entaTi rasikuDavO - ఎంతటి రసికుడవో
చిత్రం : ముత్యాలముగ్గు(mutyAla muggu) (1975)రచన : డా॥సి.నారాయణరెడ్డి(Dr.C.nArAyaNareddy)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : పి.సుశీల(P.suseela)
28 February - నేడు ముక్కామల జయంతి
పల్లవి : ఎంతటి రసికుడవో తెలిసెరా
నీవెంతటి రసికుడవో తెలిసెరా
నీ వింతలు ఇంతలు ఇంతలై
కవ్వింతలై మరులొలికెరా॥ఎంతటి॥
చరణం : 1 గుత్తపు రవిక ఓయమ్మో
చెమట చిత్తడిలో తడిసి ఉండగా॥ఎంతటి॥
ఎంతసేపు... నీ తుంటరి చూపు...
ఎంతసేపు నీ తుంటరి చూపు (2)
అంతలోనే తిరుగాడుచుండగా ॥ఎంతటి॥
చరణం : 2 మోము మోమున ఆనించి
ఏవో ముద్దుముచ్చటలాడబోవగా॥మోము॥
గ్రక్కున కౌగిట చిక్కబట్టి (2)
నా చెక్కిలి మునిపంట నొక్కుచుండగా॥ఎంతటి॥
Special Note:
పూర్తిపేరు : ముక్కామల కృష్ణమూర్తి, జననం : 28-02-1919, జన్మస్థలం : గుంటూరు జిల్లా, గురజాల ప్రాంతం, తల్లిదండ్రులు : సుబ్బారావు (డాక్టర్), సీతారావమ్మ, చదువు : ఎఫ్.ఎల్., భార్య : భారతి, సంతానం : సీతారాజ్యలక్ష్మి, పద్మావతి, శేషమ్మ, హీరోగా : నిర్దోషి (1951), పరోపకారం (1952), మరదలు పెళ్లి (1952), దర్శకత్వం : మరదలు పెళ్లి (1952) , ఇతర విషయాలు : చిన్నప్పటి నుంచే సినిమాలు, సాహిత్యం మీద పట్టు సంపాదించారు. ఎన్‌టీఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం, కె.వి.ఎస్,శర్మ మొదలైన వారందరినీ సభ్యులుగా చేర్చుకొని సొంతంగా ‘నవజ్యోతి సమితి’ అనే నాటక సంస్థను స్థాపించి, అనేక నాటకాలలో నటించారు.
ఠాగూర్ రాసిన ‘శాక్రిఫైస్’, రాయప్రోలు రాసిన ‘కొండవీటి పతనం’ నాటకాలలో నటించారు. ఎన్‌టీఆర్‌కి పేరు సంపాదించి పెట్టిన నాటకం ‘వేనరాజు’ ముక్కామల దర్శకత్వంలో వచ్చినదే. 1940లో ‘మీరాబాయి’ చిత్రానికి డెరైక్షన్ డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్‌గా చేరారు. అది చేస్తుండగా తల్లి హఠాన్మరణంతో స్వగ్రామానికి పయనమయ్యారు. పోలీసుశాఖలో ఉద్యోగం కోసం తండ్రి బలవంతంగా దరఖాస్తును పెట్టించారు. అందులో ముక్కామల ఎంపికయ్యారు. కానీ ముక్కామలలో ఏదో నిరాశ. వచ్చిన ఉద్యోగాన్ని వదులుకున్నారు. మద్రాస్‌లో లా కాలేజీలో చేరారు. సినిమా పుస్తకాలు చదవడం, కథలు రాయడం అలవాటు చేసుకున్నారు.
1945లో పి.పుల్లయ్య దర్శకత్వంలో ‘మాయామచ్ఛీంద్ర’ అనే సినిమాకు 150 రూపాయల జీతానికి ముక్కామలను అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. ఆ సినిమాలో గోరఖ్‌నాథ్ పాత్రకు నటించవలసిన శ్రీరామమూర్తి రాకపోవడంతో ఆ పాత్ర ముక్కామలకు వచ్చింది. మొదటిరోజే డైలాగ్స్‌తో అందరినీ ఆశ్యర్యపరచారు ముక్కామల. ‘ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది’ అని పుల్లయ్య, సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు ఆశీర్వదించారు. భానుమతి దంపతులు నిర్మించిన ‘లైలామజ్ను’ (1949)లో లైలా తండ్రి వేషంతో ముక్కామల తిరుగులేని నటునిగా పేరు సంపాదించుకున్నారు. దాదాపు 225 సినిమాల్లో నటించిన ముక్కామల, ‘జస్టిస్ చౌదరి’ సినిమా షూటింగ్‌లో ఉండగా (13-01-1982) ఆకస్మాత్తుగా మరణించారు.