Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : చక్రధారి (1977)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : జి.కె.వెంకటేష్
గానం : ఆనంద్/ఎస్.పి.బాలు


పల్లవి :

విఠలా విఠలా పాండురంగ విఠలా
జై పాండురంగ విఠలా॥
సర్వం మరచీ నీ స్మరణము సేయ
స్వర్లోక ఆనందమే॥

చరణం : 1
అంబుజనాభా నమ్మిన వారికి (2)
అభయమునొసగీ ఆర్తిని బాపీ
ఉభయ తారకా పథమును చూపీ (2)
ఉద్ధరించు కరుణా సింధో ॥

చరణం : 2
నిన్నెరిగించే జ్ఞానమే జ్ఞానము (2)
నిను స్మరియించే ధ్యానమే ధ్యానము
నిను కీర్తించే గానమే గానము (2)
నీకర్పించే జన్మమే జన్మము ॥

గమనిక : ఈ పాటను మొదట ఆనంద్‌తో పాడించారు. రికార్డులు కూడా వచ్చాయి. కానీ బాలు పాడిన వెర్షన్ సినిమాలో ఉంది. ఆ తర్వాత బాలు పాడిన వెర్షన్ కూడా రికార్డులుగా రిలీజయింది.
21 September - నేడు జి.కె.వెంకటేష్ జయంతి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |