Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

girinImE galagAlA - గిరినీమే గలగాలా

చిత్రం : సింహాద్రి (simhAdri)(2003), రచన : సిరివెన్నెల
సంగీతం : కీరవాణి, గానం : కళ్యాణి మాలిక్


పల్లవి :
గిరినీమే గలగాలా గిరతితీ వైమారే
వియ్యాల ఇకతేకో చురతీతి వైమా
అమ్మై నాన్నైనా ఎవరైనా ఉండుంటే
పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా
చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా
సై ఆట సాగేనా ఎగసే కెరటానా
అమ్మా నాన్న ఉంటే అమ్మో మహ ఇబ్బందే
కాస్తై అల్లరి చేసే వీల్లేదే ॥
చరణం : 1
సూరీడుకి నాన్నంటే స్కూల్లో పెడతానంటే
పగలైనా వెలుతురు వస్తుందా
జాబిల్లికి అమ్ముంటే ఒళ్లో జోకొడుతుంటే
రాతిరేళ వెన్నెల కాస్తుందా
నిను చేరేనా నా లాలన ఏనాటికైనా ఓ పసికూన
ఆడిందే ఆటంటా పాడిందే పాటంటా
ఆపేందుకు అమ్మా నాన్న లేరంటా
సరదాగా రోజంతా తిరిగేనా ఊరంతా
ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మ
అలుపంటూ లేకుంటా చెలరేగి ఉరికేనా
ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్న
చరణం : 2
అలిగిందా రాచిలక కూర్చుందా కిమ్మనకా
నాతో మాటాడేదెవరింకా
రానందా నావంక దాగుందా కొమ్మెనకా
అమ్మో మరి నాకేం దారింకా
ఏదీ ఏదీ రానీ రానీ నన్నేరుకోనీ ముత్యాలన్నీ
ఈ న వ్వే చాలంటా పులకించే నేలంతా
పున్నాగ పూవులతోటయ్యేనంటా
దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి
ఆనందం అంచులు నేడే చూడాలి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |