Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : కార్తవరాయని కథ (1958)
రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి
సంగీతం : అశ్వత్థామ
గానం : పి.బి.శ్రీనివాస్


పల్లవి :

ఆనందమోహన ఖగరాజవాహన
ఆనందమోహన
అవతార లీలవిలాస లోకేశా (2)
ఆనందమోహన...

చరణం : 1

దరిచేరు వారిని కరుణించు దైవరాయ
శరణంటినయ్యా స్వామీ వరమీయవయ్యా
చిరునవ్వు దేవర... చిరునవ్వు దేవర...
ఆనందమోహన...

చరణం : 2

అందరినీ ఒక ఆటాడించుట నీకు వేడుక
నిను కొనియాడుట మాకు వేడుక
కోరిన కోరిక సఫలముగా చేదోడు కావయా...
కోరిన కోరిక సఫలముగా చేదోడు కావయా
తోయజ నయనా ॥
చరణం : 3

పాలకడలిలో పాప పానుపున
సిరుల జవరాలు సరసను నిలువగ
సరసాలలో మైమరచే మీ పరవశమే...
సరసాలలో మైమరచే మీ పరవశమే
దీవెన కావలె ॥
22 September - నేడు పి.బి.శ్రీనివాస్ పుట్టినరోజు

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |