Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : సింధుభైరవి(sindhubhairavi) (1985)
రచన : రాజశ్రీ(rAjasri)
సంగీతం : ఇళయరాజా(iLayarAjA)
గానం : కె.జె.ఏసుదాస్(K .J. EsudAs)
10 January - నేడు కె.జె.ఏసుదాస్ బర్త్‌డే
( K .J. EsudAs Birth day )



పల్లవి :
రసమంజరీ...
సొగసైన కలికి సుఖకేళి పడతి
స్వరమధువు ప్రియ వధువు
కులుకుల కొలికి వలపుల చిలికి
అడుగిడె అభినవ రసమంజరి॥
చరణం : 1
స్వరమంగళ లలనా ఎద వీడగలనా
పరువాల స్మరణ
మరుజన్మం కరుణ
అను మెరుగుల దయచూడక
మనగలనా జ్వలనా
చెలి తపఃఫలం స్వయం సిద్ధం
చేకొన విడివడెనా
ముఖం దాచవలెనా... ఆ....
ముఖం దాచవలెనా
మృదుమధుర వదనా
నీ మోమందు పూర్ణేందు
ప్రభల్ కనగ
నా ఎడద సుఖానపడు॥
చరణం : 2
రూపం కనుటకు తొందర తొలగెను
తొలుత తోచ పరిపాటి
గంగను తలనిడి పార్వతి సతియని
శివుని వీడు ఒక జాతి
రామయదొక విధి కృష్ణయదొక విధి
భువిని చూడ సమనీతి
అచ్చట కలిమికి ఇచ్చట చెలిమికి
ఎవరు ఎవరు సరిజోడి
కన్నీర్పెరిగినచో... ఆ... ఆ...
కన్నీర్పెరిగిన కన్నుల సుముఖం
చక్కగ కనబడు ద్విరూపం
చినుకా తొలకరి చినుకా
చిలకా చిక్కని చిలకా
జలజల వలవల వలచిన చెలుడిటు
నిలువున విలపిలె
బ్రతుకున అడుగిడు చెలువా
Download Link:
Rasa Manjari_sindhu bhairavi.mp3

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |