Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : శక్తి(Sakti) (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : మణిశర్మ
గానం : జావెద్ అలీ, సుచిత్ర


పల్లవి :
సుర్రోసుర్రన్నాదే
సుర్రన్నా యమగున్నాదో
సూదంటూ కళ్లోడే సూపుల్తో గిల్ల్లాడే
సూమంతర పిల్లోడే
యాయి యాయి
యాయియే
సుర సుర సుర సూరీడే
సుక్కల్ సూపించాడే
యాయి యాయి యాయియే
రామా సక్కని రసగుల్లా
ఎంతపనైందే నీవల్ల
యాడో కస్సున దిగినవె తీపి ముల్లా
ఏం తిని పెరిగావే పిల్ల
నిన్నే సూత్తా నిలువెల్లా
ఇల విల్లాడానే ఎల్లా కిల్లా
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే (6)
మసజసతతగ మదనుడి జతగ (2)
నజభజజజర నిదరలు చెదర (2)
చరణం : 1
కట్టు బొట్టు తాకట్టు అసలు వడ్డీ
మొత్తం రాబట్టు బోణీ కొట్టు
ఒత్తు పొల్లు తలకట్టు సదివేత్తా
నీ సరదా తీరేట్టు ఫటాఫట్టు
బంగారం పొంగుల్లో అంగారం
పుట్టించు మైకాలు మరిగేట్టూ
బుల్‌బుల్ బుగ్గల బొబ్బట్టు
మస్తుగ ఉందే రసపట్టు
గుండెకు ఎట్టావే నీ పంటిగాటు
వయసే మడతడిపోయేట్టూ
వావి వరసలు కలిసేట్టూ
వోణీ గురుతుకు ఏసేస్తా ఓటు
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే (6)
చరణం : 2
రెక్కల గుర్రం ఎక్కించి ఎక్కడికో
నన్నెత్తుకుపొమ్మన్నా ఎటేపైనా
నీతో కళ్లెం పట్టించి పక్కను కూసుని
సెయ్యేస్కోలేనా నడుం పైన
యమ్మో యమదొంగోడా... ఏదో
చేసెయ్ తేడా మోమాట పడకుండా
సర్లే పిటపిట పింగాణీ
భలే భలే అట్టాగేకాని
గల్‌గల్ గల్లనిపిస్తా గాజుల్ని
అసలే కంతిరి కుర్రోణ్ని
నిండా తిమ్మిరి ఉన్నోణ్ని
కాదంటానా నీ మోజుల్ని
గుచ్చాంగ్ గుచ్చాంగ్ గుచ్చాంగే (6)

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |