చిత్రం : పాండురంగ మహాత్మ్యం(pANDura~mga mahAtymam) (1957)
రచన : సముద్రాల జూనియర్
సంగీతం : టి.వి.రాజు, గానం : ఘంటసాల
పల్లవి :
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ (3)
హర హర హర శంభో శంభో... (2)
చరణం : 1
హిమగిరి శృంగ విహారీ
ఉమానాథ శివగంగాధారీ
చంద్రచూడ చర్మాంబరధారీ
ఈశగిరీశ పురారీ... శంభో...
హర హర హర శంభో
చరణం : 2
శివశివ అక్షయలింగా
మహాలింగ స్మరగర్వవిభంగా
భక్త శుభంకర కరుణాపాంగా
వృషభతురంగ శుభాంగా... శంభో...
హర హర హర శంభో...
శంభో... శంభో... శంభో....
Special Note:
ఘంటసాల ప్రొఫైల్
పూర్తిపేరు : ఘంటసాల వేంకటేశ్వరరావు
జననం : 04-12-1922
జన్మస్థలం : కృష్ణాజిల్లా, చౌటుపల్లి గ్రామం
తల్లిదండ్రులు : రత్తమ్మ, సూర్యనారాయణ
తోబుట్టువులు : ఆదినారాయణశాస్త్రి (అన్నయ్య), సదాశివుడు (తమ్ముడు), జయప్రద, వెంకట సుబ్బమ్మ, అన్నపూర్ణ (అక్కా చెల్లెళ్లు)
విద్యార్హత : 9వ తరగతి
సంగీత గురువు : పట్రాయని సీతారామశాస్త్రి
వివాహం : 03-03-1944
భార్య : సావిత్రి
పిల్లలు : ఐదుగురు (కీ.శే.విజయ్‌కుమార్, రత్నకుమార్, డా॥శ్యామలా రామకృష్ణ, సుగుణా మోహనరావు, శాంతిసురేంద్రకుమార్)
ఇష్టమైన ఆహారం : టిఫిన్స్‌లో పెసరట్టు ఉప్మా, కూరల్లో పప్పు, వంకాయ. రోటి పచ్చళ్లు ఎక్కువగా తినేవారు.
గాయకునిగా తొలిచిత్రం : స్వర్గసీమ (1945)
చివరి చిత్రం : యశోదకృష్ణ (అందుబాటులో ఉన్నంత వరకు)
తొలి సినిమా పాట-పారితోషకం :
‘లే యెన్నెల చిరునవ్వుల’ (స్వర్గసీమ-1945), 110 రూపాయలు
స్వతంత్ర సంగీత దర్శకునిగా తొలిచిత్రం : కీలుగుర్రం-1949 (మొదట రిలీజైంది)
లక్ష్మమ్మ-1950 (మొదట అంగీకరించింది)
ఆఖరి చిత్రం : సతీసావిత్రి (1978) ఇందులో రెండు పాటలను మాత్రమే స్వరపరిచారు. (ఘంటసాల గతించిన నాలుగేళ్లకు ఈ చిత్రం విడుదలయ్యింది).
సంగీత దర్శకునిగా మొత్తం చిత్రాలు : 110
నిర్మాతగా : 1. పరోపకారం (1953),
2. సొంతవూరు (1956),
3. భక్త రఘునాథ్ (1960)
నటించిన సినిమాలు : సీతారామ జననం (ఏయన్నార్ రెండవ సినిమా), త్యాగయ్య, యోగివేమన, శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం చిత్రాలలో చిన్నచిన్న పాత్రలు పోషించారు.
పురస్కాలు-గౌరవాలు : 1. పద్మశ్రీ (1970)
2. 1969-72 మధ్యకాలంలో టి.టి.డి. ఆస్థాన గాయకుడిగా పనిచేశారు.
3. 1971లో ఐక్యరాజ్యసమితిలో గానకచ్చేరీ చేసినందుకుగాను పీస్‌మెడల్ (శాంతిపతకం) అందుకున్నారు.
4. భారత ప్రభుత్వం 2003 ఫిబ్రవరి 11న తపాలా బిళ్ల విడుదల చేసింది.
మరణం : 11-02-1974
సంగీత కళాశాలలు : ‘పద్మశ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత కళాశాల’ విజయవాడలో ఉంది. ఇతర ప్రాంతాలలో కొన్ని ప్రైవేటు కళాశాలలు కూడా ఉన్నాయి.
విగ్రహాలు : ఆంధ్రప్రదేశ్‌లో 21. ఈ మధ్య విదేశాలలో కూడా ఆయన విగ్రహాలను ఏర్పాటుచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.