Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : దూకుడు(dookuDu) (2011)
రచన : విశ్వ, సంగీతం : ఎస్.థమన్
గానం : శంకర్ మహదేవన్, బృందం
Photo:విశ్వ


పల్లవి :
నీ దూకుడు... సాటెవ్వడూ
సరాసరి వచ్చి
ఎదుటపడి తెగబడతూ రెచ్చి
నిషాన ధనాధనా కూల్చే జోరే
హమేషా ఖణేల్ ఖణేల్‌మంటూ
కలయబడి కలకలమే రేపే
బినా యే భలా బురా సోచే॥దూకుడు॥

చరణం : 1
విషపు ఊడ పడగలనే
నరికివేయి తత్‌క్షణమే
పనికిరాదు కనికరమే
అణచివేత అవసరమే
వదలినావు దురితులనే
ప్రళయమేరా క్షణక్షణమే
సమరమే సై ఇక చలగిక చకచకా
ఎడతెగ చేయి ఇక విలయపు తైతక
పిడికిలినే పిడుగులుగా కలబడనీ॥దూకుడు॥

చరణం : 2
గీత విను దొరకదు గుణగణమే
చేవగల చతురత కణకణమే
చీడలను చెడమడ దునమడమే
నేటి మన అభినవ అభిమతమే
ఓటమిని ఎరుగని పెను పటిమే
పాదరస ఉరవడి నరనరమే
కర్ దిఖాయే జరా హఠ్‌కే
హోష్ ఉడాయే దుష్‌మన్‌కే॥
చొరబడుతూ గురిపెడుతూ
తలపడుతూ
నాననా నాననా నానానా (2)
కమాల్ హై ధమాల్ హై ఏ దూకుడు
ఝుకే నహీ రుకే నహీ ఏ దూకుడు॥॥దూకుడు॥


Special Note:-
సంతోషం సినిమాలో ‘మెహబూబా మెహబూబా’ పాటతో పరిచయమయ్యారు విశ్వ.తనదైన శైలిలో దాదాపు ఆయన రాసిన పాటలన్నీ హిట్‌ట్రాక్స్‌గా నిలిచాయి.దూకుడులోని ఈ పాట విశ్వకు వందవదని చెప్పారు.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |