నీ చెలిమే ఓ.. చెలియా॥
చిత్రం : ఊసరవెల్లి(oosaravelli) (2011)
రచన : చంద్రబోస్
సంగీతం, గానం : దేవిశ్రీ ప్రసాద్
Photo:దేవిశ్రీ ప్రసాద్
పల్లవి :
హే... వదలనులే చెలీ చెలీ నిన్నే
మరణం ఎదురువచ్చినా
మరవనులే చెలి చెలి నిన్నే
మరుజన్మెత్తినా
బెదరనులే ఇలా ఇలా భూమే
నిలువున బద్దలైనా
చెదరదులే నాలో నువ్వే వేసే
ముద్దుల వంతెన
శరీరమంతా తిమిచీరే
ఫిరంగిలా అది మారే
కణాలలో మధురణాలలే
కదిపి కుదుపుతోంది చెలియా
బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే
చంపాలి... వెంటాడే చావునే॥
చరణం : 1
ఒక యుద్ధం ఒక ధ్వంసం
ఒక హింసం నాలో రేగెనే
ఒక మంత్రం ఒక మైకం
నాలో మోగెనే
ఒక జననం ఒక చలనం
ఒక జ్వలనం నాలో చేరెనే
ఒక స్నేహం ఒక దాహం
నాలో పొంగెనే
గతాల చీకటిని చీల్చే
శత ఘు్నలెన్నో అది పేల్చే
సమస్త శక్తినిచ్చే
నీ స్పర్శే ఓ.. చెలియా ॥
చరణం : 2
ఒక క్రోధం ఒక రౌద్రం
బీభత్సం నాలో పెరిగెనే
ఒక శాంతం సుఖ గీతం
లోలో కలిగెనే
ఒక యోధం ఒక యజ్ఞం
నిర్విఘ్నం నన్నే నడిపెనే
ఒక బంధం ఒక భాగ్యం
నాకై నిలిచెనే
భయాల గోడలను కూల్చే
కయ్యాల గొంతు వినిపించే
శుభాల సూచనిచ్చే