Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

srusTikarta oka brahma - సృష్టికర్త ఒక బ్రహ్మ

చిత్రం : అమ్మరాజీనామా - amma rAjInAmA (1991)

 రచన : దాసరి నారాయణరావు - dAsari nArAyaNarAo
 సంగీతం : చక్రవర్తి - Chakravarti
 గానం : కె.జె.ఏసుదాస్ - K. J. yEsudAs

పల్లవి :
 సృష్టికర్త ఒక బ్రహ్మ
 అతనిని సృష్టించినదొక అమ్మ ॥
 ఆ అమ్మకే తెలియని చిత్రాలు ఎన్నో
 ఈ సృష్టినే స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో ॥
 చరణం : 1
 బొట్టుపెట్టి పూజచేసి
 గడ్డి మేపి పాలు తాగి
 వయసు ముదిరి వట్టిపోతే గోవుతల్లే కోతకోత ॥
 విత్తునాటి చెట్టు పెంచితే...
 చెట్టు పెరిగి పళ్ళు పంచితే...
 తిన్న తీపి మరచిపోయి చెట్టుకొట్టి కట్టెలమ్మితే
 లోకమా ఇది న్యాయమా? (2) ॥
 చరణం : 2
 ఆకుచాటు పిందె ముద్దు
 తల్లిచాటు బిడ్డ ముద్దు
 బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నత ల్లే అడ్డు అడ్డు ॥
 ఉగ్గుపోసి ఊసు నేర్పితే...
 చేయిబట్టి నడక నేర్పితే...
 పరుగు తీసి పారిపోతే
 చేయిమార్చి చిందులేస్తే
 లోకమా ఇది న్యాయమా? (2) ॥

nuvvEmi chESAvu nEram - నువ్వేమి చేశావు నేరం

చిత్రం : పెళ్లి చేసుకుందాం - peLLi chEsukundAm  (1997)

రచన : సిరివెన్నెల
 సంగీతం : కోటి. గానం : కె.జె.ఏసుదాస్

గీత స్మరణం
నేడు కె.జె.ఏసుదాస్ పుట్టినరోజు - K. J. yEsudAs Birthday

 పల్లవి :
 నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా     (2)
 చేయూతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం గమనించుమా
 కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా
 మార్గం చూపే దీపం కాదా ధైర్యం    ॥
 చరణం : 1
 జరిగింది ఓ ప్రమాదం ఏముంది నీ ప్రమేయం
 దేహానికైనా గాయం ఈ మందుతోను మాయం
 విలువైన నిండు ప్రాణం మిగిలుండటం ప్రధానం
 అది నిలిచినంత కాలం సాగాలి నీ ప్రయాణం
 స్త్రీల తనువులోనే శీలమున్నదంటే
 పురుష స్పర్శతోనే తొలగిపోవునంటే
 ఇల్లాళ్ల దేహాలలో శీలమే ఉండదనా
 భర్తన్న వాడెవ్వడూ పురుషుడే కాదు అనా
 శీలం అంటే గుణం అనే అర్థం    ॥
 చరణం : 2
 గురివింద ఈ సమాజం పరనింద దాని నైజం
 తన కింద నలుపు తత్వం కనిపెట్టలేదు సహజం
 తన కళ్ల ముందు ఘోరం కాదనదు పిరికి లోకం
 అన్యాయమన్న నీపై మోపింది పాప భారం
 పడతి పరువు కాచే చేవలేని సంఘం
 సిగ్గు పడకపోగా నవ్వుతోంది చిత్రం
 ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీ గతికి
 అసలైన అవమానము చూస్తున్న ఆ కళ్లది
 అంతేగాని నీలో లేదే దోషం  ॥

manasu kAsta - మనసు కాస్త

చిత్రం : శ్రీకారం - SreekAram (1996)

సంగీతం : ఇళయరాజా - ILayarAkA
రచన : సిరివెన్నెల సీతారామ శాస్త్రి - sirivennela sItArAma SAstri
గానం : కె.జె.ఏసుదాస్ - K. J. yEsudAs

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
కనులనీరు తుడుచువారు
ఎవరులేరని చితి ఒడికి చేరకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది
వేటాడు వేళతో పోరడమన్నది !!

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు

కలసిరాని కాలమెంత కాటేస్తున్నా
చలి చిదిమేస్తున్నా
కూలిపోదు వేరుఉన్న తరువేదైనా
తనువే మోడైనా
మాను జన్మకన్నా - మనిషి ఎంత మిన్న
ఊపిరిని పోసే ఆడదానివమ్మా
బేలవై నువ్వు కులితే నేలపై ప్రాణం ఉండడమ్మా

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు
ప్రాణమన్నది బంగారు పెన్నిధి !!
నూరేళ్ళ నిండుగా జీవించమన్నది

ఆయువంతా ఆయుధముగా మార్చవే నేడు !
పరిమార్చవే కీడు !
కాళివైతే కాలి కింద అణుగును చూడు !
నిను అణిచేవాడు
మృత్యువు మించే హాని ఎక్కడుంది
ఎంత గాయమైన మాని తీరుతుంది
అందుకే పద ముందుకే
లోకమే రాదా నీ వెనకే

మనసు కాస్త కలత పడితే
మందు ఇమ్మని మరణాన్ని అడగకు