చిత్రం : మేరీమాత(mErImAta) (1971)
రచన : రాజశ్రీ
సంగీతం : జి.దేవరాజన్
గానం : పి.సుశీల
పల్లవి : కరుణామయివే మేరీమాత
కన్నులు తెరవాలి
కనులు తెరిచి పేదవాని కాళ్లు ఇవ్వాలి॥
చరణం : 1
కన్నెమాత దేవసభలో
తలుపు తెరిపించు (2)
కలత మాపి మనసు విరియ
వెలుగు ప్రసరించు
వెలుగు ప్రసరించు...॥
చరణం : 2
కోటి జనుల
వెతలు తీర్చ వరలు ఓ తల్లీ (2)
కన్నబిడ్డను నీకు విడిచి ఒంటినే తల్లీ
జగతి సాగెను నీ వలెనే...
తరులు పెరిగెను నీ వలెనే...
పూలు పూచెను నీ వలెనే...
కనికరించవే నా తల్లీ... నా తల్లీ...॥ దేవరాజన్ పూర్తిపేరు పరవూర్ గోవిందన్ దేవరాజన్. కేరళ రాష్ర్టం కొల్లాం జిల్లాలోని పరవూర్ గ్రామంలో 1925లో జన్మించారు. మళయాళంలో 300, తమిళంలో 20, కన్నడంలో 4 సినిమాలకు సంగీతాన్ని అందించారు. మొట్టమొదటి సంగీత దర్శకత్వం వహించిన సినిమా ‘కాలం మారున్న’ (1955) అనే మళయాళ చిత్రం. 1959లో వచ్చిన ‘చతురంగం’ చిత్రంతో దేవరాజన్‌కు, గేయ రచయిత వాయిలార్ రామవర్మతో సాన్నిహిత్యం ఏర్పడింది. తెలుగులో ఆత్రేయ-కె.వి.మహదేవన్ జంటలాగ వీరి జంట మళయాళంలో బాగా పాపులర్ అయింది. కె.జె.ఏసుదాస్, జయచంద్రన్ వంటి వారు దేవరాజన్ తమ గురువుగా చెప్పుకుంటారు. హార్మోనియం ఆయనకు ఆరోప్రాణం. ఈయనను కేరళ ప్రభుత్వం ఐదుసార్లు అవార్డులతో సత్కరించి గౌరవించింది. 2006 మార్చి 14న దేవరాజన్ కన్నుమూశారు.