చిత్రం : మాంగల్య బలం(mA~ngalyabalam) (1959)
రచన : శ్రీశ్రీ(SrISrI)
సంగీతం : వూస్టర్ వేణు(Master Venu)
గానం : ఘంటసాల(GhanTasAla), పి.సుశీల(P.suseela)
26 December - నేడు సావిత్రి వర్ధంతి
పల్లవి : పెనుచీకటాయె లోకం
చెలరేగే నాలో శోకం
విషమాయె మా ప్రేమ
విధియే పగాయె॥
చరణం : 1
చిననాటి పరిణయ గాథ
ఎదిరించలేనైతినే (2)
ఈనాటి ప్రేమగాథ
తలదాల్చలేనైతినే
కలలే నశించిపోయే
మన సే కృశించిపోయే
విషమాయె మా ప్రేమ
విధియే పగాయె
చరణం : 2
మొగమైన చూపలేదే
మనసింతలో మారెనా (2)
నా ప్రాణ సతివని తెలిపే
అవకాశమే పోయెనా
తొలినాటి కలతల వలన
హృదయాలు బలి కావలెనా
విషమాయె మా ప్రేమ
విధియే పగాయె॥చీకటాయె॥
mA~ngalyabalam - Penu cheekataye - ANR, Savitri - Ghantasala, Suseela
Special Note:
సావిత్రికి మొదటిసారిగా ‘సంసారం’ (1950) చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. కానీ దర్శకుడు ఎల్.వి.ప్రసాద్ సావిత్రిని చూసి లాభం లేదనుకున్నారు. ఛాన్స్ మరొకరికి ఇచ్చి, ఆమెను ఫ్రెండ్స్ గుంపులో నిలబడమన్నారు. అదే ఆమె తొలిచిత్రం. 1951లో ‘పాతాళభైరవి’ లో చిన్న నర్తకి వేషం వేశారు. 1952లో ‘పెళ్లిచేసిచూడు’లో కాస్త గుర్తింపు ఉండే వేషం వేశారు.
ఆ సినిమాలో హీరోయిన్ జి.వరలక్ష్మి. అయితే 1953లో వచ్చిన ‘దేవదాసు’ చిత్రంతో సావిత్రి జాతకం మారిపోయింది. అప్పటి నుండి సావిత్రి నటించిన చిత్రాలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి.