చిత్రం : భైరవద్వీపం (1994)
రచన : సిరివెన్నెల, సంగీతం : మాధవపెద్ది సురేష్
గానం : ఎస్.పి.బాలు, సంధ్య, బృందం
08 September - నేడు మాధవపెద్ది సురేష్ బర్త్‌డే (షష్టిపూర్తి)
పల్లవి :
చందమామ వచ్చినా చల్లగాలి వీచినా
చిచ్చు ఆరదేలనమ్మా
ఓ చెలియా సంగతేమో చెప్పవమ్మా
చందనాలు పూసినా ఎంత సేవ చేసినా
చింత తీరదేలనమ్మా
ఓ సఖియా ఉన్నమాట ఒప్పుకోమ్మా
జంట లేదనా... ఆహాహా
ఇంత వేదనా... ఓహోహో
జంట లేదనా ఇంత వేదనా
ఎంత చిన్నబోతివమ్మా ॥
ఓ మురిపాల మల్లిక...
దరిజేరుకుంటినే పరువాల వల్లిక...
ఇది మరులుగొన్న మహిమో
నిను మరువలేని మైకమో
ఎంత ఎంత వింత మోహమో
రతికాంతుని శృంగార మంత్రమో (2)
మరు మల్లెల సరమో విరి విల్లుల శరమో (2)
ప్రణయానుబంధమెంత చిత్రమో ॥
చరణం : 1
విరిసిన వనమో యవ్వనమో
పిలిచింది చిలిపి వేడుక కిలకిల పాటగా
చలువల వరమో కలవరమో తరిమింది
తీపి కోరిక చెలువను చూడగా
దరిశనమీయవే సరసకు చేరగా
తెరలను తీయవే తళుకుల తారక
మదనుడి లేఖ శశిరేఖ అభిసారిక ॥
చరణం : 2
కలలను రేపే కళ ఉంది
అలివేణి కంటి సైగలో జిగిబిగి సోకులో
ఎడదను ఊపే ఒడుపుంది
సుమబాల తీగ మేనిలో సొగసుల తావిలో
కదలని ఆటగా నిలిచిన వేడుక
బదులిడ రావుగా పిలిచిన కోరిక
బిడియమదేల ప్రియురాల మణిమేఖల ॥