Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : స్వర్ణగౌరి(swarNagowri) (1962)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎం.వి.రాజు(M.V.rAju)
గానం : ఎస్.జానకి, ఎం.చిత్తరంజన్(S.jAnaki,S.chittara~njan)
08 December - ఎం.వి.రాజు జయంతి


పల్లవి :
జయమీవే జగదీశ్వరి
కావ్యగాన కళాసాగరి
జయమీవే జగదీశ్వరి

చరణం : 1
పదముల వెలసే
లయతాళాలు
నీ కథలే
మధుర గీతాలు
దరహాసాలే వరాల స్వరాలు
రాగము వేదము నీవెలే
జయమీవే జగదీశ్వరి

చరణం : 2
నీ చరణములే నమ్మినదాన
నీదాన దయార్థినిగాన
చిలుకగ రాదే నీ జడివాన
మాతా మంగళదేవివే
జయమీవే జగదీశ్వరి
గమగమ దనిదని రిగరిగ
మపమప దనిదని సమగప
మాగప మాగప మాగమ
జయమీవే జగదీశ్వరి...॥

దనిపమ గమదని
పమగమ రిగరిస నిసనిస
దనిదని గమగమ రిగరిస
నిసనిరి సరినిస రిరిరిగ గగమమ
మదపద మపగమ సాదప
మాగమ రీసా దపమా గమరీ
సాదప మాగమ రీ... జగదీశ్వరి

Special Note:
ఎం.వి.రాజు పూర్తిపేరు మందపాటి వెంకట్రాజు. నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్‌లో ఒక రైతు కుటుంబంలో 1919, డిసెంబర్ 8న జన్మించారు. ఏలూరులో కృష్ణమాచార్యులు అనే విద్వాంసుని దగ్గర సంగీతాన్ని అభ్యసించారు. సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్, జగ్గయ్యపేట, మెదక్, స్వస్థలంలో కూడా సంగీత కచేరీలు చేసేవారు. 1960లో వి.ఆర్ .స్వామి తీసిన ‘భక్తకనకదాస’ అనే కన్నడ సినిమాకు సంగీతం సమకూర్చారు. దానికి జాతీయ అవార్డు వచ్చింది. కన్నడ సినిమాతో జాతీయ పురస్కారాన్ని పొందిన తెలుగు సంగీత దర్శకుడిగా ఖ్యాతి గడించారు. మరికొన్ని కన్నడ సినిమాలకు, ఎన్నో లలితగీతాలకు బాణీలు కూర్చారు. తెలుగులో మొదటిసారిగా ‘స్వర్ణగౌరి’ చిత్రానికి పనిచేశారు. మరొక సినిమాకు సన్నాహాలు జరుగుతుండగా ఏప్రిల్ 17, 1963న ఆయన్ని మృత్యువు క్షయ రూపంలో కబళించింది.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |