చిత్రం : పెళ్లినాటి ప్రమాణాలు(peLLinATi pramANAlu) (1958)
రచన : పింగళి నాగేంద్రరావు (pi~mgali nAgEndrarAo)
సంగీతం : ఘంటసాల (ghanTasAla)
గానం : ఘంటసాల (ghanTasAla), పి.లీల (P.Leela)
పల్లవి :
వెన్నెలలోనే వేడి ఏలనో
వేడిమిలోనే చల్లనేలనో
ఈ మాయ ఏమో జాబిలీ (2)
వెన్నెలలోనే విరహమేలనో
విరహములోనే హాయి ఏలనో
ఏమాయ ఏమో జాబిలీ
ఈ మాయ ఏమో జాబిలీ
చరణం : 1
మొన్నటికన్న నిన్న వింతగా
నిన్నటికన్న నేడు వింతగా
ఓహోహో ఓఓఓ...॥
నీ సొగసూ నీ వగలూ
హాయి హాయిగా వెలసేనే॥
చరణం : 2
రూపముకన్న చూపు చల్లగా
చూపులకన్న చెలిమి కొల్లగా
ఓహోహో ఓఓఓ...॥
నీ కళలూ నీ హొయలూ
చల్లచల్లగా విరిసెనే
వెన్నెలలోనే హాయి ఏలనో
వెన్నెలలోనే విరహమేలనో
ఈ మాయ ఏమో జాబిలీ
ఈ మాయె ఏమో జాబిలీ... ఆ...
Special Note:
జయంతి పిక్చర్ పతాకంపై 1958లో కె.వి.రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించిన సాంఘిక చిత్రం ‘పెళ్లినాటి ప్రమాణాలు’. ఇది కె.వి.రెడ్డి దర్శకత్వంలో జమున నటించిన రెండవ సినిమా (మొదటి సినిమా దొంగరాముడు-1955). ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు సమకూర్చినవారు పింగళి నాగేంద్రరావు. సంగీతం ఘంటసాల. వీరి కలయికలో వచ్చిన పాటలన్నీ ఎంతో ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రంలోని పాటల ద్వారా అది మరొకసారి రుజువయ్యింది. ఈ సినిమా అఖండ విజయాన్ని సాధించి, నేషనల్ అవార్డును దక్కించుకుంది.