చిత్రం : నువ్వులేక నేనులేను (2002)
(nuvvulEka nEnulEnu)
రచన : కులశేఖర్(kulaSEkhar)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్ (R.P. PatnAyak)
గానం : ఆర్.పి.పట్నాయక్(R.P. PatnAyak), కౌసల్య(kausalya)
08 January - నేడు తరుణ్ బర్త్‌డే
పల్లవి :
నిండు గోదారి కదా ఈ ప్రేమ
అందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా
మంచిని పంచే ప్రేమ॥
చరణం : 1
ప్రేమ అన్నదీ ఎంత గొప్పదో మరీ
రాజు పేద బేధమంటు లేదు దీనికి
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ
ప్రేమదీపమల్లే చూపుతుంది దారినీ
మనసులు జత కలిపే
బంధం ఈ ప్రేమ
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ
ప్రేమే మదిలోన మరి
నమ్మకాన్ని పెంచుతుంది॥
చరణం : 2
ప్రేమ జోరునీ ఎవ్వరాపలేరనీ
ఆనక ట్టలాంటి హద్దులంటూ లేవని
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమనీ
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పనీ
ప్రేమే తోడుంటే
నిత్యం మధుమాసం
తానే లేకుంటే బతుకే వనవాసం
ప్రేమే కలకాలం మనవెంట
ఉండి నడుపుతుంది ॥
Special Note:
తరుణ్ 1983 జనవరి 8న జన్మించారు. అమ్మ నటి రోజారమణి, తెలుగువారైన నాన్న చక్రపాణి ఒరియాలో నటుడు, నిర్మాత. చెల్లి అమూల్య. 1990లో వచ్చిన ‘మనసు మమత’ చిత్రంతో బాలనటుడిగా తెరంగేట్రం చేసిన తరుణ్ అదే ఏడాది చివరిలో మణిరత్నం తమిళ, తెలుగు భాషలలో తీసిన ‘అంజలి’ సినిమాలో నటించాడు. ఈ సినిమాకి తమిళంలో ఉత్తమ బాలనటుడిగా తరుణ్‌కు జాతీయ అవార్డు వచ్చింది. తర్వాత కొన్ని సినిమాలలో నటించినా, 2000 సంవత్సరంలో వచ్చిన ‘నువ్వేకావాలి’ సినిమాతో హీరోగా సక్సెస్ సాధించారు.