Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం: నువ్వునాకునచ్చావ్(Nuvvu NAku NachchAv) (2001)
రచన : సిరివెన్నెల
సంగీతం : కోటి
గానం : ఎస్.పి.బాలు, బృందం


పల్లవి :

ఆకాశం దిగివచ్చి మబ్బులతో
వెయ్యాలి మన పందిరి (2)
ఊరంతా చెప్పుకునే ముచ్చటగా
జరగాలి పెళ్లంటే మరి
చెరి సగమవమని మనసులు
కలుపుతు తెర తెరిచిన తరుణం
ఇది వరకెరగని వరసలు కలుపుతు
మురిసిన బంధు జనం
మా ఇళ్ల లేత మావిళ్ల తోరణాలన్నీ
పెళ్లి శుభలేఖలే
అక్షింతలేసి ఆశీర్వదించమను
పిలుపులైనవీ గాలులే ॥

చరణం : 1
చెంపలో విరబూసే
అమ్మాయి సిగ్గు దొంతరలు
ఆ సొంపులకు ఎరవేసే
అబ్బాయి చూపు తొందరలు
ఏ వరాలు ఈ జవరాలై
జతపడు సమయంలో
వాన విల్లే వధువుగ మారి
ఒదిగిన వేడుకలో
తన సరసన విరిసిన సిరి సిరి సొగ
సుల కులుకుల కలువకు కానుకగా
ఎద సరసున ఎగిసిన
అలజడి అలలే తాకగా
ధీంతక దీంతక దీంతక తకధీం (2)॥

చరణం : 2
విన్న వారెవరసలు
సన్నాయి వారి సంగతులు
సన సన్నగా రుసరుసలు
వియ్యాల వారి బుసబుసలు
సందు చూసి చక చక ఆడె
జూద శిఖామణులు
పందిరంతా ఘుమఘుమలాడే
విందు సువాసనలు
తమ నిగ నిగ నగలను
పదుగురి ఎదురుగా
ఇదిగిదిగో అని చూపెడుతూ
తెగ తిరిగే తరుణుల తికమక
పరుగులు చూడగా॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |