Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : నిన్నేపెళ్లాడతా (1996)
రచన : సిరివెన్నెల
సంగీతం : సందీప్‌చౌతా, గానం : సౌమ్య


పల్లవి :
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు నా రాకుమారుడు
కలల్లోనే ఇంకా ఉన్నాడు
ఫిలింస్టారులు క్రికెట్టు వీరులు
కళ్లుకొట్టి చూసే కుర్రాడు డ్రీమ్‌బాయ్
రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు
డ్రీమ్‌బాయ్
ఊరని పేరని జాడనే చెప్పడు
ఏమి చెప్పను ఎలాగ చెప్పను
ఎంత గొప్పవాడే నా వాడు
రెప్పమూసినా ఎటేపు చూసినా
కళ్లముందు వాడే ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎవ్వరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు... (2)

చరణం : 1
నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నబోదా
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా
స్టైల్‌లో వాడంత వాడు లేడు
నన్ను కోరిన మగాళ్లు ఎవ్వరు
నాకు నచ్చలేదే వాట్ టు డూ
నేను కోరిన ఏకైక పురుషుడు
ఇక్కడే ఎక్కడో ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎందుకో ఆకలి నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు... (2)

చరణం : 2
లోకమంతా ఏకమైనా లెక్కచేయనన్న వాడు
కోరుకున్న ఆడపిల్ల కళ్లముందు నిలవలేడు
చూస్తా ఎన్నాళ్లు దాగుతాడు
కన్నె ఊహలో ఉయ్యాలలూగుతూ
ఎంత అల్లరైనా చేస్తాడు
ఉన్నపాటుగా కొరుక్కు తిననుగా
ఎందుకంత దూరం ఉంటాడు॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |