చిత్రం : రాజకుమారుడు(rAjakumAruDu) (1999)
రచన : వేటూరి, సంగీతం : మణిశర్మ
గానం : ఎస్.పి,బాలు, సుజాత
పల్లవి :
ఎప్పుడెప్పుడు వలపు చప్పుడు
మోజుపడ్డ కన్నె ఈడు
మోక్షమెప్పుడు
అప్పుడప్పుడు జరిగినప్పుడు
తొందరమ్మ పైట పందిరేసినప్పుడు
గుండె గుప్పెడు గుట్టు విప్పడు
గొంతు విప్పలేని గోలవుంది బోలెడు
పిల్ల వేలెడు సోకు సోలెడు
చీకటేళ కోరుతుంది చిలకకొట్టుడు॥
చరణం : 1
నడుమా చేతికి రాదు
నడిచి చెంతకు రాదు
గడిచేదెట్టా ఓ పొద్దు
అడిగే అల్లరివాడు
పడుచుపిల్లకే తోడు
మెడనే మీటేస్తాడు
న్యూజిలాండ్‌లో నూజివీడులా
లవ్స్రాల బారసాల
జరుగు జోరులో
బాలచంద్రుడు నేల ఇంద్రుడు
కసికొద్దీ రసమంతా కాజేస్తాడు॥
చరణం : 2
తడిసే ఒంటిని చూడు
ఇగిరే వన్నెలు చూడు
రగిలే ఈడుని చల్లార్చు
కనుల పాపల జోడి
కలిసే చూపుల వేడి
తెలిపే వలపుల నాడి
జీన్స్‌లాండ్‌లో జేమ్స్‌బాండ్‌లా
ట్యూన్స్ పాడి గిల్లుతాడు
బుల్లికృష్ణుడు
పడుచు గోపిక పంచదారిక
కొనతీపి తినిపించేదేనాడింక॥
Special Note:
‘నీడ’ సినిమాతో బాలనటుడిగా 1979లో వెండితెరకు పరిచయమయ్యాడు మహేష్‌బాబు. బాలనటుడిగా తొమ్మిది సినిమాలలో నటించాడు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రాజకుమారుడు’ చిత్రంతోకథానాయకుడిగా తెరంగేట్రం చేశాడు.