చిత్రం : గుడిగంటలు(guDiganTalu) (1964)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం, గానం : ఘంటసాల
ఘంటసాల స్పెషల్(ghanTasAla special)
పల్లవి :
ఎవరికి వారౌ స్వార్థంలో
హృదయాలరుదౌ లోకంలో॥
నాకై వచ్చిన నెచ్చెలివే
అమృతం తెచ్చిన జాబిలివే
నాకమృతం తెచ్చిన జాబిలివే
చరణం : 1
ధనము కోరి మనసిచ్చే
ధరణి... మనిషిని కోరి వచ్చావే
నా అనువారే లేరని
నేను కన్నీరొలికే కాలంలో
ఉన్నానని నా కన్నతల్లి వలె
ఒడిని జేర్చి నన్నోదార్చావే॥వచ్చిన॥
చరణం : 2
ప్రేమ కొరకు ప్రేమించే
వారే... కానరాక గాలించాను
గుండెను తెరచి ఉంచాను
గుడిలో దేవుని అడిగాను
గంటలు గణగణ మ్రోగాయి
నా కంటిపాప నువ్వన్నాయి॥వచ్చిన॥
చరణం : 3
ఈ అనురాగం ఈ ఆనందం
ఎవ్వరెరుగని ఈ అనుబంధం॥అనురాగం॥
ఊడలు పాకి నీడలు పరచి
ఉండాలి వెయ్యేళ్లు
చల్లగ ఉండాలి వెయ్యేళ్లు
తీయగ పండాలి మన కలలు॥
Special Note:
1942లో ‘క్విట్‌ఇండియా’ ఉద్యమంలో పాల్గొని 18 నెలలు జైలు శిక్ష అనుభవించారు ఘంటసాల. 1947 ఆగష్టు 15న ఆకాశవాణిలో ‘స్వతంత్రరథం’ అనే సంగీత రూపకాన్ని ప్రసారం చేశారు. అందులో చాలా పద్యాలు, పాటలు పాడారు. తోలేటి వెంకటరెడ్డిగారు రచించిన ‘స్వాతంత్య్రమే మా జన్మహక్కని చాటండి’ అనే పాట 1948 ఆగష్టులోనే విడుదలైంది. స్వతంత్రం పుట్టినరోజుకు ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పంతో వచ్చినదే ఈ రికార్డు. తర్వాత కొన్ని దేశభక్తి గీతాలు కూడా పాడారు. ఆయన దేశభక్తి మనందరికీ స్ఫూర్తి.