Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

tummedA O tummedA - తుమ్మెదా ఓ తుమ్మెదా

చిత్రం : శ్రీనివాస కళ్యాణం - SrInivasa kalyaNam (1987)

 రచన : సిరివెన్నెల
 సంగీతం : కె.వి.మహదేవన్
 గానం : ఎస్.పి.బాలు, పి,సుశీల

పల్లవి :
 ఆమె: తుమ్మెదా... ఓ తుమ్మెదా...
 ఎంత తుంటరోడే గోవిందుడు తుమ్మెదా ॥
 అతడు: మగడులేని వేళ తుమ్మెదా
 వచ్చి మొగమాట పెడతాడే తుమ్మెదా
 ఆ: మాట వరసకంటూ తుమ్మెదా
 పచ్చి మోటసరసమాడే తుమ్మెదా
 అత్త ఎదురుగానే తుమ్మెదా
 రెచ్చి హత్తుకోబోయాడే తుమ్మెదా ॥
 చరణం : 1
 ఆ: ఎదురుపడితే కదలనీక దడికడతాడే
 పొదచాటుకు పద పదమని సొదపెడతాడే ॥
 అ: ఒప్పనంటే వదలడమ్మా
 ముప్పు తప్పదంటే బెదరడమ్మా ॥
 చుట్టుపక్కలే మాత్రం చూడని ఆత్రం
 పట్టు విడుపులేనిదమ్మా కృష్ణుని పంతం ॥॥
 చరణం : 2
 ఆ: తానమాడువేళ తాను దిగబడతాడే
 మాను మాటు చేసి చూడ ఎగబడతాడే ॥
 అ: చెప్పుకుంటే సిగ్గుచేటు
 అబ్బ నిప్పులాంటి చూపు కాటు ॥
 ఆ: ఆదమరచి ఉన్నావా కోకలు మాయం
 ఆనక ఏమనుకున్నా రాదే సాయం ॥॥

bAlanurA madanA - బాలనురా మదనా

చిత్రం : మిస్సమ్మ - Missamma (1955)

 గానం : ఎ.ఎం.రాజా
 రచన : పింగళి నాగేంద్రరావు
 సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

గీత స్మరణం
పల్లవి :
 బాలనురా మదనా...
 బాలనురా మదనా
   విరితూపులు వేయకురా మదనా
 బాలనురా మదనా...
 చరణం : 1
 నిలచిన చోటనె నిలువగ నీయక...     (2)
 వలపులు కురియునురా
 తీయని తలపులు విరియునురా మదనా ॥
 చరణం : 2
 చిలుకలవలె గోర్వంకల వలెనూ...     (2)
 కులుకగ తోచునురా
  తనువున పులకలు కలుగునురా మదనా ॥
 చరణం : 3
 చిలిపికోయిలలు...
 చిలిపికోయిలలు చిత్తములోనె
   కలకల కూయునురా
 మనసును కలవరపరచునురా మదనా ॥

- - - - -

I navanavAbhyudaya - ఈ నవనవాభ్యుదయ

  గానం : పి.సుశీల
 పల్లవి :
 ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో... ఓ... ఈ నవనవాభ్యుదయ విశాల సృష్టిలో...
 చిత్రములన్నీ నావేలే
 కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే     (2)
 చరణం : 1
 తళుకుతళుకుమని తారలు మెరిసే
    నీలాకాశము నాదేలే
 ఎల్లరి మనముల కవలరపరిచే...
 జిలిబిలి జాబిలి నాదేలే
 కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే     (2)
 చరణం : 2
 ప్రశాంత జగమును హుషారుచేసే
 వసంత ఋతువు నాదేలే
 పూవులు ఘుమఘుమ చల్లగ విసిరే
 మలయమారుతము నాదేలే
 కావాలంటే ఇస్తాలే నావన్నీ ఇక నీవేలే     (2)
External Link:
View All Songs
Listen Missamma Songs

okkaTE ASa - ఒక్కటే ఆశ

చిత్రం : ఏప్రిల్ 1 విడుదల - April ! Release (1991)

 రచన : సిరివెన్నెల
 సంగీతం : ఇళయరాజా
 గానం : మనో, కె.ఎస్.చిత్ర



పల్లవి :  ఆమె: ఒక్కటే ఆశ అందుకో శ్వాస
 అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశా
 (2)
 అతడు: చుక్కనే చూశా లెక్కలే వేశా
 నింగిపై అంగలే వేశా కిందికే దించేశా
 (2)
 ఆ: ఒక్కటే ఆశ...
 అ: అందుకో శ్వాసా...

 చరణం : 1
 ఆ: మెత్తగా ఒళ్లో పెట్టుకో కాళ్లు ఉందిగా అంకపీఠం ఆడపుట్టుకే అందుకోసం
 అ: గట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకో పుచ్చుకో పాదతీర్థం పాదపూజలే అది పాఠం
 ఆ: చాకిరీ చెయ్యనా బానిసై నీ సేవలే చెయ్యనా పాదుషా
 అ: దీవెనే తీసుకో బాలికా నీ జీవితం సార్థకం పొమ్మిక
 ఆ: మొక్కులే తీరి అక్కునే చేరి దక్కెనే సౌభాగ్యం
 అ: చుక్కనే చూశా లెక్కలే వేశా నింగిపై అంగలే వేశా కిందికే దించేశా
 ఆ: అచ్చగా అంకితం చేశా పుచ్చుకో ప్రాణేశా
 ఆ: ఒక్కటే ఆశ...
 అ: అందుకో శ్వాస...

 చరణం : 2
 ఇద్దరు: తాతారరు తారరు తాతారరు తారూ తాతరరు తారరు
 తాతారరు తారూ తారా తారారా తారారా తారరారా
 అ: నచ్చనే నారీ వచ్చెనే కోరీ తెచ్చెనే ప్రేమ సౌఖ్యం సాటిలేనిదీ ఇంతి సఖ్యం
 ఆ: మెచ్చెనే చేరీ ముచ్చటే తీరీ ఇచ్చెనే ప్రేమరాజ్యం అంతులేనిదే సంతోషం
 అ: స్వప్నమే సత్యమై వచ్చెనేమో వెచ్చగా సర్వము పంచగా
 ఆ: స్వర్గమే స్వంతమై దక్కెనేమో అచ్చటా ముచ్చటా తీర్చగా
 అ: మక్కువే మీరి ముద్దులే కోరి అందెనా ఇంద్రభోగం    ॥