Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : రాజాధిరాజు (1980)
రచన : వేటూరి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఎస్.పి.బాలు, బృందం



పల్లవి :

కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ (2)
ఇతడే దిక్కని మొక్కని వాడికి
దిక్కు మొక్కు లేదండండీ (2)
బాబు రాండీ రాండీ శిశువా...
కొత్తా దేవుడండీ కొంగొత్తా దేవుడండీ అండండీ

చరణం : 1
నేలకు సొరగం దించాడండీ
దించిన సొరగం పంచాడండీ
నెత్తిన చేతులు పెడతాడండీ
నెత్తినెట్టుకొని ఊరేగండీ॥॥

చరణం : 2
అంధర్నీ రష్కించేస్తాం అంధాలన్నీ రాసిచ్చేస్తాం
అంధర్నీ రష్కించేస్తాం అంధాలన్నీ...
శృంగారంలో ముంచీ తేల్చీ
బంగారంలో పాతేయిస్తాం
వీరే మీకు సమస్తా వీరికే మీ నమస్తా
దుష్ట రక్షణం శిష్ట శిక్షణం
చేసేయ్ చేసెయ్ మోసేయ్ మోసెయ్ (2)॥

చరణం : 3
అప్పులు గొప్పగ చెయ్యొచ్చండి
అసలుకు ఎసరే పెట్టచ్చండి
పీపాలెన్నో తాగొచ్చండి
పాపాలెన్నో చేయొచ్చండి ॥
పాత దేవుడు పట్టిన తప్పులు
ఒప్పులకుప్పులు చేస్తాడండీ (2)
కొత్త దేవుని కొలిచిన వారికి
కొక్కొక్కొ కొదవే లేదండీ
రాండీ బాబూ రాండీ శిశువా...॥

31st March - నూతన ప్రసాద్‌కు నివాళి

చిత్రం : అదుర్స్ (2010)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : జానియర్ ఎన్.టి.ఆర్., రీటా, బృందం

పల్లవి : ladies and gentleman giving you the don
Move Make way he is just born
Chari he is Chari
He is gonna set a brand new story yo.. oh...
where is that? what is that? (2)
Where is that పంచెకట్టు
Where is that ఓల్డ్ లుక్
Where is that పాత బైక్ చారీ
What is this సూట్ బూటు
What is this ఫ్రెంచ్ కట్
What is this గల్ఫ్ సెంట్ చారీ
I don't want పంచెకట్టు
I don't want ఓల్డ్ లుక్
I don't want పాత బైక్ పోరీ
I like this సూట్ బూటు I like this {ఫెంచ్ కట్
I like this గల్ఫ్ సెంట్ పోరీ
ఫ్యారెక్స్ బేబీలా ఉండే నువ్వు
ఆర్.డి.ఎక్స్. బాంబల్లే అయిపోయావే
నీ రోలెక్స్ బాడీతో మాచ్ అయ్యేలా
జర రీమిక్స్ అయి వచ్చేశానే
where is that ఇప్పేశా where is that కట్‌చేశా
where is that? చెరిపేశా ॥where॥
C H A R I is chari...
He is gonna say brand new story
C H A R I is chari...
అయ్య బాబోయ్ చేస్తాడు గుండె చోరీ

చరణం : 1 రాహుకాలం చూడందే తెల్లారి
మంచినీళ్ళైనా ముట్టని ఓ చారీ
గుడ్‌మార్నింగ్ అన్నావే పెదవుల్తో మితిమీరీ
అరె సెంటిమెంటల్‌గా సుకుమారి
నే ఫాక్స్ టైల్ తొక్కానే కాలు జారీ
ఆ లక్కేదో నా కిక్కు పెంచిందే లక్ మారీ
హే... సేమ్యా ఉప్మాలా ఉండే నువ్వు
చైనీస్ నూడిల్స్‌లా ఛేంజ్ అయ్యావే
ఫెమినా మిస్‌లాంటి నీకోసమే నేను
ఈ స్టైలు మార్చేశానే ॥where॥

చరణం : 2 రివైండ్ చేసి చూస్తే మరీ
స్వాతిముత్యంలాంటిది నీ హిస్టరీ
రొమాన్స్‌లో నీకింత సీను ఉందా బ్రహ్మచారీ
నా డైలీ మంత్రాలు పొలమారీ
ఎపుడేం చదివేశానో నోరు జారీ
నా ఫ్లాష్‌బ్యాక్ మటాషై మారానిలా పిల్ల పోరీ
హే... ఎరబ్రస్‌లాగా ఉండే నువ్వు
ఎయిర్ బస్‌లాగా స్టైల్ అయ్యావే
మెకనాస్ గోల్డ్‌లాంటి నీ బ్యూటీకి
నేను పోటీగా పోటెత్తానే ॥where॥

చిత్రం : మన్మథుడు (2003),
రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
ఆ... ఆ... ఆ... శభాష్...
సగమపా రీపా మపగా రీ సనీపా మపనీసా
ఒరేయ్... వద్దురా సోదరా...
అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో
పడొద్దురా అరేయ్... వద్దురా వద్దు॥
చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి
కల్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా
నీ కొంపముంచేస్తుందిరా
ఆపుకోలేని ఈ తొందర
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ (4)॥

చరణం : 1
శివ అని నా క్లోజ్ ఫ్రెండ్
లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు
కాలేజీలో వాడు గ్రీకువీరుడు
మ్యారేజ్ కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ ఒన్ మన్త్ కాలేదు
ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టూ
బక్కచిక్కి పోయి మంచి లుక్ పోయి
ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటూ
గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు
పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే
తనకి ఐ లవ్ యూ చెప్పాలి
ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తిసామైందిరా కాపురం
పెళ్లి క్షమించరాని నేరం॥॥

చరణం : 2
అంతెందుకు మా మల్లిగాడు
మా ఊళ్లో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దే శముదురు
పెళ్లితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పళ్లేక ఇంటిపోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్కపూట కూడ ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా
కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల
కలిగించింది భక్తియోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం
సంసారమే వేస్టనీ ఇక సన్యాసమే బెస్టనీ
కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా ॥॥

చిత్రం : మన్మథుడు (2003),
రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
ఆ... ఆ... ఆ... శభాష్...
సగమపా రీపా మపగా రీ సనీపా మపనీసా
ఒరేయ్... వద్దురా సోదరా...
అరె పెళ్లంటే నూరేళ్ళ మంటరా
ఆదరా బాదరా నువ్వెళ్లెళ్ళి గోతిలో
పడొద్దురా అరేయ్... వద్దురా వద్దు॥
చెడిపోవద్దు బ్రహ్మచారి పడిపోవద్దు కాలు జారి
తాళి కట్టొద్దు ఖర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి
కల్యాణమే ఖైదురా జన్మంతా విడుదల లేదురా
నీ కొంపముంచేస్తుందిరా
ఆపుకోలేని ఈ తొందర
డోంట్ మ్యారీ... బీ హ్యాపీ (4)॥

చరణం : 1
శివ అని నా క్లోజ్ ఫ్రెండ్
లవ్‌లో పడి పెళ్లి చేసుకున్నాడు
కాలేజీలో వాడు గ్రీకువీరుడు
మ్యారేజ్ కాకముందు రాకుమారుడు
అంతా జరిగి జస్ట్ ఒన్ మన్త్ కాలేదు
ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టూ
బక్కచిక్కి పోయి మంచి లుక్ పోయి
ఫేసు పాలిపోయి జుట్టు రాలిపోయి
ఈ దేవదాసు వాలకం దేనికంటే
తను దేవిదాసు కావడం వల్ల అంటూ
గుక్కపట్టి ఏడ్చాడు ముక్కు చీదుకున్నాడు
ఒక్క చుక్క మందు కొట్టి ఫ్లాష్‌బ్యాక్ చెప్పాడు
పొద్దున్న లేస్తూనే తన అందాన్ని పొగడాలి
మరి ఏపూటకాపూటే
తనకి ఐ లవ్ యూ చెప్పాలి
ఏం కోరినా తక్షణం తీర్చాలిరా ఆ వరం
కత్తిసామైందిరా కాపురం
పెళ్లి క్షమించరాని నేరం॥॥

చరణం : 2
అంతెందుకు మా మల్లిగాడు
మా ఊళ్లో వాడంతటోడు లేడు
మామూలుగానే వాడు దే శముదురు
పెళ్లితోటే పోయింది వాడి పొగరు
ఇల్లాలు అమ్మోరు పళ్లేక ఇంటిపోరు
చల్లారి పోయింది వాడి నెత్తురు
ఒక్కపూట కూడ ఉండదనుకుంటా
కస్సుమనకుండా బుర్ర తినకుండా
వాడ్ని తిట్టింతిట్టు తిట్టకుండా వెంటపడి
తరుముతూనే ఉంటదంటా వీధి వెంటా
కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది
ఆలి కాదురా అది అనకొండ
ఆ గయ్యాళి యమగోల
కలిగించింది భక్తియోగం
ఆ ఇల్లాలి దయ వల్ల కనిపించింది ముక్తిమార్గం
సంసారమే వేస్టనీ ఇక సన్యాసమే బెస్టనీ
కాషాయమే కట్టాడురా కట్టి కాశీకి పోయాడురా ॥॥

చిత్రం : యోగి వేమన (1947)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం, గానం : నాగయ్య


పల్లవి :
జీవహింస మానండి (2)
జీవుల మీవలె ప్రేమించండి
జీవహింస మానండి

చరణం : 1
జీవహింసతో బ్రతికేవారు
శివుని మెప్పు కనలేరండి (2)
జీవులలో శివుడున్నాడండి (2)
జీవుడే శివుడని కొలువండి (2)
జీవహింస మానండి (2)

చరణం : 2
నేనూ నీవని పొరపడకండి
మనలో భేదము లేదండి (2)
అందరిలోపల ఆరక వెలిగే
ఆత్మ ఒక్కటే తెలియండి
పరమాత్మ ఒక్కటే తెలియండి
జీవహింస మానండి (2)

28 March - నేడు చిత్తూరు నాగయ్య జయంతి

పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమా

మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
యెనలేని జాలి గుణమే అమ్మ
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మా
నా ఆలి అమ్మ గా అవుతుండగా
జో లాలి పాడనా కమ్మగా కమ్మగా

ఆ..
పొత్తిల్లొ ఎదిగే బాబు
నా వొళ్ళో వొదిగె బాబు
ఇరువురికి నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు
నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని వాడి నాన్నని
నూరేళ్ళు సాకనా చల్లగ చల్లగా
ఎదిగీ ఎదగని ఓ పసి కూనా
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలిజో

పలికే పదమే వినకా కనులారా నిదురపో
కలలోకి నేను చేరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
ఎదిగీ ఎదగని ఓ పసి కూన
ముద్దులకన్న జోజో బంగరు తండ్రి జోజో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో
బజ్జో లాలి జో..


చిత్రం:నాని

తెలవారదేమో స్వామి
తెలవారదేమో స్వామి
నీ తలపుల మునుకలో
అలసిన దేవెరి అలమేలు మంగకూ

చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవెరి అలసిన దేవెరి అలమేలు మంగకూ

మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున చేరిచి
అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునె మది మరి మరి తలచగ
మరి మరి తలచగ
అలసిన దేవెరి అలమేలు మంగకు

తెలవారదేమో స్వామి గ మ ప ని
తెలవారదేమో
స ని ద ప మ ప మ గ ని స గ మ
తెలవారదేమో స్వామి
ప ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి స రి ని స
తెలవారదేమో స్వామి

చిత్రం : శ్రుతిలయలు
గానం : యేసుదాస్
రచన : సిరివెన్నెల
సంగీతం:కె.వి. మహాదేవన్

కలలు కన్న రాధా! కనులలో మనసులో గోపాలుడే!
కలలు కన్న రాధ! కనులలో మనసులో గోపాలుడే!

నీ జతలో శృతి చేసుకుంది హృదయం
నీ జతలో శృతి చేసుకుంది హృదయం
నీవు తాకగానే నిలువెల్ల వేణు గానం
ఔనా...ఔనా...ఔనా.....

కలలు కన్న రాధా! కనులలో మనసులో గోపాలుడే!
కలలు కన్న రాధ!

నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా..
నీ ఒడిలో జగమెల్ల మరచిపోనా
నీడలాగ నీతో బ్రతుకెల్ల సాగిపోనా
ఔనా...ఔనా...ఔనా.....

కలలు కన్న రాధా! కనులలో మనసులో గోపాలుడే!
కలలు కన్న రాధ!

ఈ వలపే నిలవాలి యుగ యుగాలు..
ఈ వలపే నిలవాలి యుగ యుగాలు
ఎన్ని జన్మలైనా ఈ బంధమున్న చాలు
ఔనా...ఔనా...ఔనా.....

కలలు కన్న రాధా! కనులలో మనసులో గోపాలుడే!
కలలు కన్న రా..ధ!


చిత్రం : పసి హృదయాలు
గానం : సుశీల
సంగీతం : జి.కె.వెంకటేష్

రాధను నేనయితే...నీ రాధను నేనయితే..
రాధను నేనయితే..నీ రాధను నేనయితే

నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా
నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా

తోటనిండా మల్లియలు
తుంటరి పాటల తుమ్మెదలు
తోటనిండా మల్లియలు
తుంటరి పాటల తుమ్మెదలు
అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె
అల్లరి తుమ్మెదల అలికిడి వినగానె
మల్లెలు సవరించు పై ఎదలు

గడసరి చినవాడు తోడుగ వుంటే
కరగును నునుసిగ్గు పరదాలు..
గడసరి చినవాడు తోడుగ వుంటే
కరగును నునుసిగ్గు పరదాలు
చిలిపిగ నను నీవు చేరుకుంటే
జల జల పొంగును పరువాలు

రాధవు నీవైతే నా రాధవు నీవైతే
నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా

రాధ అంటే ఎవ్వరదీ... మాధవ పాదాల పువ్వు అది
రాధ అంటే ఎవ్వరదీ మాధవ పాదాల పువ్వు అది
అంతటి స్వామి చెంతగ వుంటేనే
అంతటి స్వామి చెంతగ వుంటేనే
ఆమె మనసు పూచేది

తీయగ సోకే పిల్లగాలికి పూయని పువ్వే వుంటుందా
తీయగ సోకే పిల్లగాలికి పూయని పువ్వే వుంటుందా
కన్నుగీటే వన్నెకానికి కరగని జవ్వని వుంటుందా

రాధను నేనయితేనీ రాధను నేనయితే
నిన్ను మలచుకుంటాను నా మురళిగా
నిన్ను చేసుకుంటాను నా తరుణిగా

చిత్రం : ఇన్స్పెక్టర్ భార్య
గానం : పి.సుశీల, కె.బి.కె. మోహన్‍రాజ్
సంగీతం : కె.వి.మహాదేవన్

ఆ..............
యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!

"మంజు ఏ ఆపేసావ్...ఏమి లేదు
ఆపకు మంజు నీ కాలి మువ్వల సవ్వడి
నా పాటకు నడక నేర్పాలి
నా గానానికి జీవం పొయ్యాలి"

రావోయి రాసవిహారి
యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ ఆ.......
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!
యమునా తీరమునా.....

బాస చేసి రావేల మదన గోపాలా
బాస చేసి రావేల మదన గోపాలా
నీవు లేని జీవితము తావి లేని పూవు కదా

యమునా తీరమున సంధ్యా సమయమున
యమునా తీరమున సంధ్యా సమయమున
వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!
యమునా తీరమునా.....

పూపొదలో దాగనేల పో పోరా సామి
ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో
దాని చెంతకె పోరాదో

రానంత సేపు విరహమా
నేను రాగానే కలహమా
రాగానే కలహమా
నీ మేన సరసాల చిన్నెలు
అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
దోబూచులాడితి నీతోనే
ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు
ఈ కొమ్మ గురుతులు కాబోలు
నేను నమ్మనులే
నేను నమ్మనులే నీ మాటలు
అవి కమ్మని పన్నీటి మూటలు
నా మాట నమ్మవే రాధికా
ఈ మాధవుడు నీ వాడే గా
రాధికా...మాధవా...
రాధికా...మాధవా...


చిత్రం : జయభేరి
గానం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
రచన : ఆరుద్ర

మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం
కమ్మని నగుమోము కాంచుటె తొలినోము
కడగంటి చూపైన కడుపావనం
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

రాధను ఒకవంక లాలించునే
సత్య భామను మురిపాల తేలింతునే
రాధను ఒకవంక లాలించునే
సత్య భామను మురిపాల తేలింతునే
మనసార నెరనమ్ము తనవారిని
ఆ.. మనసార నెరనమ్ము తనవారిని
కోటి మరులందు సుధలందు తనియింతునే

మనసే అందాల బృందావనం

దనిస దని నిదదమ
మదని నిదదమ
గమద దమమగస
గగ మమ మగస దని
గసా మగా దమా నిద
గమదనిస బృందావనం

మాద| మగస|
దామ| గమద|
నీద| నిసమ|
గమ మద దనినిస|
నిసమద మగస|
గమ దనిసగ| బౄందావనం
సమగస| గమదని|
గదమగ| మదనిస|
మనిద| మదనిస| ఆ..
మనసే అందాల బృందావనం
వేణు మాధవుని పేరే మధురామృతం

చిత్రం :మంచి కుటుంబం
గానం : సుశీల
రచన : ఆరుద్ర
సంగీతం :కోదండపాణి

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం

జీవితమే రంగుల వలయం దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం
వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో........

సాగరమే పొంగుల నిలయం దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం
లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

తొలిసంధ్య వేళలో తొలిపొద్దు పొడుపులో
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం
యెగిరొచ్చే కెరటం సింధూరం

చిత్రం : సీతారాములు
గానం : పి. సుశీల
సంగీతం : సత్యం
రచన : సి.నారాయణ రెడ్డి

ఆ ఆ ఆ
ఆకులో ఆకునై పూవులో పూవునై కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా ||ఆకులో||

గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
గలగల నీ వీచు చిరుగాలిలో కెరటమై
జలజల నీ పారు సెల పాటలో తేటనై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా ||ఆకులో||

తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చగలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ తరలీవెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఎచటనే ఆగిపోనా ||ఆకులో||

చిత్రం : మేఘసందేశం
గానం : పి.సుశీల
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం: రమేష్‌నాయుడు

ఈ గాలి ఈ నెల ఈ వూరు సేలయేరు
ఈ గాలి ఈ నెల ఈ వూరు సేలయేరు
నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు
నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు

ఈ గాలి||

చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తెలిశాక వచ్చేను నా వంక
చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తెలిశాక వచ్చేను నా వంక
ఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
ఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక
ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక
యేగసేను నింగి దాక

ఈ గాలి||

యేనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళ్ళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడొ ఈ కళ్ళను
యేనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళ్ళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడొ ఈ కళ్ళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను


చిత్రం : సిరివెన్నెల
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన : సిరివెన్నెల
సంగీతం :కె.వి.మహదేవన్

ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం
తనువూగింది ఈ వేళ
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీల

యెదలోని సొదలా ఎల యేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
యెదలోని సొదలా ఎల యేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లుగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా ||ఝుమ్మంది ||

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగె ఆవేశం
కైలాసమే వంగె నీకోసం ||ఝుమ్మంది ||

మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా ||ఝుమ్మంది ||


చిత్రం : సిరిసిరిమువ్వ
గానం : పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన : వేటూరీ
సంగీతం:కె.వి.మహదేవన్

నిన్నటిదాకా శిలనైనా
నీ పదము సోకినే గౌతమినైనా
నిన్నటిదాకా శిలనైనా
నీ మమతావేశపు వెల్లువలో
గోదారి గంగనై పొంగుతువున్నా

సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
సరస సరాగాల సుమ రాణిని
స్వరస సంగీతాల సారంగిని
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మువ్వ మువ్వకు ముద్దు మురిపాలు పలుక
మవ్వంపు నటనాల మాటంగిని
కైలాశ శిఖరాల శైలూశిఖా నాట్య
ఢోలలూగేవేళ రావేల నన్నేల

నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
నిన్నే ఆరాధించు నీ దాసిని
ప్రేమ ప్రాణాలైన ప్రియురాలిని
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
పువ్వు పువ్వుకు నవ్వు నవకాలు తెలిపే
చిరునవ్వులో నేను సిరి మల్లిని
స్వప్న ప్రపంచాల సౌందర్య దీపలు
చెంత వెలిగేవేళ ఈ చింత నీకేల


చిత్రం : మేఘసందేశం
గానం : పి.సుశీల
రచన : వేటూరి సుందరరామమూర్తి
సంగీతం: రమేష్‌నాయుడు

vidhAta talapuna - విధాత తలపున

చిత్రం : సిరివెన్నెల (sirivennela)
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, సుశీల (SP bAlasubrahmanyam, sushIla)
రచన : సిరివెన్నెల (sirivennela)
సంగీతం: కె.వి.మహదేవన్ (K. V. MahadEvan)

పల్లవి:
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం..ఓం
ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ..ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో.. ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం.....

సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది ||2||
నే పాడిన జీవన గీతం ఈ గీతం...

విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం 1:

ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన  ||2||

పలికిన కిల కిల స్వరముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వ కావ్యమునకిది భాష్యముగా ||విరించినై||

జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయ మృదంగ ధ్వానం ||2||

అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా
సాగిన సృష్టి విలాసములే ||విరించినై||

నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం ||2||
సరస స్వర సుర ఝరి గమనమౌ సామ వేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం...




Know the meaning of vidhAta talapuna song:

విధాత = బ్రహ్మ, సృష్టికర్త యొక్క
తలపున = ఊహలో
ప్రభవించినది = మెరిసినది
అనాది = మొదలు లేని
జీవన వేదం = ఈ సృష్టికి మూలమైన వేదం (సృష్టే వేదం, వేదమే సృష్టి)
ప్రాణ నాడులకు = మనలో ప్రాణానికి మూలమైన నాడుల్లో
స్పందన నొసగిన = ఆ ప్రాణాన్ని తట్టి లేపిన
ఆది ప్రణవ నాదం = తొలి ఓంకారము
కనుల కొలనులో = కళ్ళే కొలనులు అయితే
ప్రతిబింబించిన = ఆ కొలనులో ప్రతిబింబించిన
విశ్వరూప విన్యాసం = ఈ సృష్టి యొక్క రూప ఆవిష్కరణ
ఎద కనుమలలో = గుండె అనే పర్వత శ్రేణిలో
ప్రతిధ్వనించిన = మారుమ్రోగిన
విరించి = బ్రహ్మ యొక్క
విపంచి = వీణ
గానం = సంగీతం
సరస = రసముతో కూడిన( నవరసాల రసం )
స్వర = సంగీత స్వరం (స, రి గ)
సురఝరీ = దేవనది, గంగ
గమనమౌ = ప్రవాహము ఐనట్టి
సామవేద సారమిది = సామవేదం యొక్క సారాంశం ఇది
నే పాడిన జీవన గీతం ఈ గీతం = నే పాడిన ఈ పాట జీవిత గీతం

విరించినై = నేనే బ్రహ్మని
విరచించితిని = రచించితిని
ఈ కవనం = ఈ కవిత్వం
విపంచినై = వీణనై
వినిపించితిని = వినిపిస్తున్నా
ఈ గీతం - ఈ పాట
విరించినై...

ప్రాగ్దిశ వీణియ పైన = తూర్పు దిక్కు అనే వీణ మీద
దినకర మయూఖ తంత్రుల పైన = సూర్యకిరణాలనే తీగలు మీటుతూ
జాగృత విహంగ తతులే += నిద్రలేచిన పక్షి గుంపులు
వినీల గగనపు వేదిక పైన = నీలాకాశం అనే స్టేజి మీద
పలికిన కిలకిల స్వనముల = పలికిన కిల కిల ధ్వనులు
స్వరజతి = స్వరముల అమరిక, కృతి కీర్తన జావళి లాగా ఇది కూడా ఒక లాంటి పాట
జగతికి = ప్రపంచానికి , విశ్వానికి
శ్రీకారము కాగా = మొదలు కాగా
విశ్వకావ్యమునకి = విశ్వమనే కావ్యానికి
ఇది భాష్యముగా = వివరణగా

విరించినై...

జనించు = పుట్టిన
ప్రతి శిశు గళమున పలికిన = ప్రతి శిశువు గొంతున పలికిన
జీవన నాద తరంగం = జీవితమనే ధ్వనికెరటం, అల
చేతన = చైతన్యం, అచ్తివషన్
స్పందన = reverberation, రేసోనన్స్
ధ్వనించు = శబ్దం
హృదయ మృదంగ ధ్వానం - హృదయం మృదంగం వలె ధ్వనిస్తుంది.
అనాది = మొదలు లేని, చాలా పాతదైన, ఎప్పణ్ణించో ఉన్న
ఆది తాళం = ఆది తాళం
అనంత జీవన వాహినిగా = అంతం లేని జీవితమనే నదిలా
సాగిన సృష్టి విలాసమునే = సాగిపోయిన సృష్టి క్రీడ, ఆట, నాట్యం

విరించినై...

నా ఉచ్చ్వాసం = పీల్చే ఊపిరి, గాలి
కవనం = కవిత్వం
నా నిశ్వాసం = వదిలే ఊపిరి,గాలి
గానం = పాట

అభినవ తారవో...నా...అభిమాన తారవో
అభినవ తారవో అభినయ రసమయ కాంతిధారవో
అభినయ రసమయ కాంతిధారవో
మంజుల మధుకర శింజాల సుమసరశింజినీ శివరంజని శివరంజనీ

అది దరహాసమా మరి మధురమాసమా
అది దరహాసమా మరి మధురమాసమా
ఆ మరునికి దొరికిన అవకాశమా
అవి చరణమ్ములా శశికిరణమ్ములా
నా తరుణభావన హరిణమ్ములా

అభినవ తారవో||

ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నయనాలు విరిసినచాలు అమవస నిశిలో చంద్రోదయాలు
ఆ నెన్నడుము ఆడినచాలు
ఆ నెన్నడుము ఆడినచాలు రవళించును పదకవితా ప్రభందాలు

అభినవ తారవో||

నీ శ్రంగార లలిత భంగిమలో పొంగిపోదురే రుషులైన
నీ కరుణరసానిష్కరణంలో కరిగిపోదురే కర్కశులైన
వీరమా...నీ కుపిత నేత్ర సంచారమే
హాస్యమా నీకది చిటికెలోన వశ్యమే
నవరస పోషణ చణవనీ నటనాంకింత జీవనివనీ నిన్ను కొలిచి వున్నవాడ మిన్నులందుకున్నవాడ


నే ఆరాధకుడను అస్వాదకుడను అనురక్తుడను..నీ ప్రియభక్తుడను

అభినవ తారవో||


చిత్రం : శివరంజని
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన : డా.సి.నారాయణరెడ్డి
సంగీతం: రమేష్‌నాయుడు

తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే||
చలిగాలి రమ్మంటు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
చలిగాలి రమ్మంటు పిలిచింది లే
చెలి చూపు నీ పైన నిలిచింది లే
ఏముంది లే ఇపుడేముంది లే ఏముంది లే ఇపుడేముంది లే
మురిపించు కాలమ్ము ముందుంది లే నీ ముందుంది లే ||
వరహాల చిరునవ్వు కురిపించవా
పరువాల రాగాలు పలికించవా
అవునందునా కాదందునా అవునందునా కాదందునా
అయ్యారే విధి లీల అనుకోందునా అనుకోందునా ||
సోగసైన కనులేమో నాకున్నవి చురుకైన మనసేమో నీకున్నది
కనులేమిటో ఈ కధ ఏమిటో కనులేమిటో ఈ కధ ఏమిటో
స్రుతి మించి రాగాన పడనున్నది, పడుతున్నది ||
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తెలిసింది లే తెలిసిందిలే నెలరాజ నీ రూపు తెలిసిందిలే


చిత్రం : రాముడు భీముడు
గానం : ఘంటసాల, పి.సుశీల
రచన : సి. నారాయణ రెడ్డి

అహో ఆంధ్ర భోజా శ్రి కృష్ణా దేవరాయా
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా
ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా

శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా కను చూపు కరువైన వారికైనా
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు
ఒకచెంప శృంగారమొలిగించు నాట్యాలు నవరసాలొలిగించు నగరానికొచ్హాము
కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు

శిలలపై||

ఏక శిల రధముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగి రాగా
రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలని కోరుతున్నారని

శిలలపై||

రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు పోయినా గాల్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా అ......
చెదరనీ కదలనీ శిల్పాలవలెనె నీవు నా హౄదయాన
నిత్యమై సత్యమై నిలిచి వుందువు చెలి నిజమునా జాబిలి


చిత్రం : మంచి మనసులు
గానం : ఘంటసాల
రచన : ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్

కళ్ళలో కళ్ళు పెట్టి చూడు
గుండెల్లో గుండే కలిపి చూడు
సందిట్లో బంధివై చూడు హాయి ...సయ్యాటలాడి చూడు
కళ్ళలో కళ్ళు పెట్టి చూసా
గుండెల్లో గుండే కలిపి చూసా
సందిట్లో బంధినై పోతా సయ్యాట వేళ కాదు..
కానుకా ఇవ్వనా ...వద్దులే దాచుకో
కోరికా చెప్పనా ... అహో ! తెలుసులే చెప్పకు
ఏందుకో సిగ్గులు ... వుండగా హద్దులు
కాదులే కలిసిపో ...అహో ! నవ్వరా నలుగురు
కావాలి కొంటె సాకు ...... హోయి .......
నువ్వు నా జీవితం ... నువ్వు నా ఊపిరి
నువ్వలా నేనునిటు .. ఎండలో చీకటి
పాలలో తేనెలా ...ఇద్దరం ఒక్కటి
లోకమే మరిచిపో ... ఏకమై కరిగిపో
ఏడబాటు మనకు లేదు....... హోయి ...

చిత్రం : జీవిత చక్రం
గానం : ఘంటసాల,శారద
రచన : ఆరుద్ర
సంగీతం: శంకర్ జైకిషన్

అలిగితివ సఖీ ప్రియ కలత మానవా
అలిగితివ సఖీ ప్రియ కలత మానవా
ప్రియమారగ నీ దాసుని ఏల జాలవా
అలిగితివ సఖి ప్రియా కలత మానవా

లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా
లేని తగవు నటింతువా మనసు తెలియనెంచితివా
ఈ పరీక్ష మాని ఇంక దయను జూడవా

అలిగితివ||

నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని
నీవె నాకు ప్రాణమని నీ ఆనతి మీరనని
సత్యాపతి నా బిరుదని నింద ఎరుగవా

అలిగితివ||

ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
ఆ.......
ప్రియురాలివి సరసనుండి విరహమిటుల విధింతువా
భరియింపగ నా తరమా కనికరించవా

చిత్రం : శ్రీ కృష్ణార్జుణ యుద్ధం
గానం : ఘంటసాల
రచన : పెండ్యాల
సంగీతం: పింగళి

మనసున మల్లెల మాలలూగెనే
కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుస గుస మనినా
రెమ్మల గాలులు ఉసురుసుననినా
అలలు కొలనులో గల గల మనినా
అలలు కొలనులో గల గల మనినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
దవ్వున వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీ పిలుపే విని
నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయ చూచితిని
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఘడియ యేని ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్ని నాళ్ళకీ బ్రతుకు పండెనో
ఎంత హాయి ఈ రేయి నిండెనో

చిత్రం : మల్లీశ్వరి
గానం : భానుమతి
రచన :దేవులపల్లి కృష్ణశాస్త్రి

సుందరాంగ అందుకోరా సౌందర్య మాధుర్య మందారము
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
అందలేని పొందలేని ఆనంద లోకాలు చూపింతురా
కేలు కేలగొని మేనులేకముగ ఎకాంత సీమలలో
మది సంతాపమాడగ సంతోషమురెగ చెంత చేర రాద
కేలు కేలగొని మేనులేకముగ ఎకాంత సీమలలో
మది సంతాపమాడగ సంతోషమురెగ చెంత చేర రాద
లోకము చేదు విరాహము చేదు అనురాగమే మధురం
చాలు తాపన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
లోకము చేదు విరాహము చేదు అనురాగమే మధురం
చాలు తాపన విడవోయి వేదన సంతోషాబ్దికి పోదము
అట రంగారు బంగారు మీనాలమై కవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
అట రంగారు బంగారు మీనాలమై కవులూరింతు క్రొందేనె జుర్రాడుదాం
ఏలాడుదాం ఓలాడుదాం ముదమార తనివిదీర ఈదాడుదాం
ముదమార తనివిదీర ఈదాడుదాం

చిత్రం : భూకైలాస్
గానం : సుశీల
రచన: పెండ్యాల

చిత్రం : గీతాంజలి
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన: వేటూరి సుందరరామ్మూర్తి
సంగీతం: ఇళయరాజా

ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ
రాలేటి పూలా రాగాలతో పూసేటి పూలా గంధాలతో
మంచు తాకి కోయిల మౌనమైన వేళల

ఆమని||

వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
మనస్సులో నిరాశలే రచించెలే మరీచికా
పదాల రాయగా స్వరాల సంపద
తరాల నా కధ క్షణాలదే కదా గతించి పోవు గాధ నేనని

ఆమని||

శుకాలతో పికాలతో ధ్వనించినా మధోదయం
దివి భువి కలా నిజం స్పృశించిన మహోదయం
మరో ప్రపంచమే మరింత చేరువై నివాళి కోరినా ఉగాది వేళలో
గతించి పోని గాధ నేనని

ఆమని||

జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
కిల కిల నగవుల వలపులు చిలికిన
ఓ మైనా మైనా
మిలిమిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మిలిమిల మెరిసిన తార
మిన్నుల విడిన సితార
మధువుల పెదవుల మమతలు విరిసిన
ఓ మైనా ఓ మైనా
కలలను పెంచకు కలతలు దాచకు
ఏమైనా ఓ మైనా

అడగనులే చిరునామా ఓ మైనా ఓ మైనా
చిరునవ్వే పుట్టిళ్ళు నీకైనా నాకైనా
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
తారలకే సిగపువ్వ తారాడే సిరిమువ్వ
హరివిల్లు రంగుల్లో వర్ణాలే
చిలికిన చిలకవు ఉలకవు పలకవు ఓ మైనా ఏమైనా

ఉరుములలో అలికిడిలా వినిపించే ఈ మైనా
మెరుపులలొ నిలకడగా కనిపించే ఈ మైనా
యెండలకే అల్లాడే వెన్నలలో త్రినీడ
యెండలకే అల్లాడే వెన్నలలో త్రినీడ
వినువీధి వీణల్లొ రాగంలా
ఆశల ముంగిట ఊహల ముగ్గులు నిలిపేనా ఏమైనా
జిలి బిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా
తొలకరి వయసుల మినుగురు సొగసులాడెమైన మైన
మిలి మిల మెరిసిన తార మిన్నుల విడిన సితార
గుడికే చేరని దీపం పడమటి సంధ్యా రాగం
మధువుల పెదవుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా
చుక్కలు అందక దిక్కున దాగిన నేనేలే ఆ మైనా

చిత్రం : సితార
గానం : ఎస్.జానకి

కలికి చిలకల కొలికి మాకు మేనత్త
కలవారి కోడలు కనకమాలక్ష్మి
అత్తమామల కొలుచు అందాల అతివ
పుట్టిల్లు యెరుగని పసిపంకజాక్షి
మేనాలు తేలేని మేనకోడల్ని
అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని
వాల్మీకినే మించు వరస తాతయ్య
మాయింటికంపించవయ్య మావయ్యా


ఆ చేయి యీ చేయి అద్దగోడలికి
ఆ మాట యీ మాట పెద్దకోడలికి
నేటి అత్తమ్మా నాటి కోడలివి
తెచ్చుకో మాయమ్మ నీదు ఆ తెలివి
తలలోని నాలికై తల్లిగా చూసే
పూలల్లొ దారమై పూజలే చేసే
నీ కంటి పాపలా కాపురం చేసే
మా చంటి పాపను మన్నించి పంపు


మసకబడితే నీకు మల్లెపూదండ
తెలవారితే నీకు తేనె నీరెండ
ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు
ఏడు జన్మలపంట మా అత్త చాలు
పుట్టగానే పూవు పరిమళిస్తుంది
పుట్టింటికే మనసు పరుగుతీస్తుంది
తెలుసుకో తెలుసుకో తెలుసుకో
తెలుసుకో తెలుసుకో మనసున్న మామ
సయ్యోధ్యనేలేటి సాకేతరామా

చిత్రం : సీతారామయ్యగారి మనవరాలు
గానం : చిత్ర
రచన :వేటూరి
సంగీతం:కీరవాణి

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ.......
పగలే వెన్నెలా జగమే ఊయల
కదలె వూహలకే కన్నులుంటే......||పగలె వెన్నెల||

నింగిలోన చందమామ తోంగి చూచే
నీటిలోన కలువభామ పోంగి పూచే.....
యీ అనురాగమే జీవనరాగమై
యీ అనురాగమే జీవనరాగమై
యెదలొ తేనేజల్లు కురిసిపోగా ||పగలె వెన్నెల||

కడలి పిలువ కన్నేవాగు పరుగుతీసే
మురళిపాట విన్ననాగు సిరసునూపే.....
యీ అనుబంధమే మధురానందమై
యీ అనుబంధమే మధురానందమై
ఇలపై నందనాలు నిలిచిపోగా ||పగలె వెన్నెల||

నీలి మబ్బు నీడలెచి నెమలి ఆడె
పూలరుతువు సైగ జూసి శిఖము పాడె....
నీలి మబ్బు నీడలెచి నెమలి ఆడె
పూలరుతువు సైగ జూసి శిఖము పాడె
మనసే వీణగా ఝుం ఝుమ్మున మ్రోయగా 2
బ్రతుకే పున్నమిగా విరిసిపోదా...... ||పగలె వెన్నెల||

చిత్రం : పూజాఫలం
గానం : సుశీల

ఏ పారిజాతమ్ములీయగలనో సఖీ
గిరి మల్లికలు తప్ప గరికపూవులు తప్ప
ఏ కానుకలను అందించగలనో చెలీ
గుండెలోతుల దాచుకున్న వలపులు తప్ప

జగతిపై నడయాడు చంచలా వల్లికా
తరుణి ఆకృతి దాల్చు శరదిందు చంద్రికా ….

శరదిందు చంద్రికా,.,,


నీవు లేని తొలి రాతిరి నిట్టూర్పుల పెను చీకటి
నీవు లేని విరి పానుపు నిప్పులు చెరిగే కుంపటి
విరులెందుకు సిరులెందుకు
మనసు లేక మరులెందుకు
తలపెందుకు తనువెందుకు
నీవు లేక నేనెందుకు … నీవు లేక నేనెందుకు …


చిత్రం : ఏకవీర
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన :సి.నారాయణరెడ్డి
సంగీతం:కె.వి.మహదేవన్

అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది //అందాలరాజు //

నుదుట బాసికము నూతల కాంతుల మెరిసే
మదిలో కోరిక మంగళగీతం పాడే
వేచిన కనులే వేయి వలపులై పూచే
పూచిన వలపుల పులకరించెనే మేను
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్ //అందాలరాజు //

బుగ్గను పెట్టిన నల్లచుక్క తానవ్వే …
సిగ్గుబరువుతో కన్నెవలపు తలవంచే …
జడలో కుట్టిన మొగలిపువ్వు దీవించే
జన్మజన్మకు అతడే నా మగడమ్మా
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్

అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాము
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది

చిత్రం : ప్రతిజ్ఞాపాలన
గానం :సుశీల
రచన:ఆరుద్ర
సంగీతం:మాస్టర్ వేణు

ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి
ఆకాశం దిగివచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి

ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి
చెరిసగమవమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇదివరకెరగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం
మా ఇళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్ని పెళ్ళి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే ||ఆకాశం ||


చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గుదొంతరలు
ఆ సొంపులకు ఎఱవేసే అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో … ఓఓఓఓ
వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల సులుకుల కలువకు కానుకగా
ఎద సరసన ఎగసిన అలజడి అలలే …. తాకగా ||ఆకాశం ||

విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు
సన సన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు
సందు చూసి చకచక ఆడే జూద శిఖామణులూ … ఊఊఊఊ
పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలూ
తమ నిగనిగ నగలను పదుగురు ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు ….. చూడగా ||ఆకాశం ||


చిత్రం: నువ్వు నాకు నచ్చావ్
గానం :ఎస్.పి.బాలసుబ్రమణ్యం
రచన:సిరిన్వెన్నెల
సంగీతం:కోటి

ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
సొగసరీ … ఒక పరి వివరించవే
చెలిమికోసం చెలి మందహాసం .. ఏమని వివరింతును
గడుసరీ … ఏమని వివరింతును

ఆ..ఆ… ఆ, వలపులు చినికే వగలాడి చూపు
పిలువక పిలిచి విరహాలు రేపు
ఆ..ఆ…ఆ.. ఎదలో మెదలే చెలికాని రూపు
ఏవో తెలియని భావాల రేపు
ఈ నయగారం ప్రేమసరాగం … ఈ నయగారం ప్రేమసరాగం
అందించు అందరాని సంబరాలే … ఏ…ఏ….
ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
సొగసరీ … ఒక పరి వివరించవే

ఆ..ఆ… ఆ, పరుగులు తీసే జవరాలి వయసు
మెరుపై మెరసి మరపించు మనసు
ఆ..ఆ… ఆ, ప్రణయం చిందే సరసాల గంధం
ఇరువురినొకటిగ పెనవేయు బంధం
ఈ వయ్యారం ఈ సింగారం … ఈ వయ్యారం ఈ సింగారం
చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో … ఓ…ఓ…
ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
సొగసరీ … ఒక పరి వివరించవే

ఆ…ఆ… ఆ…చెలిమికోసం చెలి మందహాసం .. ఏమని వివరింతును
గడుసరీ … ఏమని వివరింతును


చిత్రం : నర్తనశాల
గానం :ఘంటసాల, సుశీల
రచన: శ్రీశ్రీ
సంగీతం:సుసర్ల దక్షిణామూర్తి

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా


ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏరోజుకైన సత్యమే జయించి తీరును.. జయించి తీరును
కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును సుఖాలు దక్కును //జయమ్ము //


విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి .
విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి
విశాల దృష్టి తప్పకుండ బోధించాలి .. బోధించాల
పెద్దలను గౌరవించి పూజించాలి .. పూజించాలి //జయమ్ము //


కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును .. సుఖాలు దక్కును
ఈ లోకమందు సోమరులై ఉండకూడదు .. ఉండకూడదు
పవిత్రమైన ఆశయాన మరువకూడదు .. మరువకూడదు //జయమ్ము //


గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా .. బ్రోవుము దేవా
కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దైవా .. నడుపుము దేవా
బీదసాదలాదరించు బుద్ది నొసగుమా .. శక్తి నొసగుమా
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా //జయమ్ము //

గాఢాంధకారమలముకున్న భీతిచెందకు
సందేహపడక వెల్గు చూపి సాగుముందుకు .. సాగుముందుకు
నిరాశలోన జీవితాన్ని క్రుంగదీయకు … క్రుంగదీయకు //జయమ్ము //


పరాభవమ్ము గల్గునంత పారిపోకుమోయ్…
జయమ్ము నిమ్మరించుదాక పోరి గెల్వవోయ్.. పోరి గెల్వవోయ్
స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్ .. నిల్వబెట్టవోయ్

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా .. సాగిపొమ్మురా
జయమ్ము నిశ్చయమ్మురా … జయమ్ము నిశ్చయమ్మురా… జయమ్ము నిశ్చయమ్మురా…


చిత్రం : శభాష్ రాముడు
గానం : ఘంటసాల,సుశీల & బృందం
రచన: కొసరాజు
సంగీతం:ఘంటసాల

బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే

ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే

పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే
పిల్లనగ్రోవిని పిలుపును వింటే ఉల్లము జల్లున పొంగదటే
రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగముచిందిన జగమే ఊయల ఊగదటే

బృందావనమది అందరిది గోవిందుడి అందరివాడేలే ...

రాసక్రిడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రిడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకె రాధ ఈ సునసూయలు అందములందరి ఆనందములే

బృందావనమది అందరిది గోవిందుడి అందిరివాడేలే .. గోవిందుడి అందిరివాడేలే

చిత్రం: మిస్సమ్మ
గానం:సుశీల, ఘంటసాల

అందమే ఆనందం అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం
ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం

పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
పడమట సంధ్యారాగం కుడి ఎడమల కుసుమపరాగం
ఒడిలో, చెలి మోహనరాగం ఒడిలో, చెలి మోహనరాగం
జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం

అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం.
అందమే ఆనందం

పడిలేచే కడలితరంగం .. పడిలేచే కడలితరంగం
వడిలో జడిసిన సారంగం
పడిలేచే కడలితరంగం వడిలో జడిసిన సారంగం
సుడిగాలిలో .....సుడిగాలిలో ఎగిరే పతంగం.
జీవితమే ఒక నాటక రంగం జీవితమే ఒక నాటక రంగం

అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం. అందమే ఆనందం

చిత్రం : బ్రతుకు తెరువు
గానం : ఘంటసాల
రచన: సీనియర్ సముద్రాల
సంగీతం:ఘంటసాల

కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన
కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేవెందుకే నిషా కనుల దాన

మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
మేనాలోన ప్రియునిజేర వెళ్ళింది నా చెలి మీనా
నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన

కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగొలిపేదిందుకే నిషా కనుల వాడ

ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
ఒహో చెలియా నీవుకుడా ఓ పెళ్ళి పల్లకీ చూసుకో
హాయికొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో
నే వెళితే మరి నీవు, మజ్నువవుతావూ
నే వెళితే మరి నీవు, మజ్నువవుతావూ
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే
మజ్ను నేనైతే ఓ లైలా లోకమే చీకటై పోవునే

కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగా వుందాములే నిషా కనుల వాడ

ఆకాశంలో ఇంద్రధనస్సుపై ఆడుకుందమా నేడే
నీలి నీలి మేఘాల రధముపై తేలిపోదామీనాడే
చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలసిపోదమా హాయిగా
నేను వీణనై నీవు నాదమై ఏకమౌదమా తీయగా

కుషీ కుషీగా నవ్వుతు చెలాకి మాటలు రువ్వుతు
హుషారుగా వుందాములే హమేషా మజాగా

చిత్రం: ఇద్దరు స్నేహితులు
గానం:పి.సుశీల, ఘంటసాల

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా

అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదంలోన అభిమానం జనిస్తుంది
మమ్మీ డాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుంది...
మామ అన్న మాట మనసులోతుల్లో నిలుస్తుంది
అక్కా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుంది
పర భాషా జ్ఞానాన్ని సంపాదించు
కాని నీ భాషలోనే నువ్వు సంభాషించు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతె వాళ్ళని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా
కొంత రుణం తీర్చరా

మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతలు మార్చుకోవు
భూమి పైన ప్రాణులన్ని తమ భాషను మరువలేదు
మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేథావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగురాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు
అది భాషాచారాలను మింగేయొద్దు

తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా
వెనక్కి తగ్గమాకురా

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం
తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం
మమ్మీ డాడీ అన్న మాట మరుద్దామురా
అమ్మా నాన్నా అంటూ నేటినుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా..


రచన: చంద్రబోస్
చిత్రం: నీకు నేను నాకు నువ్వు

రాస లీల వేళ రాయబారమేల
మాటే మౌనమై మాయజేయ నేలా
రాస లీల వేళ రాయబారమేల

కౌగిలింత వేడిలో కరిగె వన్నె వెన్నలా
తెల్లబోయె వేసవీ చల్లె పగటి వెన్నెలా
మోజులన్ని పాడగా జాజిపూల జావళీ
కందెనేమో కౌగిటా అందమైన జాబిలీ
తేనె వానలో చిలికె తీయనైన స్నేహము
మేని వీణ లోన పలికె సోయగాల రాగము
నిదుర రాని కుదురులేని ఎదలలోని సొదలు మాని ||రాస లీల వేళ||

మాయచేసి దాయకు సోయగాల మల్లెలు
మోయలేని తీయని పాయి పూల జల్లులు
చేరదీసి చెంతకు భారమైన యవ్వనం
దోరసిగ్గు తుంచకు ఊరుకోదు ఈ క్షణం
చేపకళ్ళ సాగరాల అలల ఊయలూగనా
చూపు ముళ్ళు ఓపలేను కలల తలుపు తీయనా
చెలువ సోకు కలువ రేకు చలువ సోకి నిలువనీదు ||రాస లీల వేళ||


చిత్రం : ఆదిత్య 369
గానం : ఎస్. జానకి

రావోయి చందమామ మా వింత గాద వినుమా
రావోయి చందమామ మా వింత గాద వినుమా
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌
సామంతము గలసతికీ ధీమంతుడ నగు పతినోయ్‌
సతి పతి పోరే బలమై సత మతమాయెను బ్రతుకే

ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్‌
మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా

తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
తన మతమేమో తనదీ మన మతమసలే పడదోయ్‌
మనమూ మనదను మాటే అననీయదు తాననదోయ్‌


నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో
ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా

చిత్రం : మిస్సమ్మ
గానం:జిక్కి,ఏ.ఎమ్.రాజా

హే హే హే హే హే హే హేఐహే.. రు రు రు రు రు రూ రు రూ..
సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్‌
సాపాటు యెటూలేదు పాటైనా పాడు బ్రదర్‌
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్‌
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్‌


మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా ||మన||
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే బావి పౌరులం బ్రదర్‌


బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుతామురా ఇంట్లో ఈగల్ని తోలుతామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషయం కట్టెయ్‌ బ్రదర్‌


సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా
చదవెయ్య సీటులేదు చదివొస్తే పనీలేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్‌ ||సాపాటు||

చిత్రం : ఆకలిరాజ్యం
గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం

వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం ||వెన్నెల్లో గోదారి||

అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై
నాలో సాగే మౌనగీతం
||వెన్నెల్లో గోదారి ||

జీవిత వాహిని అలలై ... జీవిత వాహిని అలలై
ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..
ఎడబాటే.. ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా
||వెన్నెల్లో గోదారి||

నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి..
కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నాచూపులు చూడలేని మంచు బొమ్మనై..
యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి
వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే..

నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..
నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం ..
ఆశలు మాసిన వేసవిలో... ఆవేదనలో రేగిన ఆలాపన సాగే ..
మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే
మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో ..
తిరిగే.. సుడులై .. ఎగసే ముగిసే కదనేనా .. ఎగసే ముగిసే కదనేనా..


చిత్రం : సితార
గానం : ఎస్.జానకి

చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
నీ నవ్వులో ఏపువ్వులో పన్నీరు చిలికాయీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ
అహహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ ఆ
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

నీ అందమే శ్రీగంధమై నా డెందమలరించే
నీ రూపె దీపమ్మై ప్రియా నా చూపుల వెలిగించే
అహహా ... అహా ఒహోహో .....
అహహా ఒహో.......అ ఆ ...
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా

నీతోడుగా నడయాడగా ఇంకేమి కావాలీ
మధురానురాగాలే ఫలించే తరుణం రావాలీ
అహహా...అహా ఒహోహో....
హహా ఒహో...అ ఆ . .
చెలికాడు నిన్నే రమ్మని పిలువా
చేరరావేలా ఇంకా సిగ్గు నీకేలా
ప్రియురాలి మదిలో ఏముందో తెలుసుకోలేవా
నన్నే తెలుపమంటావా

చిత్రం : కులగోత్రాలు
గానం : పి.సుశీల, ఘంటసాల

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

తగిలే రాళ్ళని పునాది చేసి యదగాలని
తరిమే వాళ్ళని హితులుగ తలచి ముందుకెళ్ళాలని
కన్నుల నీటిని కలలు సాగుకై వాడుకోవాలని
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
గుండేతో ధైర్యం చెప్పెను
చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని..

యెవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని
అందరు ఉన్నా ఆప్తుడు నువ్వై చేరువయ్యావని
జన్మకు యెరుగని అనురాగాన్ని పంచుతున్నావని
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నావని
శ్వాసతో శ్వాసే చెప్పెను
మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదని
నిన్నటి రాతని మార్చేస్తానని

చిత్రం : నేనున్నాను
గానం : కీరవాణి

మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని

విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని

నిన్నలేని భావమేదో కనులు తెరిచి కలయజూచి
మాటరాని మౌనమేదో పెదవి మీద వొదిగిపోయి
ఒక క్షణమే ఆవేదన మరుక్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ

చిత్రం : స్వయంవరం
గానం: చిత్ర
రచన : భువనచంద్ర
సంగీతం:వందేమాతరం శ్రీనివాస్

చిత్రం : ఆరెంజ్ (2010)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : బెన్నిదయాళ్


పల్లవి :
ఓ రేంజ్ లవ్‌దీ ఓ బేబీ ఓటమినెపుడు చూడంది
ట్రూత్ ఆర్ డేర్ అని చల్తా హే యే కభీ
హే హార్ట్ జోరిడి అబిబ్బీ ప్రేమను తాగే హనీ బీ
దట్స్ వై మేరా దిల్ చాహ్‌తే హై సభీ
మౌంటెవరెస్టై లెట్స్‌గో... ఎదిగే లవ్ మీ
చేరాలంటే కావాలిగ డేరింగ్
మెకనాస్ గోల్డై లెట్స్‌గో... దాగే లవ్‌నీ
ఉండాలంటే చేయాలిగ కూంబింగ్
కమ్మని కవితల కబురుల్లో కన బడదమ్మో లవ్వు
నిజాన్ని దాచే హార్ట్‌ల్లో నీ ప్రేమనందుకోలేవు
॥రేంజ్‌॥
లెట్స్ గో... లెట్స్ గో...

చరణం : 1
నే వేయి సార్లు ప్రేమిస్తా
నా గుండెలోన ఫీలుంది
నే కొత్త చరితనే రాస్తా నా లవ్‌లో లైఫ్ ఉంది
నే కన్న కలను సాధిస్తా
నాలోన పచ్చి నిజం ఉంది
ఎదలోకి తొంగి చూశావా
నువ్వొణికే తెగువుంది
ఓ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ వీడకే ప్రేమ
నువు దామ్మ దామ్మ దామ్మ దామ్మ దామ్మ
దారికే దామ్మ
పగలే కలలను చూపించే
వయసుకు పడిపోకమ్మా
నిజముగ నిన్నే ప్రేమించే
హృదయాన్ని కోరుకోవమ్మా ॥రేంజ్‌॥

చరణం : 2
లవ్ మంచు పూలు కురిపిస్తే
నువు మంటరేపి చంపొద్దు
లవ్ చేయి కలుపుతానంటే
నువు చెలిమిని తుంచొద్దు
లవ్ అమృతాన్ని తాగిస్తే
నువు చేదు విషం చిమ్మొద్దు
లవ్ పల్లవించు పాటైతే
తన గొంతును కొయ్యొద్దు
హే సైర సైర సైర సైర సైర ప్రేమకే సైర
నువు వెయ్‌రా వెయ్‌రా
వైవైవెవైయ్‌రా పందెమే వెయ్‌రా
ప్రేమికులంతా ఒకటైనా నిలవరు నాతో పోటీ
ఒకరికి ఒకరను ప్రేమల్లో
ఏముందిలేరా గ్యారెంటీ
ఓ రేంజ్ లవ్ ... ఆరెంజ్‌లో... ॥రేంజ్‌॥

27 March - నేడు రామ్‌చరణ్‌తేజ్ బర్త్‌డే

చిత్రం : కుదిరితే కప్పుకాఫీ (2011)
రచన : సిరివెన్నెల సీతారామశాస్ర్తి
సంగీతం : యోగీశ్వరశర్మ (సిరివెన్నెల తనయుడు)
గానం : ఎస్.పి.బాలు, నిహాల్


పల్లవి :
శ్రీకారం చుడుతున్నట్టు
కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులేవి చూస్తున్నాయో
మాక్కూడా చూపించమ్మా
ప్రాకారం కడుతున్నట్టు
రాబోయే పండ గ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు
దాక్కుందే బంగరుబొమ్మా ॥
జల జల జల జాజుల వాన
కిల కిల కిల కిన్నెర వీణ
మిల మిల మిన్నంచులపైన
మెలిదిరిగిన చంచల యాన
మధురోహల లాహిరిలోన
మదినూపే మదిరవె జాణ

చరణం : 1
నీ నడకలు నీవేనా చూశావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి
నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాసె్తైనా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపును ముళ్లై గుచ్చే
కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని తీరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీగాలై సోకినవారు గాలిబ్ గజలైపోతారు
నీమేను తాకినవారు నిలువెల్లా విరులౌతారు
కవితవో యువతివో ఎవతివో
గుర్తించేదెట్టాగమ్మా

చరణం : 2
నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు
చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నా వెలుగంటూ
ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీక టినే చూస్తూ నిద్దురనే వెలివేయద్దు
వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టు
అందాకా మారామ్మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణి జాగారం ఎందుక్కాని
నడిమివో హరిణివో తరుణివో
మురిపించే ముద్దులగుమ్మ

చిత్రం : నిన్నేపెళ్లాడతా (1996)
రచన : సిరివెన్నెల
సంగీతం : సందీప్‌చౌతా
గానం : జిక్కి, రామకృష్ణ, సందీప్, రాజేష్, బలరామ్, సౌమ్య

పల్లవి :
నిన్నేపెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే
ఊరుకుంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
మా కళ్ళల్లో కారం కొట్టి
మీరు మాత్రం జారుకుంటారా
సెలక్షన్ చూశాం శభాషంటున్నాం
ముహూర్తం చూస్తాం తథాస్తు అనేసి
ముడేసి తరించిపోతాం
ఆపై మాతో మీకేం పనిరా
మాయమైపోతారులేరా
సరేరా కుమారా అలాగే కానీరా
నిన్నేపెళ్లాడేస్తానంటూ మాట ఇచ్చావా పాపం

చరణం : 1
ప్రేమదాకా ఓకే పెళ్లి మాత్రం షాకే
చాలురా నారద నీ హరికథ
పెళ్లయే యోగమే నీకున్నదా
ఇంటిలో ఇందరం ఉన్నాం కదా
కోరితే సాయమే చేస్తాం కదా
పార్కులో సీను తప్పురా శ్రీను
అందుకని నిన్ను సాక్షిగా ముందుంచి
ముద్దాడుకుంటార్రా కుర్రాళ్ళు
ఈ మహలక్ష్మీ ఇంటికి వస్తే
మేము మాత్రం కాదంటామా
సరేరా కుమారా అలాగే కానీరా
నిన్నేపెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే... మ్మ్...

చరణం : 2
సిగ్గుపడవే పండు నువ్వు కాదురా ఫ్రెండు
ఆడుతూ పాడుతూ మీ ఊరొస్తాం
అమ్మడు కాసుకో అల్లరి చేస్తాం
విందులు మెక్కుతూ వంకలు పెడతాం
చీటికి మాటికి చెలరేగుతాం
అల్లుడిని తెస్తాం కాళ్ళు కడిగిస్తాం
పెళ్లికాగానే అందర్నీ తరిమేసి
మిమ్మల్ని గదిలోకి నెట్టేసి
ఖర్చెంతైందో లెక్కలు వేస్తూ
మేలుకుంటాం మీకు పోటీగా
లలల్లా లలల్లా లలల్లా లలల్లా
నిన్నేపెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే
ఊరుకుంటామా
సెలక్షన్ చూశాం శ భాషంటున్నాం

బబంబం బబంబం బబంబం హై హై
నిన్నేపెళ్లాడేస్తానంటూ మాట ఇస్తే
ఊరుకుంటామా.....

చిత్రం : కృష్ణ (2007)
రచన : చంద్రబోస్
సంగీతం : చక్రి
గానం : వాసు, శ్రీవాణి



పల్లవి :
అదరగొట్టు కొట్టు కొట్టు
బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు విరగకొట్టు విరహాన్నే
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా॥

చరణం : 1
ఆ... ఆ... నా చెంపలు నిమిరెయ్యవా
చెవి రింగువై
నా గుండెలు తడిమేయవా ఓ గొలుసువై
నా పైటను పట్టేయవా పిన్నీసు నువ్వై
నీ చీకటి కరిగించనా కొవ్వొత్తినై
నీ భయమును తొలగించనా తాయత్తునై
నీ గదిలో వ్యాపించనా అగరొత్తి నేనై
వే లే పట్టే ఉంగరమయ్యి
నాతో తిరిగే బొంగరమయ్యి
ఒళ్లే మోసే పల్లకివయ్యి
నన్నే దాచే పంజరమయ్యి
ఊ కొడుతూ చేరనా ఊడిగమే చేయనా
ఊపిరిగా మారనా ఊయలనే ఊపనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
(3)॥

చరణం : 2
నా దరికే వచ్చెయ్యవా అపరంజివై
నా దాహం తీర్చెయ్యవా చిరపుంజివై
నా నోటికి రుచులియ్యవా నారింజ నీవై
నీ వాకిట కురిసెయ్యనా విరిజల్లునై
నీ రాత్రికి దొరికెయ్యనా రసగుల్లనై
నీ యాతన తగ్గించనా వడగళ్లు నేనై
ఆరోగ్యానికి ముల్లంగివై
ఆనందానికి సంపంగివై
సంగీతానికి సారంగివై రావే రావే అర్ధాంగివై
ఉత్సాహం నింపనా ఉల్లాసం పంచనా
ఉమ్మా అందించనా ఉంగా తినిపించనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
(3)॥

చిత్రం : అల్లరి (2002)
రచన : సిరివెన్నెల
సంగీతం : పాల్.జె
గానం : సురేష్ పీటర్, చిన్మయి, అపర్ణ


సాకీ :
కింగిని మింగిని కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మియామావ్
కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మియా ఆ ఆవ్
కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మింగిని
కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్

పల్లవి :
హేయ్... చిలిపి చిలక వలకు పడిందోయ్
వలపు చిటిక చెలికి మహా నచ్చిందోయ్
ఉడుకు దుడుకు వయసుగనక
కునుకు విడని కలల వెనక
నదురు బెదురు అనక ఎగిరి పోతోందోయ్
॥చిలిపి॥

చరణం : 1
ఫ్రీగా వదిలేసే నీ సోకు సైగ చూశా
డైలీ లైనేసి నిను పట్టేశా
పాపం తెగ చూసే నీ సంగతేదో చూశా
చాలా జాలేసి మనసిచ్చేశా
ఓటేసే వయసేలేదే మరి
లవ్ చేస్తే మతిచెడుతుందే
ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్
కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్
॥చిలిపి॥

చరణం : 2
ముందే చెబుతున్నా చెడిపోకు పిచ్చికన్నా
దిగితే అయిపోతావ్ నువు దీవానా
నిండా మునిగాక దిగులేమీ ఉండదింక
నువ్వే అవునంటావే దిగి చూశాక
ఏమైనా ఎవరేమన్నా ఎదురేమున్నా ఇది ఆగేనా
ప్రేమ పిచ్చి పుట్టుకొచ్చి తరుముకొచ్చెనోయ్
కింగిని మింగిని కింగిని మియా మ ఆ ఆవ్
॥చిలిపి॥

చిత్రం : తులసి (2007)
రచన : చంద్రబోస్
సంగీతం : దే విశ్రీ ప్రసాద్
గానం : వేణు, సునీత


పల్లవి :
వెన్నెలింత వేడిగా ఎండ ఇంత చల్లగా
ఉండేలాగ చేశావే ఓ ప్రియా
చేదు ఇంత తియ్యగా
బాధ కూడ హాయిగా
ఉంటుందని నేర్పావే ఓ ప్రియా
చీకట్లో సూరీడు పొద్దున్నేమో జాబిల్లి
వచ్చాయే నువ్వే నవ్వంగ
నేలపై మేఘాలు ఆకాశంలో గోదారి
చేరాయే నువ్వే చూడగా॥

చరణం : 1
నా పేరే అనుకుంటూ
నీ పేరు నేను రాశానే
నా రూపే అనుకుంటూ
నీ రూపు నేను గీశానే
తియ్యంగా తీవ్రంగా
ఏదో ఏదో అవ్వంగ
ప్రేమంటూ కానే కాదంటా
గిట్టంగా కొట్టంగా
ప్రేమను మించే పదమింక
మన జంటే కనిపెట్టాలటా॥

చరణం : 2
గాలైనా నిను చుడితే
ఎనలేని ఈర్ష్య కలిగిందే
నే లైనా నిను తడితే
ఎదలో అసూయ పెరిగిందే
గాఢంగా గర్వంగా
జోడి మనమే కట్టంగా
ఏడే జన్మలు సరిపోవంటా
దేవుళ్లే మనకోసం పగలురేయి పనిచేసి
ఎన్నో జన్మలు సృష్టించాలటా॥

చిత్రం : భక్తకన్నప్ప (1976)
రచన : ఆరుద్ర
సంగీతం : సత్యం
గానం : వి.రామకృష్ణ

పల్లవి : శ్రీకాళహస్తీశ్వరా హరహర
కరుణించి నను బ్రోవరా
దేవర కైవల్య పదమీయరా ॥

చరణం : 1
ఆలయమన్నది లేదని నీకై అల్లెను
గుడులను సాలీడు
ఆ భక్తుడు నీవు సంశోధించ
అగ్నిపరీక్షను పొందాడు
నీ గుడి రూపము చెరిపిన దీపము
మ్రింగ దలంచెను పురుగు
ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది
ముక్తినొసంగిన దేవా ॥

చరణం : 2
పన్నగ మొక్కటి ప్రతి ఉదయమ్మున
ఎన్నో మణులను తెచ్చేదీ
నిన్నే పూజించేదీ
పాముయొనర్చిన పూజను మెచ్చక
ఏనుగు దానిని తుడిచేదీ
వేరే పూజలు చేసేదీ
ఒకరు యెనర్చిన పూజలునొల్లనొ
కరికాళమ్ములు పగబూనీ
తరుణము కొరకై వేచినవీ
తొండము నుండి దూరిన పాము
మెండుగ గజమును బాధించే
కొండను మోదగ కుంభము పగులగ
రెండొక తరి మరణించె
నీకై పోరిన ఆ ప్రాణులకు
నీ సాయుజ్యము లభియించే
జంతుసంతతికి ఇచ్చిన మోక్షము
సదాశివా దయచేయవా ॥

చిత్రం : రుద్రవీణ (1986)
రచన : సిరివెన్నెల
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
చుట్టు పక్కల చూడరా చిన్నవాడా
చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా ॥
కళ్లముందు కటిక నిజం... కానలేని గుడ్డి జపం
సాధించదు ఏ పరమార్థం
బ్రతుకుని కానీయకు వ్యర్థం (2)॥

చరణం : 1
స్వర్గాలను అందుకొనాలని
వడిగా గుడి మెట్లెక్కేవు
సాటి మనిషి వేదన చూస్తూ
జాలిలేని శిలవైనావు
కరుణను మరిపించేదా
చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదాయమంటే॥॥

చరణం : 2
నువ్వు తినే ప్రతి ఒక మెతుకు
ఈ సంఘం పండించింది
గర్వించే ఈ నీ బ్రతుకు
ఈ సమాజమే మలచింది
రుణం తీర్చు తరుణం వస్తే
తప్పించుకుపోతున్నావా
తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే॥॥

చిత్రం : ఓ చినదానా(2002)
రచన : సిరివెన్నెల
సంగీతం : విద్యాసాగర్
గానం : దేవాశిష్

సాకీ : నిన్నడిగి కుడుతుందా చీమైనా దోమైనా
నిన్నడిగి పుడుతుందా ప్రేమైనా ఏమైనా
ఓ చినదానా...

పల్లవి : తన చిరునామా అడిగితే ప్రేమ
నిను చూపెడుతోందే ఓ చినదానా ఓ చినదానా
అవుననవమ్మా ప్రతి మగజన్మ
విసుగెత్తకముందే ఓ చినదానా ఓ చినదానా
ఒకదానివైతే నువు మోయలేవు
బరువైన ప్రాయం
మొగమాట పడక అడిగేయరాదా
మగవాడి సాయం ఓ చినదానా ఓ చినదానా
ఓ చెలీ ఓ సఖీ ఐ యామ్ రెడీ యు లవ్ మీ (2)॥

చరణం: 1
కమ్మనైన కల కమ్ముకుంటదని
అర్ధరాతిరిని నిద్రమానుకొని
ఎందుకోసమని ఎంతకాలమని ఈ పంతం
లేనిపోని నకరాలు మానుకొని గుండెచాటు తొలిప్రేమ పోల్చుకొని
నన్ను చేరుకొని చేతికి మరి నీ అందం
చెబుతున్నా విననంటే ఎదరున్నా కననంటే
తిడతావే చుప్పనాతి విడనీవే బుంగమూతి
ఓ మధుమతి హై... ఓ మధుమతీ (2)॥

చరణం : 2
ఎవ్వరైనా విని నవ్వుతారు అని
కాస్త కూడ బెదురైనా లేనిదని
ఆడపుట్టుకే అలుగుతుంది కదా నీ మీద
వెచ్చనైన మగ ముద్దు పుచ్చుకొని
ముచ్చటైన సొగసంత ఇచ్చుకొని
సిగ్గుచాటు కల మొగ్గవిచ్చునని తెలియనిదా
సహజంగా జరిగేదే తగదంటూ తగువేంటే
మగ ఊసే చెవి పడితే బుస కొట్టే బిగువేంటే
ఓ నెరజాణా హై ఓ జానే జానా ॥

23rd March : నేడు శ్రీకాంత్ బర్త్‌డే

చిత్రం : చెంచులక్ష్మి (1958)
రచన : ఆరుద్ర
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, జిక్కి

పల్లవి :
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల
చిగురు కోయగలవా?
ఓ నరహరి! చిగురు కోయగలవా?
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల
చిగురు కోయగలనే!
ఓ చెంచిత! చిగురు కోయగలనే!

చరణం : 1
ఉరకలేయగలవా? ఓ నరహరి!
పరుగులెత్తగలవా? (2)
ఊడ పట్టుకొని జారుడు బండకు
ఊగి చేరగలవా?
ఓ నరహరి! ఊగి చేరగలవా?
ఉరకలేయగలనే! ఓ చెంచిత! పరుగులెత్తగలనే ఉరకలేయగలనే! ఓ చెంచిత! పరుగులెత్తగలనే
ఊడ పట్టుకొని జారుడు బండకు
ఊగి చేరగలనే!
ఓ చెంచిత! ఊగి చేరగలనే!

చరణం : 2
ఓహో హోయ్... గురిని చూసుకుని
కనులు మూసుకుని బాణమేయగలవా?
ఓ నరహరి! బాణమేయగలవా?
గురిని చూసి వెనుతిరిగి
నాణెముగ బాణమేయగలనే!
ఓ చెంచిత బాణమేయగలనే!
ఓ చెంచిత నిన్ను మించగలనే!


చరణం : 3
ఓహో హోయ్... తగవులేల
ఎగతాళికాదు నను తాళిగట్టనీవా!
ఓ చెంచిత తాళిగట్టనీవా!
మనసు తెలుసుకొని
మొరులు చూపితే మనువునాడనిస్తా!
ఓ నరహరి! మనువునాడనిస్తా!
ఓ నరహరి! మాలతెచ్చివేస్తా!

English / Hollywood Movies

Hindi / Bollywood Movies

Telugu / Tollywood Movies

#

13 - padamUDu
143 and I miss you
1977 jarigindi yEmiTi

A

A Film By Aravind
Aa Intlo
Ananda nilayam
annayya
Aatma Bandham
Abbai Gari Pelli
Abhay
abhi
Abhimana Vanthulu
abhinandana
Adhipati
adhurs
Adavilo Abhimanyudu
Aggiramudu
Agni Keratalu
akkaDa ammAyi ikkaDa abbAyi
Akka Mogudu
Akkum Bakkum
Allari
All Rounder
allari bullODu
allari piDugu
Alludugaru Zindabad
Amara Deepam
amma cheppindi
Amma Rajinama
ammAyi manasu
Ammulu
Anand
andari bandhuvayA
andarivADu
Anna Chellelu
anukOkuNDa oka rOju
ApathbAndhavulu
Anasuya
Anna Sainyam
Anubandham | Link 1|
anUrAdha
Anveshana
appula appA rao
ArAdhana
araNyakaNDa
Arey
arjun
asAdhyudu
ASAjyoti
Ashok | Link 1 |
Athanokkade|Link 1|
AwArA

B

Bachelors
Badai Basavayya
Badri
bAla rAju
Bali Danam
bAlu ABCDEFG
Bangaram
bangArubhUmi
bangAru pApa
bangAru pa~njaram
bangAru talli
bApUjI bhAratam
basti bulbul
Bathukamma
Bavagaru Bagunnara
bazAr Rowdy
bejawAda roudy
Bhadrachalam
bhakta rAmadAsu
Bhale Donga
Bhale Mastaru
Bhale Mavayya
Bhalevadivi Basu
Bhayya
bobbili rAjA
BhUlOka Rambha
bhUpati naidu
Bommala Koluvu
buddimantuDu
Budget Padmanabham
bullet
Bumper Offer
Bunny

C

carA mazAkA
Cash
chakravarti
challani nIDa
chandramukhi
Chantigadu
Cheppalani Vundi
Chettu Kinda Pleader
Chiranjeevulu
Chitti Tammudu | Link 1 |
Chukkallo Chandrudu
chUpulu kalasina subhavELa
CID
Constable Kuturu

D

daddy
dAri tappina manishi
Dayamayudu
Delhi Police
Desamuduru
Deva Kanya
Devatha
Devullu
Dheerudu
dongala dOpiDi
Donga Ramudu
Donga Sachinollu
Dongodi Pelli
Doshi Nirdoshi| Link 1 |
Dubai Seenu

E

Ekaveera
Evadaina Sare
Evaraina Edirista

F

Family Circus

G

G
Geetha
Giri
Godava
Good Boy
Goonda
Guppedu Manasu

H

H2O
Hai Subrahmanyam
Hitler

I

Iddaru Iddare
Idiot
I Love U Raa

J

Jambalakidi Pamba
Jatakaratna Midathambotlu
Jaya Dev
jayam manadErA
Jenda
Jyothi

K

Kalpana
Kauravudu
Khadgam
Kiladi Bullodu
King
Khadgam
Krishna Prema
Kushi Kushiga

L

Lakshyam

M

Maa Babu
Maha Prasthanam
Maharajasri
Manasantha
Manasunna Maaraju
Manavuri Pandavulu
Manmadha
Mantradandam
Maro Charithra
Maro Prapancham
Mee Sreyobhilashi
Missamma (New)
Modati Cinema
Moratodu Naa Mogudu
Mruga Raju
Muddula Mogudu

N

Naa Autograph - Sweet Memories
Naamanasukemaindi
Nagaram
Navvutu Bathakalira
Nenunnanu
Nenu Saitham
nuvvulEka nEnulEnu
Nyam Kavali

O

O Manishi Tirigi Choodu
Ontari Poratam

P

Pachani Kapuram
Pandaga
Pandurangadu
Paravasam
Party
Pellaina Kothalo
Pellam Pichchodu
Pelli Kani Prasad
Police Karthavyam
Police Sisters
Police War
Potti Pleader
Pourudu
Prem
Prema Chadarangam
prEmapAvurAlu
prEmAlayam
Prema Sagaram
Prema Simhasanam

R

Raagam
Radha Krishna
Rendu

S

sAgarasa~mgamam
Sa~mkarAbharaNam
Seethamma Pelli
Seetha Ramudu
sitAra
Siva Puram
Siva Putrudu
Sontham
SMS (Mem Vayasuku Vachcham)
Sneham
Snehitudaa
Srutilayalu|Link 1|Link 2 |
Street Rowdy
Sudi GundAlu
Sundaraniki Thondarekkuva
Suswagatham

T

Takkari Donga
Trinetrudu

U

V

Vaddu Bava Thappu
Veedera Police
Veerabhimanyu
Venkat Tho Alivelu
Vichitra Kutumbam
Vignesh
Vijayadasami

W

Wife

X

Y

Yama Donga
Yama Gola
Yuva
Yuvaraju
Yuvatha

Z

Zamindar

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో యెందుకు వగచేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
ఎందుకు రగిలేవో యేమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల వుయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు యున్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు యేన్నేన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చిత్రం :గుప్పెడు మనసు
గానం :ఎమ్. బాలమురళీకృష్ణ
రచన: ఆత్రేయ
సంగీతం:ఎమ్.ఎస్.విశ్వనాధన్


శ్రీరామ జయ రామ సీతారామ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ

నీ దివ్యనామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ

చరణాలు కొలిచే నగుమోము జూచే ఆ
చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
భక్తి సామ్రాజ్యమిచ్చావు సాకేతరామా
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు అవతారమెత్తేవు సుగుణాభిరామా
శ్రీరామ జయ రామ సీతా రామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతా రామ

నిలకడ లేని అల కోతి మూకచే
నిలకడ లేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నీ పేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ
శ్రీరామ జయ రామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీరామ జయ రామ సీతారామ

చిత్రం :ముత్యాల ముగ్గు
గానం :ఎమ్.బాలమురళీకృష్ణ
సంగీతం:కె.వి.మహదేవన్

ఓలియొ ఓలియొ హొరెత్తాలే గోదారి
ఎల్లువై తుల్లాబిలా గట్టుజారి
ఓలియొ ఓలియొ ఊరేగాలే సింగారి
ఇంతకి యాడుందే అత్తింటి దారి..

హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...
హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...

హొయ్‍నా యేం చాందినిరా హొయ్‍నా యేం చమక్కిదిరా
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నావెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా కులికెనురా కన్నెధారా...

ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా..

హొయ్‍నా యేం చాందినిరా హొయ్‍నా యేం చమక్కిదిరా
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నా వెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా యేం కులికెనురా కన్నెతారా...

హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...
హొయ్‍నా ... హొయ్‍నా ... హొయ్‍నా ...

హో....వగలమారి నావ హొయలు మీరినావా
అలల ఊయలూగినావా...
తళుకు చూపినావా తలపు రేపినావా
కలలవెంట లాగినావా...

సరదా మది నీవే అడుగే ఏమారి
సుడిలో పడదోసి అల్లరి
త్వరగా సాగాలి దరికే చేరాలి
పడవ పోదాం పద ఆగకే మరి..

హొయ్‍నా యేం చాందినిరో హొయ్‍నా యేం చమక్కిదిరో
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నావెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా యేంకులికెనురా కన్నతారా...

నీటిలోని నీడ చేతికందుతుందా
తాకి చూడు చెదిరిపోదా
గాలిలోని మేడ మాయలేడి కాదా
తరిమిచూడు దొరుకుతుందా...

చక్కని దానా చుక్కాని కానా
నీ చిక్కులన్నీ దాటగా
వద్దు అనుకున్నా వదలదు నెఱజాన
నేనే నీ జంట అని రాసి ఉందిగా...

హొయ్‍నా యేం చాందినిరో హొయ్‍నా యేం చమక్కిదిరో
హొయ్‍నా యేం మెరిసెనురా కన్నులారా..
హొయ్‍నా వెన్నెల నదిరా హొయ్‍నా వన్నెలలిదిరా
హొయ్‍నా యేంకులికెనురా కన్నెతారా...


చిత్రం ; ఆట
రచన : సిరివెన్నెల
సంగీతం: దేవిశ్రీప్రసాద్
గానం : కార్తీక్, చిత్ర

అహహహహహా వివాహభోజనంబు ఆహా హా
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓ హో హో నాకె ముందు
అహాహా అహాహా అహాహా అహాహాహా

ఔరౌరా గారెలల్ల అయ్యారె బూరెలిల్ల
ఔరౌరా గారెలల్ల అయ్యారె బూరెలిల్ల
ఓ హో రే అరెసెలిల్ల అహాహా అహాహా
ఇయెల్ల నాకె చెల్ల


భళేరె లడ్డు లందు భక్షేణి బోణి ఇందు
భలే జిలాబి ముందు అహాహా హాహా
ఇయెల్ల నాకే విందు

మఝారె అప్పడాలు పులిహోర తప్పళలు
మజారే అప్పడాలు పులిహోర తప్పళలు
వహ్వారే పాయసాలు అహా హాహాహా
ఇయెల్ల నాకే చాలు

Movie:మాయాబజార్ (mAyAbazAr)
Singer: Madhavapeddi Satyam
Music :Ghantasala

కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని
కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్
సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని

భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని
మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని
తలపులున్నవి కొన్ని

సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే
పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే
వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే
పెను చీకటినేల సృజించే

వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం
అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం … సలుపకు పరిహాసం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనకములాయం
బదలు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం
బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనకములాయం
బదలు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం

చిత్రం : బాటసారి
గానం : పి. భానుమతి, జిక్కి
రచన : జూ.సముద్రాల
సంగీతం : మాస్టర్ వేణు

;;
Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |