Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : డాక్టర్‌బాబు(DoctorbAbu) (1973)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : టి.చలపతిరావు
22 December - నేడు టి.చలపతిరావు జయంతి

గానం : పి.సుశీల

పల్లవి :
విరిసే కన్నులలో
వేయి బాసలున్నవిలే
అవి నా గుండెలలో
అల్లరి చేస్తున్నవిలే॥
చరణం : 1
నీ కనుపాపలే
వినీల కాంతి దీపాలు
నీ చిరునవ్వులే
వెన్నెలల పారిజాతాలు
నీ సొగసే నాదైతే... (2)
కళకళలాడులే వసంతాలు॥
చరణం : 2
ఎదురుగ నువ్వుంటే
ఉదయకాంతులెందుకులే
జతగా నువ్వుంటే
జాబిలి ఇంకెందుకులే
నీ వలపే నాదైతే... (2)
ఏ బృందావనాలు ఎందుకులే॥
గానం : ఘంటసాల
పల్లవి :
విరిసే కన్నులలో
వేయి బాసలున్నవిలే
అవి నా గుండెలలో
మూగవోయి
ఉన్నవిలే ॥
చరణం : 1
ఎదురుగ నువు లేవు...
ఏ అందాలిక లేవు...
జతగా నువురావు
జాబిలి కళలే లేవు
నీ మనసే నాదైనా...
నీ మనసే నాదైనా...
ఇరువురి దారులింక వేరేలే॥
చరణం : 2
నీవు లేని నా మనసే
దేవుడు లేని కోవెల
నీవు లేని నా వలపే
నిట్టూర్పుల వెన్నెల
నీ తోడే లేకుంటే... (2)
నా బ్రతుకే కన్నీటి కథయేలే॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |