Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : యమగోల(YamagOla) (1977)
రచన : వేటూరి
సంగీతం : చక్రవర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
ఓలమ్మీ తిక్కరేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా (2)
తిక్కరేగి తిమ్మిరెక్కి
పైరగాలి పైటతీసి
పందిరేసి చిందులేసిందా
ఓరబ్బీ తిక్కరేగిందా
ఒళ్లంతా తిమ్మిరెక్కిందా (2)
తిక్కరేగి తిమ్మిరెక్కి
పిల్లగాలి చిచ్చురేపి
రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా॥
చరణం : 1
కాలు కురచ కన్నెపిల్ల
కన్ను చెదిరిందా
మూర తక్కువ చీర నీకు
నిలవనంటుందా
బక్కపలచ ఉడుకు నీలో
బలిసిపోయిందా
ముట్టుకుంటే ముద్దులయ్యే
పట్టుకుంటే జారిపోయే
సిగ్గువలపు మొగ్గలేసిందా॥
చరణం : 2
రంగుతేలి గిత్తపొగరు రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు దువ్విందా
కోడెవయసు రొమ్ము విరిచి
కొమ్ము విసిరిందా
పట్టపగలే చుక్కపొడిచి
పంటచేను గట్టుమీద
బంతిపూల పక్కవేసిందా ॥
చరణం : 3
పక్కకొస్తే పడుచునెందుకు
అలుసు చేస్తావు
చల్లకొచ్చి ముంత ఎందుకు
దాచుకుంటావు
వలపులోన కలుపుతీస్తే
పదును చూస్తావు
ఆరుబయట అందమంతా
ఆరబోసి కస్సుమంటా
కన్నెమోజు కట్టుతప్పిందా ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |