చిత్రం : శివాజీ (2007)
రచన : సుద్దాల అశోక్‌తేజ
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : హరిహరన్, మధుశ్రీ, బృందం
పల్లవి :
నవ్వుల్ నవ్వుల్ మువ్వల్ మువ్వల్ (2)
పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్...
నవ్వల్లే మువ్వల్ మువ్వల్...
నా తీయని ఆశల పూలతడి
నీ లావణ్యానికి మొక్కుబడి
నీ కాటుక కళ్లకు జారిపడి
పని బడేట్టు చేరితి పైన బడి
వాజి వాజి వాజి రారాజీ నా శివాజీ
వాజి వాజి వాజి రేరాజే నా శివాజీ
చూపే కత్తికదూ అది నా సొత్తుకదూ
నీలో వాసన నా తనువంతా పూసెళ్లు
ఎదగుత్తులతోనే గట్టిగా ఇపుడే
గుండె ముట్టి వెళ్లు
చరణం : 1
సిరివెన్నెలవే మెలిక మల్లికవే
విరితేనియవే ఇక ఊ అనవే
నా కౌగిటిలో ఇలా ఇలా త్వరగా
పుత్తడిబొమ్మ ఇది
సుందరిని పొందులో నలిపైరా (2)
విధికి తలవంచని రణధీర
ఎదకు ఎద సర సర కలిపైరా
ఓ... మాటలతో ఎందుకే చెలియా
చేతలతోనే రతీమగని ధీటునే
చరణం : 2
పసి జాణ ఇది తన ఊసులతో
కసి తళుకులతో నను లాగెనులే
అందుకొందునుగా
సుఖం సుఖం ఇంకా
ఆనంద సందడిలో
చందురుని మోముగా మలచుకోనా
తారలిక జతులతో ఆడే
వెన్నెలను వేదిక చేసైనా
అరెరరే అల్లరి చేసే చిన్నది చూస్తే
పాలరాతి బొమ్మరో
వాజి... వా వా వా...