చిత్రం : ఉయ్యాల జంపాల (1965)
రచన : ఆరుద్ర
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : పి.లీల, బృందం
పల్లవి :
అందాల రాముడు ఇందీవరశ్యాముడు
ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేముడు ॥
ఎందువలన దేముడు...
చరణం : 1
తండ్రి మాటకై పదవుల త్యాగమే చేసెను (2)
తన తమ్ముని బాగుకై తాను బాధ పొందెను
అందాల రాముడు అందువలన దేముడు ॥
చరణం : 2
అనుభవించదగిన వయసు
అడవిపాలు జేసెను (2)
అడుగుపెట్టినంతమేర ఆర్యభూమి జేసెను
అందాల రాముడు అందువలన దేముడు...
॥
చరణం : 3
ధర్మపత్ని చెరబాపగ దనుజుని దునుమాడెను
ధర్మము కాపాడుటకా సతినే విడనాడెను
అందాల రాముడు అందువలన దేముడు... ॥
31 August - నేడు ఆరుద్ర జయంతి, పెండ్యాల నాగేశ్వరరావు వర్ధంతి