చిత్రం : తేనెమనసులు(tEnemanasulu) (1965)
రచన : దాశరథి
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : ఘంటసాల, పి.సుశీల
05 November - నేడు దాశరథి వర్ధంతి
పల్లవి :
దివినుండి భువికి దిగివచ్చె దిగివచ్చె
పారిజాతమే నీవై నీవై॥
గుడిలోని ప్రతిమ వచ్చింది వచ్చింది
కోటి ప్రభలతో నీవై నీవై॥॥
చరణం : 1
అందని జాబిలి అందాలు పొందాలి
అనుకున్నానొకనాడు ఆనాడు॥
అందిన జాబిలి పొందులో అందాలు అందిన జాబిలి పొందులో అందాలు
పొందాను ఈనాడు ఈనాడు (2)॥
చరణం : 2
కనరాని దేవుని కనుల చూడాలని
కలగంటినొకనాడు ఆనాడు॥
కల నిజము చేసి కౌగిలిలో చేర్చి (2)
కరిగించే ఈనాడు ఈనాడు (2)॥
చరణం : 3
కడలిలో పుట్టావు అలలపై తేలావు
నురగవై వచ్చావు ఎందుకో॥
కడలి అంచువు నిన్ను కలిసి
నీ ఒడిలో (2)
ఒదిగి కరగాలనే ఆశతో॥॥॥
Special Note:
‘ఇద్దరుమిత్రులు’ చిత్రంలోని ‘ఖుషీఖుషీగా నవ్వుతూ’ పాట ద్వారా డాక్టర్ దాశరథి చలన చిత్రసీమలో అడుగుపెట్టారు. తన కలంతో నవరసభరితమైన గీతాలను ఎన్నిటినో అద్భుతంగా రచించారు. ఆకాశవాణిలో ప్రసారమవుతున్న శ్రోతలు కోరే సినీగీతాల కార్యక్రమానికి ‘జనరంజని’ అనే పేరు పెట్టడమే కాకుండా తొలిగీతం కూడా ఆయన చేతుల మీదే ప్రసారమయ్యింది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’, ‘నాకు ఉర్దు, తెలుగు రెండు కళ్లు...’ వంటివి పలికిన ప్రముఖ తెలంగాణ కవి. ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా ఎన్నో సేవలను అందించారు.