Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : దొంగరాముడు (1955)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : జిక్కి

పల్లవి :
అంద చందాల సొగసరివాడు (2)
విందు భోంచేయి వస్తాడు నేడు
చందమామ... ఓహో చందమామ
చందమామ ఓహో
చందమామ ఓ ఓ ఓ...

చరణం : 1
ఓ ఓ ఓ... చూడచూడంగ
మనసగువాడు
ఈడు జోడైన వలపుల రేడు
ఊఁ... వాడు నీకన్నా సోకైన వాడు
విందు భోంచేయి వస్తాడు నేడు

చరణం : 2
ఓ ఓ ఓ... వాని కన్నుల్లో వెన్నెల్ల జాలు
వాని నవ్వుల్లో ముత్యాలు రాలు
ఊఁ... వాడు నీకన్నా చల్లని వాడు
విందు భోంచేయి వస్తాడు నేడు

చరణం : 3
ఓ ఓ ఓ.. నేటి పోటీల గడుసరివాడు
మాట పాటించు మగసిరివాడు
ఊఁ... వాడు నీకన్నా సిరిగిలవాడు
విందు భోంచేయి వస్తాడు నేడు

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |