Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

rOjAlE lEtavannelE - రోజాలో లేతవన్నెలే

చిత్రం : ఘర్షణ - gharshaNa (1988)

 గానం : వాణీజయరాం, బృందం
 రచన : రాజశ్రీ
 సంగీతం : ఇళయరాజా
గీత స్మరణం
 పల్లవి :
 రోజాలో లేతవన్నెలే రాజాకే తేనె విందులే
 ఊసులాడు నా కళ్లు నీకు నేడు సంకెళ్లు
 పాలపొంగు చెక్కిళ్లు వేసెపూల పందిళ్లు
 లవ్ లవ్ ఈ కథా ఓహో మన్మథా
 మైకం సాగనీ దాహం తీరనీ॥
 చరణం : 1
 మొన్న చిగురేసెనే నిన్న మొగ్గాయెనే
 నేడు పువ్వాయెనే తోడుకల్లాడెనే
 సందేళ వయసెందుకో చిందులేస్తున్నదీ
 అందాల సొగసేమిటో అందుకోమన్నదీ
 క్షణం క్షణం ఇలాగే వరాలు కోరుతున్నది చిన్నది ॥
 చరణం : 2
 ముద్దు మురిపాలలో సద్దులే చేసుకో
 వేడి పరువాలలో పండగే చేసుకో
 నా చూపులో ఉన్నవీ కొత్త కవ్వింతలూ
 నా నవ్వులో ఉన్నవీ కోటి కేరింతలూ
 ఇవే ఇవే ఈవేళ సుఖాల పూల వేడుక వేడుక
* * * * *

రాజా రాజాధి - rAjA rAjAdhirAjA - రాజా రాజాధి

 పల్లవి :
 రాజా రాజాధి రాజాధి రాజా
 పూజ చెయ్యాలి కుర్రకారు పూజ॥
 నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా (2)
 కోట లేదు పేటా లేదు అప్పుడు నే రాజా ॥
 చరణం : 1
 ఎదురూ లేదు బెదురూ లేదు... లేదు నాకు పోటి
 లోకం లోనా లోకుల్లోనా నేనే నాకు సాటి ॥
 ఆడి పాడేనులే అంతు చూసెనులే
 చెయ్యి కలిపేనులే చిందులేసేనులే
 చీకు చింతా లేదు ఇరుగూ పొరుగూ లేదు
 ఉన్నది ఒకటే ఉల్లాసమే ॥చింతా॥
 నింగీ నేల నీరు నిప్పు గాలి దూళి నాకే  తోడు ॥
 చరణం : 2
 రైకా కోకా రెండూ లేవు ఐనా అందం ఉంది
 మనసు మంచి రెండూ లేదు ఐనా పరువం ఉంది ॥కోకా॥
 కలలూరించెనే కథలూరించెనే
 కళ్లు వలవేసెనే ఒళ్లు మరిచేనులే
 వన్నెల పొంగులు కలవి మత్తుగ చూపులు రువ్వి
 రచ్చకు ఎక్కే రాచిలకలే
 ॥॥॥
 గానం : ఎస్.పి.బాలు, బృందం

chemmachekka 2 - చెమ్మచెక్క చెమ్మచెక్క జున్నుముక్క

చిత్రం : బొబ్బిలిరాజా - bobbili rAjA(1990)

 రచన : సిరివెన్నెల, సంగీతం : ఇళయరాజా
 గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర
గీత స్మరణం
పల్లవి : అతడు: చెమ్మచెక్క చెమ్మచెక్క జున్నుముక్క చెంపనొక్క
 ఆమె: నిమ్మచెక్క నిమ్మచెక్క నమ్మకంగ తిమ్మిరెక్క
 అ: కో... అంది కోక ఎందుకో
 ఆ: కోరింది కోసి అందుకో
 అ: రాణీ... ఐ లవ్ యూ...
 ఆ: రాజా... ఐ లవ్ యూ...
 చరణం : 1
 అ: మారుమూల సోకుచేర లేఖరాయనా
 ఆ: సరసాలు కోరు సంతకాలు తాకి చూడనా
 అ: తేరిపార చూడనీ దోర ఈడునీ
 ఆ: చీర చూరు దాటనీ వేడి ఊహనీ
 అ: వెక్కిరించు వన్నెలన్ని కొల్లగొట్టుకోనీ
 ఆ: పళ్లగాటు కత్తిరించు కన్నె కంచెలన్నీ
 అ: రా... గారంగా
 ఆ: సైరా... సారంగా...
 చరణం : 2
 ఆ: ఈటెలాటి నాటుచూపు నాటుకున్నదీ
 అ: అలవాటులేని చాటుచోట మాటుకున్నదీ
 ఆ: ఈదలేను యవ్వనం ఆదరించవా
 అ: మీదవాలు మోజుతో స్వాగతించవా
 ఆ: రంగ రంగ వైభవాల మంచుమేలుకోవా
 అ: గంగ పొంగు సంబరాల రంగుతేరనీవా
 ఆ: ఈ... ఏకాంతం...
 అ: జాలీ... హహ్హా... కైలాసం...

ammO ammO enta - అమ్మో అమ్మో ఎంత

చిత్రం : అల్లుడుగారు - alluDugAru (1990)

 రచన : రసరాజు
 సంగీతం : కె.వి.మహదేవన్
 గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర


పల్లవి :
 అతడు: అమ్మో... అరె...
 అమ్మో అమ్మో ఎంత ముద్దుగున్నావే ఘుమఘుమ
 పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ
 పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ
 ఆమె: అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ
 పుణ్యమెంత చేశానో పున్నమిరేడా
 పుట్టావా నాకోసం ముద్దుల మగడా
 చరణం : 1
 అ: అమ్మో చెయ్యేసి చూడు ఒళ్లంత సెగలు సెగలు
 అబ్బో వాటేసి చూడు కళ్లల్లో పొగలు పొగలు
 ఆ: అమ్మో చెవిపెట్టి చూడు గుండెల్లో గుబులు గుబులు
 అబ్బో ముద్దాడి చూడు బుగ్గల్లో వగలు వగలు
 అ: ఇద్దరమూ ఒకటైతే ఇంకేముంది
 ఆ: ముద్దు ముద్దు ఒకటైతే హద్దేముంది
 అ: కలిసిపోయి కరిగిపోయి కౌగిలిలో తడిసిపోయి
 ఉందామా కలకాలం ఒకే తనువుగా
 ఆ: అబ్బో అబ్బో ఎంత సొగసున్నావో ఝమఝమ
 అ: పూజలెన్ని చేశానో పూవుల రెమ్మ
 పుట్టావా నాకోసం పుత్తడిబొమ్మ
 చరణం : 2
 ఆ: అయ్యో ఈ పాడు మనసు రేగిందా చిత్తు చిత్తు
 అబ్బీ ఈ పాలపొంగు ఊగిందా మత్తు మత్తు
 అ: అయ్యో ఈ కోడె వయసు అలిగిందా పోరు పోరు
 అమ్మీ ఈ వలపు దెబ్బ అదిరిందా హోరు హోరు
 ఆ: కైపంతా కళ్లల్లో కాపురముంటే
 అ: పగలేమిటి రేయేమిటి రెండూ ఒకటే
 ఆ: ఒకరికొకరు ఓడిపోయి ఒడిలోపల ఒదిగిపోయి
 ఉందామా కలకాలం ఒకే మనువుగా
 ॥అమ్మో॥॥అబ్బో॥