చిత్రం : దడ(daDa) (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి(rAma jOgayaa SAstri)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్(dEviSri prasAd)
గానం : రిచర్డ్, రనీనా రెడ్డి(richard, ranInA reddy)
23 November - నేడు నాగచైతన్య బర్త్‌డే
పల్లవి : భూమే గుండ్రంగా
ఎందుకు ఉందని ఆలోచించావా
ఆకాశం నీలంగానే
ఎందుకు ఉందో అడిగావా
సూర్యుడికా వెలుగేంటి అని
క్వశ్చన్ గాని వేశావా
చిరుగాలీ కన పడవేంటని
ఎపుడైనా ప్రశ్నించావా
ఇదివరకు నడిచిన దూరం
ఎంతని కొలిచావా
కాలానికి వయసెంతా అని
ఆరా తీశావా
ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే
తెలియకున్నా
పోయేది ఏమీలేదు ఛోడ్‌దో
లోలీటా సెన్యో రీటా
లైఫే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్
లోలీటా సెన్యో రీటా
అంచేతే కానిచ్చేద్దాం ఆటాపాటా
చరణం:1ఒక మనిషికి ఒకటే మెదడు
ఎందుకు ఉందో అడిగావా
గుండెకు ఆ లబ్‌డబ్ సౌండ్
ఏంటని క్వశ్చన్ చేశావా
కనుబొమలు కలిసేలేవని
కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యావా
నీ తల్లో మెమరీ సైజు
ఎన్ని బైట్లో ప్రశ్నించావా
దోమలది ఏ బ్లడ్‌గ్రూప్ అని
గూగుల్లో వెతికావా
స్వీటెందుకు ఇష్టం నీకని
చీమని అడిగావా ॥ప్రశ్నల॥
చరణం : 2 ఆల్ఫాబెట్‌లు ఇరవైఆరే
ఉన్నాయేంటని అడిగావా
రోజుకు ఓ యాభైగంటలు
లేవేంటని ఫీలయ్యావా
ఫోనెత్తి హల్లో ఎందుకు
అంటాం ఆలోచించావా
అగరొత్తికి దేవుడికి లింకేంటో
రీసెర్చ్ చేశావా
రెయిన్‌బోలో బ్లాక్ అండ్ వైట్
ఎందుకు లేవన్నావా
నిద్దర్లో కలదేరంగో రీవైండ్ చేశావా॥ప్రశ్నల॥