Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

ennennO varNAlu - ఎన్నెన్నో వర్ణాలు

గీత స్మరణం
 ఏమి ఈ భాగ్యమో నేస్తమా...
 స ప ద ప సనిసా...
 ఏమి ఈ భాగ్యమో నేస్తమా
 నేనే నిండగా ఆ ఎండే పండగా
 ఈ వేసవే కోమలం శీతలం
 ఆ చల్లని చంద్రుని మండలం
 ఈ మందిరం సుందరం అందలం
 ఆ అంబరం సంబరం సంగమం
 ఏమి ఈ భాగ్యమో నేస్తమా...
 గానం : కౌసల్య
 ------------------------
 ఆమె: ఎన్నెన్నో వర్ణాలు... అన్నింట్లో అందాలు
 ఎన్నెన్నో వర్ణాలు అన్నింట్లో అందాలు 
   ఒక టైతే మిగిలేది తెలుపేనండీ
 నలుపేమో నాకిష్టం మీ మనసు మీ ఇష్టం
 నాకోసం మీ ఇష్టం వదలొద్దండీ
 మీ మది తొందర చేసే బాటను వీడక 
   మీరు సాగిపోండిక
 ఇదే ఇదే నా మాటగా పదే పదే నా పాటగా 
 ఎన్నెన్నో వర్ణాలు...
 అతడు: నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం
   పడలేను ఏ జోక్యం అంతేనండీ
 బాగుంది మీ టేస్టూ నాకెంతో నచ్చేట్టు 
   మనసెంతో మెచ్చేట్టు మీ మీదొట్టు
 అందుకే నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా అందుకె నే దిగివచ్చా వంచని నా తలవంచా స్నేహ భావమా
 కలా నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే
 ॥
 గానం : ఎస్.పి.బాలు, కౌసల్య
 ఆమె: పొగడమాకు అతిగా చేసెయ్యమాకు పొగడపూల లతగా
 రాసినావు చాలా ఆ రాతలంత నేను ఎదిగిపోలా
 నువ్వనే వచ్చింది నా నోట చనువుగ
 పిలుపులో తడబాటు ఆ మాట పలుకగ
 తెలుసుకుంటే పొరబాటు
 అతడు: నువ్వు అంటూ పిలుపు నాకెంతో నువ్వు దగ్గరైన తలపు
 పరిచయాల మలుపు దాచేసుకున్న మాటలన్నీ తెలుపు
 చిగురులే వేసేను ఈ కొమ్మ హొయలుగ
 పూవులై పూసేను ఈ జాబు చదవగ
 ఊహలేవో ఉదయించే
 ॥
 గానం : ఎస్.పి.బాలు, కౌసల్య
 ------------------------
 చిత్రం : ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు(avuni vALLiddaru istapaDDAru) (2002)
 రచన : సాయి శ్రీహర్ష, సంగీతం : చక్రి

nI jatagA - నీ జతగా

చిత్రం: ఎవడు(evaDu) (2013)

రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గానం: కార్తీక్, శ్రేయాఘోషల్


 పల్లవి :
ఆమె: నీ జతగా నేనుండాలి
నీ ఎదలో నే నిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
అతడు: నాకే తెలియని
నను చూపించి నీకై పుట్టాననిపించి
నీ దాకా నను రప్పించావే
నీ సంతోషం నాకందించి నా పేరుకి అర్థం మార్చి
నేనంటే నువ్వనిపించావే ॥జతగా॥
చరణం : 1
ఆ: కల్లోకొస్తావనుకున్నా తెల్లార్లు చూస్తూ కూర్చున్నా
రాలేదే... జాడైనా లేదే...
అ: రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నా
పడుకోవే... పైగా తిడతావే...
ఆ: లోకంలో లేనట్టే మైకంలో నేనుంటే
వదిలేస్తావా నన్నిలా
అ: నీలోకంలో నాకంటే ఇంకేదో
ఉందంటే నమ్మే మాటలా ॥జతగా॥
చరణం : 2
అ: తెలిసి తెలియక వాలింది
నీ నడుమొంపుల్లో నలిగింది
నా చూపు... ఏం చేస్తాం చెప్పు...
ఆ: తోచని తొందర పుడుతుంది
తెగ తుంటరిగా నను నెడుతుంది
నీ వైపు... నీదే ఆ తప్పు
అ: నువ్వంటే నువ్వంటూ
ఏవేవో అనుకుంటూ విడిగా ఉండలేముగా
ఆ: దూరంగా పొమ్మంటూ
దూరాన్నే తరిమేస్తూ ఒకటవ్వాలిగా ॥జతగా॥

bongarAlanTi - బొంగరాలంటి

గీత స్మరణం : అత్తారింటికి దారేది చిత్రంలోని ఓ పాట
 పల్లవి :  బొంగరాలంటి కళ్లు తిప్పింది
   ఉంగరాలున్న జుట్టు తిప్పింది
 గింగిరాలెత్తే నడుమొంపుల్లో
   నన్నే తిప్పింది
 అమ్మో బాపుగారి బొమ్మో
   ఓలమ్మో మల్లెపూల కొమ్మో
 రబ్బరుగాజుల రంగు తీసింది
   బుగ్గల అంచున ఎరుపు రాసింది
 రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసింది
 అమ్మో దాని చూపు గమ్మో ఓలమ్మో ఓల్డు మాంక్ రమ్మో
 పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
 కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
 ఏకంగా ఎద పైనే నర్తించింది అబ్బా...
 నాట్యంలోని ముద్దర చూసి నిద్దరే నాదే పోయింది॥
 చరణం : 1
 మొన్న మేడ మీద బట్టలారేస్తూ కూనిరాగమేదో తీసేస్తూ
 పిడికెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా
 నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ నాజూకైన వేళ్లు తాకిస్తూ
 మెత్తని మత్తుల విద్యుత్ తీగై ఒత్తిడి పెంచిందే మళ్లా
 కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
 ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుంది
 పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
 చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది
 పొద్దు పొద్దున్నే హల్లో అంటుంది
 పొద్దుపోతే చాలు కల్లోకొస్తుంది
పొద్దస్తమానం పోయినంత దూరం గుర్తొస్తుంటోంది॥
 చరణం : 2
 ఏ మాయలోకంలోనో నను మెల్లగ తోసేసింది
 తలుపులు మూసింది తాళం పోగొట్టేసింది
 ఆ మబ్బుల అంచులదాకా నా మనసును మోసేసింది
 చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగింది
 తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టి మూసేసింది
 అందమే గంధపు గాలై మళ్లీ ఊపిరి పోసింది
 తియ్యని ముచ్చటలెన్నో ఆలోచన్లో అచ్చేసింది
 ప్రేమనే కళ్లద్దాలు చూపులకే తగిలించింది
 కోసల దేశపు రాజకుమారి ఆశలు రేపిన అందాల పోరీ
 పూసల దండలో నన్నే గుచ్చి మెళ్లో వేసింది॥

చిత్రం : అత్తారింటికి దారేది.. (AttArinTiki dArEdi)(2013)

 రచన : రామజోగయ్యశాస్త్రి
 సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : శంకర్ మహదేవన్