Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

adi oka idilE - అది ఒక ఇదిలే


చిత్రం : ప్రేమించిచూడు (prEminchi chUDu) (1965)

 రచన : ఆచార్య ఆత్రేయ
 సంగీతం : మాస్టర్ వేణు
 గానం : పి.బి.శ్రీనివాస్, పి.సుశీల

 


గీత స్మరణం
 పల్లవి :
 ఆమె: అది ఒక ఇదిలే అతనికే తగులే
 సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
 ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
 లాలలాలలాలలాలలలా    ॥
 అది ఒక ఇదిలే...
 చరణం : 1
 అతడు: మెచ్చాను వచ్చాను ఏమేమో తెచ్చాను
 అహ నచ్చాను అన్నావా ఏమైనా ఇస్తాను
 అని పలికిందిరా... చె లి కులికుందిరా...
 ఎద రగిలిందిరా మతి చెదిరిందిరా చెదిరిందిరా...
 అది ఒక ఇదిలే ఆమెకె తగులే
 సరికొత్త సరసాలు సరదాలు చవిచూపెలే
 ఆహ ఎనలేని సుఖమెల్ల తనతోటిదనిపించెలే
 అది ఒక ఇదిలే...
 చరణం : 2

 ఆ: సిగ్గేల అన్నాడు నా బుగ్గ గిల్లాడు     (2)
 అహ మొగ్గల్లే ఉన్నావు విరబూయమన్నాడు
 మది పులకించెను...  మరులొలికించెను...
 నను మరిపించెను తగుననిపించెను అనిపించెను...
 అది ఒక ఇదిలే...
 చరణం : 3
 అ: నడకేది అన్నాను నడిచింది ఒకసారి
 అహ నడుమేది అన్నాను నవ్వింది వయ్యారి
 నా వద్దున్నదే... తన ముద్దన్నదీ...
 చేకొమ్మన్నదీ నీ సొమ్మన్నది... సొమ్మన్నది
 ఆ: ఎండల్లే వచ్చాడు
   మంచల్లే కరిగాను
 ఆహా వెన్నెల్లు కురిశాడు
   వేడెక్కిపోయాను
 ఇది బాధందునా
   ఇది హాయందునా
 ఏది ఏమైననూ నే తనదాననూ
   తనదాననూ...॥

ammA ani kottagA - అమ్మా అని కొత్తగా

 

చిత్రం : లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ (Life Is Beautiful) (2012)


AmmA Ani Kothaga Youtube Video Song - Life Is Beautiful Movie


 రచన : వనమాలి
 సంగీతం : మిక్కీజె. మేయర్
 గానం : శశికిరణ్, శ్రావణభార్గవి
గీత స్మరణం
పల్లవి :
 ఆమె: అమ్మా అని కొత్తగా...
   మళ్లీ పిలవాలనీ...
 తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ
 అతడు: నింగి నేల
   నిలిచే దాకా తోడుగా
 వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
 నువు కావాలే అమ్మా...
 నను వీడొద్దే అమ్మా...
 బంగారం నువ్వమ్మా...
 అమ్మా అని కొత్తగా...
   మళ్లీ పిలవాలననీ...
 తుళ్లే పసిప్రాయమే మళ్లీ మొదలవ్వనీ
 చరణం : 1
 అ: నిదురలోని కల చూసి
   తుళ్లి పడిన ఎదకి
 ఏ క్షణం ఎదురౌతావో జోలపాటవై
 ఆ కలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై
 ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై
 నింగి నేల నిలిచే దాకా తోడుగా
 వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
 నువు కావాలే అమ్మా...

 నను వీడొద్దే అమ్మా..
 బంగారం నువ్వమ్మా...
 చరణం : 1
 అ: చిన్ని చిన్ని తగవులే
   మాకు లోకమైన వేళ
 నీ వెతలు మనసెపుడైన
   పోల్చుకున్నదా
 రెప్పలా కాచిన నీకు
  కంటి నలుసులాగ
 వేదనలు పంచిన మాకు
 వేకువున్నదా
 నింగి నేల నిలిచే దాకా తోడుగా
 వీచే గాలి వెలిగే తారల సాక్షిగా
 నువు కావాలే అమ్మా...
 నను వీడొద్దే అమ్మా...
 బంగారం నువ్వమ్మా...

Amma Ani Kothaga Full Song with Lyrics - Life is Beautiful Movie


manasu needE - మనసు నీదే

చిత్రం : చిరంజీవులు (chiranjeevulu) (1956)

రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం, గానం : ఘంటసాల

పల్లవి :
మనసు నీదే మమత నాదే
నా దానవే నే నీవాడనే     (2)
చరణం : 1
చివురు మామిడి పందిళ్లనీడా
నిలిచింది చిలక నా కోసమే     (2)
చివురింటి చిన్నదానా
నా దానవే నే నీవాడనే॥
చరణం : 2
కనుల కాటుక కళ్యాణ తిలకం
నగుమోము కలకల నా కోసమే     (2)
చిరునవ్వు చిన్నదాన
నా దానవే నే నీవాడనే॥
చరణం : 3
పువ్వులు జల్లి పన్నీరు జల్లి దీవించి
మీ వారు పంపేరులే పువ్వులు జల్ల్లి పన్నీరు జల్లి
దీవించి మీ వారు పంపేరులే
మనసైన చిన్నదానా మీ ఇంటికి మా ఇంటికీ॥