GhantasAla Special
బాటసారీ... ఒక్కసారీ...
ఆల్బమ్ : బహుదూరపు బాటసారీ
రచన, సంగీతం, గానం :ఘంటసాల
వచనం :
మృతి అంటే భయం లేనటువంటి
వ్యక్తి పాడుతున్న పాట
పల్లవి :
బహుదూరపు బాటసారీ...
ఇటు రావో ఒక్కసారీ...॥
చరణం : 1
అర్ధరాత్రి పయనమేలనోయి
పెనుతుఫాను రేగనున్నదోయి (2)
నా కుటీరమిదేనోయ్
విశ్రమింప రావోయి (2)
వేకువనే పోదమోయ్...॥
చరణం : 2
పయనమెచటికోయి ఈ పయనమె
చటికోయి నీ దేశమేనటోయి (2)
నా ఆశలు తీరెనోయి నీతో
కొనిపోవోయి (2)॥
Special Note:
ఈ పాట ఘంటసాలకు చాలా ఇష్టమైన పాట. ఆయన గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా అందరికీ సుపరిచితులు. కాని ఆయనలో కవితాత్మ ఉందని కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆయన పాడిన ప్రైవేటు గీతాల్ల్లో... బహుదూరపు బాటసారీ, మరువలేనె మరువలేనె నా వలపుల రాణి, మరణ సమయమిదియే ఓ సఖీ, ఎన్నినాళ్లు గడిచినాయో, మరుపురానిది తీయనైన బాధ, భూమి పొమ్మన్నది-ఆకాశం రమ్మన్నది’ అనే పాటలు ప్రజాదరణ పొందాయి. ఆయన మరణానంతరం అజరామరమైన కొన్నిపాటలు ‘బహుదూరపు బాటసారీ’ అనే ఆల్బమ్‌గా రిలీజైంది. ఆయన దాదాపు అరవైకి పైగా ప్రైవేటు గీతాలు పాడారు. సత్యసాయిబాబా అంటే ఘంటసాలకు ఎంతో ఇష్టం. అందుకే బాబాపై ఎన్నో గీతాలు రచించి, వాటికి రాగాలు సమకూర్చి బాబాకు పాడి వినిపించేవారు.