Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : శివ (1989)
రచన : వేటూరి
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, చిత్ర


పల్లవి :
ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్లింతల్లో ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్లంటుకుంటే చాలు నాట్యాలు
శృంగార వీణరాగాలే... హోయ్ ॥

చరణం : 1
సిగ్గేయగా బుగ్గ మొగ్గ మందార ధూళే దులిపే
జారేసినా పైటంచునా అబ్బాయి కళ్లే నిలిపే
సందిళ్లకే చలివేస్తుంటే అందించవా సొగసంతా
ఒత్తిళ్లతో ఒలికేస్తుంటే వడ్డించనా వయసంతా
వెలుగులో కలబడే కలలు కన్నా
తనువులో తపనలే కదిపినా కథకళిలోన ॥

చరణం : 2
ఈ చీకటే ఓ చీరగా నా చాటు అందాలడిగే
ఈ దివ్వెలా క్రీనీడలే నీ సోకులన్నీ కడిగే
నీ మబ్బులే గుడి కడుతుంటే
జాబిల్లిలా పడుకోనా
తబ్బిబ్బుతో తడబడుతుంటే
నీ గుండెలో నిదరోనా
ఉదయమే అరుణమై ఉరుముతున్నా
చెదరనీ నిదరలో కుదిరిన పడకలలోన ॥

Listen Song:



External Link:

enniyallO malliyallO

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |