చిత్రం : లక్షాధికారి(lakshAdhikAri) (1963)
రచన : కొసరాజు
సంగీతం : టి.చలపతిరావు
గానం : మాధవపెద్ది సత్యం
18 December - నేడు మాధవపెద్ది సత్యం వర్ధంతి
పల్లవి :ఓహో అందమైన చిన్నదాన
బంగారు వన్నెదాన
ఓహో నీలిరంగు చీరదాన
భలే నెరజాణ
నా మీద కోపమా...
ఇటు చూడు ఒక్కసారి
హరిలో రంగ హరి
హల్లో మై డార్లింగ్ ఐ లవ్ యూ...
చరణం : 1
కులాసా నవ్వుల చిలకగదే
నీ రుసలు బుసలు ఇక మానగదే॥
తుపానుగా లేచి తమాషాగా చూచి
నా మనసును దోచి వేశావులే పేచీ
నా మీద కోపమా...॥చూడు॥
చరణం : 2
వయ్యారము నీలో ఉన్నదిలే
గయ్యాళి పోజులో ఎందుకులే॥
నీ పోకిరి కళ్లు ఆ కళ్లల్లో థ్రిల్లు
ఎవ్వానికి దక్కు అవ్వానిదే లక్కు
కాదేమో చెప్పుమా...॥చూడు॥
చరణం : 3
తరింతును లేవే నిను వలచి
సుఖింతు హాయిగా నినుదలచి॥
నిన్నే కలగంట నువ్వే నా జంట
నీవెంట పడి వస్తా కాదంటే పడి చస్తా
ఇంకేల కోపము...॥చూడు॥
Special Note:
మాధవపెద్ది సత్యం బాపట్ల దగ్గర బ్రాహ్మణ కోడూరు గ్రామంలో 1922లో జన్మించారు. లైలామజ్ను (1949)లో ‘మనుచుగాతా ఖుదా తోడై నిలుచుగాతా’ అనే పాటను ఘంటసాల, సుసర్ల దక్షిణామూర్తితో కలిసి పాడారు. తెలుగులో ఇదే సత్యం గారి మొదటిపాట. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ, సింహళ భాషలలో ఎన్నో పాటలను పాడి అందరినీ అలరించారు.