గెలిచాగా గర్వంగా
బృం: నీ కథ వింటూ ఉంటే
నిండు ప్రేమలో మా ఎద ఉయ్యాలూగే
నీ ఎద తుళ్లే ఆడే పెళ్లి బాటలో ఈ కథ ఎలా సాగే
చరణం : 2
అ: చాదస్తాలా ఆ పిల్లా తల్లి
సాంప్రదాయంతో మతినే పోగొట్టే మా త ల్లి
నన్నే పిలిచి అల్లం టీ ఇచ్చి
హే... తిథి వారఫలాల మేలైన జోడీ
కుదిరినప్పుడే మేళతాళాలందిలే
హే... ధీటైన గుర్రాన్నే నేనెక్కి
స్వారీ చేసినప్పుడే పెళ్లి లగ్గాలందిలే
తాతలనాటి శీలూడి వేలాడే కత్తే ఇచ్చి
నా చేతే పట్టించి నా నడుముకి చమ్కీ పట్టి కట్టింది
పోటాపోటీ ఆ కుస్తీ రంగాన్నే వేదిక చేసి
విరిజల్లుల జడిలోని మహ సందడిగా
మా పెళ్లే జరిపింది
బృం: కాలం కలిసే ఉంటే
మీ కళ్యాణమే ఇక్కడ జరిగుండేది
పెళ్లి వైభోగాన్ని మేమూ చూసుంటే ఎంతో బాగుండేది॥నాడు॥

nIdAnannadirA - నీదాననన్నదిరా


చిత్రం : జయభేరి (jayabhEri) (1959)

గానం : ఘంటసాల
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు


పల్లవి :

నీదాననన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా
నీదాననన్నదిరా నిన్నే నమ్మిన చిన్నదిరా
తానే మధుకలశమని మనసే నందనమనీ
మువ్వలతో నవ్వులతో
మోమోటముగా కులికి॥
చరణం :
చుక్క... చుక్క...
చుక్క కన్న తానే చక్కనిదాననన్నదిరా
ఆ... చుక్కల కన్న తానే చక్కనిదాననన్నదిరా
చక్కని సామి... చక్కని సామీయని
పక్కన జేరి పలుకరించి నీదాననన్నదిరా
హ్హ... హ్హ... నిన్నే నమ్మిన చిన్నదిరా... ఆ...