చిత్రం : పెళ్లినాటి ప్రమాణాలు (peLlinATi pramANAlu) (1958)
రచన : పింగళి నాగేంద్రరావు (pi~mgaLi nAgendrarAo)
సంగీతం, గానం : ఘంటసాల (ghanTasAla)
challaga chooDAli - చల్లగ చూడాలి
సాకీ :
కావనగానే సరియా
ఈ పూవులు నీవేగా దేవీ
పల్లవి :
చల్లగ చూడాలి
పూలను అందుకు పోవాలి దేవీ
చల్లగ చూడాలి
పూలను అందుకు పోవాలి
అనుపల్లవి :
మల్లె సుగంధం మనసున జల్లి
మళ్లీ అల్లరి తగునా॥
చరణం : 1
మలయానిలముల లాలన వలెనే
వలపులు హాయిగ కురిసి...॥
కలికి చూపులను చెలిమిని విడిచి
చిలిపిగ దాగుట న్యాయమా॥
చరణం : 2
తెలిమబ్బులలో జాబిలి వలెనే
కళకళలాడుచు నిలిచి...॥
జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి
పలుకకపోవుట న్యాయమా॥
Listen :
Special Note:
ఘంటసాల తండ్రి సూరయ్యగారు మృదంగం వాయించేవారు. ఆయనకు సంగీతమంటే ప్రాణం. ఆయన ఘంటసాలను తనతోపాటు ఎక్కడకు తీసుకువెడుతున్నా, దారిపొడవునా ఎన్నో కబుర్లు చెప్పేవారు. ‘‘నాయనా! సంగీతకళ చాలామహత్తరమైంది. ఆ కళలో తరించే అవకాశం రావడం మన అదృష్టం. నువ్వు బాగా సంగీతం నేర్చుకుని పైకి రావాలి’’ అని తరచు చెప్పేవారు సూరయ్య. ఆయన వాక్కు నిజమయ్యింది. ఎన్నటికీ ఎవ్వరూ మరువలేని గొప్ప గాయకుడు అయ్యారు ఘంటసాల. అంతా తండ్రిగారి ఆశీర్వాదం.