Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి : బాగుందమ్మా బాగుంది
అమ్మాయి నీ ముద్దు
మళ్ళీ మళ్ళీ అంటాను
అబ్బాయి చంపొద్దు
ఊయలల్లే ఊగే నీ నడుమే ముద్దు
హమ్మ హమ్మ హమ్మ సితం ఆగాలమ్మా
॥ చరణం : 1

వెచ్చటి గుండెల చప్పుళ్ళో
నా కంటి రెప్పల్లో
పదిలంగా ఉందోయమ్మ నీ రూపమే
పున్నమి వెన్నెల కాంతుల్లో
ఆ మబ్బు డొంకల్లో
రేయంతా వెతికానమ్మా నీ కోసమే
అమ్మాయి బుగ్గల్లో మందారం మొగ్గల్లే
దోబూచులాడుతున్న సిగ్గే ముద్దు
వద్దూ వద్దూ వద్దూ నను కవ్వించొద్దు
మోమాటాలే వద్దూ గిలిగింతే వద్దు
॥ చరణం : 2

ఉక్కిరి బిక్కిరి అవుతున్నా
నేనెంత కాదన్నా
నీలోనే చేరిందమ్మా నా ఊపిరి
ఎప్పుడు ఎప్పుడు అనుకున్నా
ఈ రోజే చూస్తున్నా
నాకెంతో నచ్చిందమ్మా నీ వైఖరి
ఛీ పాడు సిగ్గన్నా సూదంటు రాయల్లే
కుచ్చెళ్ళు లాగేస్తున్న చూపే ముద్దు
ముద్దు ముద్దు ముద్దు
నీ నడుమే ముద్దు
విప్పద్దయ్యో నువ్వు మరి చికాకొద్దు ॥

చిత్రం : టక్కరి దొంగ (2002)
రచన : కులశేఖర్
సంగీతం : మణిశర్మ
గానం : ఎస్.పి.చరణ్, ఉష

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |