చిత్రం : మల్లీశ్వరి(mallISwari) (2004)
రచన : సిరివెన్నెల, సంగీతం : కోటి
గానం : కుమార్‌సాను
Photo:కుమార్‌సాను
పల్లవి :
నీ నవ్వులే వెన్నెలనీ
మల్లెలనీ హరివిల్లులనీ
ఎవరేవేవో అంటే అననీ
ఏం చెప్పను ఏవీ చాలవనీ॥నవ్వులే॥
చరణం : 1
బంగారం వెలిసిపోదా
నీ సొగసుని చూసి
మందారం మురిసిపోదా
నీ సిగలో పూసి
వేవేల పువ్వులను పోగేసి
నిలువెత్తు పాలబొమ్మని చేసి
అణువణువు వెండివెన్నెల పూసి
విరితేనెతోనే ప్రాణం పోసి
ఆ బ్రహ్మ నిన్ను మళ్లీ మళ్లీ చూసి
తన్ను తానే మెచ్చుకోడా ముచ్చటేసి
నీ నవ్వులే... ॥
చరణం : 2
పగలంతా వెంటపడినా
చూడవు నావైపు
రాత్రంతా కొంటె కలవై
వదలవు కాస్సేపు
ప్రతిచోట నువ్వే
ఎదురొస్తావు
ఎటు వెళ్లలేని వల వేస్తావు
చిరునవ్వుతోనే ఉరివేస్తావు
నన్నెందుకింత ఊరిస్తావు
ఒప్పుకోవేం నువ్వు చేసిందంతా చేసి
తప్పు నాదంటావా నానా నిందలేసి॥నవ్వులే॥
Special Notes:
కుమార్‌సాను 1957 సెప్టెంబర్ 23న కలకత్తాలో జన్మించారు. తండ్రి భట్టాచార్యకు పాడటంలోను, సంగీతం అందించడంలోను ప్రావీణ్యం ఉంది. కుమార్‌సాను తండ్రి దగ్గరే తబలా నేర్చుకున్నారు. కామర్స్‌లో డిగ్రీ చేసిన తర్వాత 1979లో కలకత్తా చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక కార్యక్రమాలలో పాటలు పాడేవారు. కుమార్‌సాను పాడే విధానాన్ని చూసి అచ్చం కిషోర్‌కుమార్‌లా పాడుతున్నాడని ప్రశంసించారు. గాయకుడు, సంగీత దర్శకుడు అయిన జగత్‌సింగ్ 1987లో ‘ఆంధియా’ లో పాడే అవకాశం ఇవ్వడంతో ముంబయికి మకాం మార్చారు. అయితే 1989లో వచ్చిన ‘జాదూగర్’ అనే చిత్రమే మొదటిదని చెప్పాలి. ఆయన పాడిన చాలా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. తెలుగులో పాడిన కొద్దిపాటలూ ప్రేక్షకాదరణ పొందాయి. 1990 నుంచి 1994 వరకు వరుసగా ఐదు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మరెన్నో ఇతర అవార్డులు వరించాయి. 2009లో భారతప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది.
Labels: hindi movies, lyrics, songs, telugu