చిత్రం : దేవుళ్ళు (2000)
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
గానం : ఎస్.జానకి
పల్లవి : మహా కనకదుర్గా విజయ కనకదుర్గా
పరాశక్తి లలితా శివానంద చరిత
శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల
సృష్టించిన మూలశక్తి
అష్టాదశ పీఠాలను అధిష్టించు ఆదిశక్తి
చరణం : 1
ఓంకార రావాల కృష్ణాతీరంలో
ఇంద్రకీల గిరిపైన వెలసెను
కృతయుగములోన
ఈ కొండపైన అర్జునుడు
తపమును గావించెను
పరమశివుని మెప్పించి
పాశుపతము పొందెను
విజయుడైన అర్జునుని పేరిట
విజయవాడ అయినది ఈ నగరము
జగములన్నియూ జేజేలు పలుకగ
కనకదుర్గకైనది స్థిరనివాసము
మేలిమి బంగరు ముద్దపసుపు
కలగలిపిన వెన్నెలమోము
కోటి కోటి ప్రభాతాల
అరుణిమయే కుంకుమ
అమ్మ మనసుపడి అడిగి ధరించిన
కృష్ణవేణి ముక్కుపుడక
ప్రేమ కరుణ వాత్సల్యం
కురిపించే దుర్గరూపం
ముక్కోటి దేవతలందరికి
ఇదియే ముక్తి దీపం ॥
చరణం : 2 దేవీ నవరాత్రులలో
వేదమంత్ర పూజలలో
స్వర్ణ కవచములు దాల్చిన
కనకదుర్గాదేవి
భవబంధాలను బాపే
బాలా త్రిపురసుందరి
నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి
లోకశాంతినే సంరక్షించే
సుమంత్రమూర్తి గాయత్రి
అక్షయ సంపదలెన్నో అవని జనులకం
దించే దివ్యరూపిణి మహాలక్ష్మి
విద్యా కవన గానమొసగు
వేదమయి సరస్వతి
ఆయురారోగ్యాలు భోగభాగ్యములు
ప్రసాదించు మహాదుర్గ
శత్రు వినాసిని సత్యస్వరూపిణి
మహిషాసురమర్దిని
విజయకారిణి అభయ రూపిణి
శ్రీరాజరాజేశ్వరి
భక్తులందరికి కన్నుల పండుగ అమ్మా
నీ దర్శనం దుర్గమ్మా నీ దర్శనం