చిత్రం : స్నేహితుడు(snEhituDu) (2012)
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి(sirivennela seetArAmaSAstri)
సంగీతం : హారిస్ జయరాజ్(hAris jayarAj)
గానం : రామకృష్ణన్ మూర్తి(rAmakrishnan mUrthy)
పల్లవి : నీ ఊపిరి నీ సొంతమా...
మాకు చెప్పకుండా వదలకు... ఆ...
నీ జీవితం నీ ఇష్టమా...
మాకు వాటా ఉంది మరవకురా...
గాలికో వానకో కూలిపోనియ్యక
కాపలా కాయగా మేము ఉన్నాముగా
ఆ దేవుడే అడిగినా
నిన్ను పంపం ఒంటిగా
నువు ఎంత పరిగెత్తినా
మేం వస్తాం వదలక
చరణం : 1
ప్రాణాలైనా పందెం వేస్తాం
కాలం పంతంనట్టి నిను వేధిస్తుంటే
ఎన్నాళ్లైనా యుద్ధం చేస్తాం
నిత్యం నువ్వే గెలుపు సాధిస్తానంటే
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ.....
చరణం : 2 కడుపులో తన్నావని
నవ్వింది ఈ తల్లిరా
కట్టెలా ఉన్నావని తల్లడిల్లే చూడరా
కదలిరా మిత్రమా అందుకో ఆశలా
బ్రతకరా ప్రతిక్షణం
తోడు ఉన్నామురా
Special Note:
హారిస్ జయరాజ్ జనవరి 8, 1975న చెన్నైలో జన్మించాడు. తండ్రి ఎస్.ఎమ్.జయకుమార్... మళయాళంలో ప్రముఖ సంగీత దర్శకులు శ్యామ్ దగ్గర చాలా సినిమాలకు గిటారిస్ట్‌గా పనిచేశారు. హారిస్ జయరాజ్‌ను మంచి గాయకుడిగా చేద్దామనుకున్నారు తండ్రి. కానీ హారిస్ తన 6వ ఏట నుండే సంగీతం పట్ల అభిరుచి పెంచుకొన్నాడు. కర్ణాటక సంగీతాన్ని అభ్యసించాడు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘మిన్నలే (2001)’ తమిళ చిత్రంతో సంగీత దర్శకునిగా పరిచయమయ్యాడు. మొదటి చిత్రానికే ఉత్తమ సంగీత దర్శకునిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. అదే సినిమా తెలుగులో ‘చెలి’ గా విడుదలయ్యింది. ఆ తర్వాత వాసు, ఘర్షణ, అపరిచితుడు, గజిని, సైనికుడు, మున్నా, ఆరెంజ్, రంగం, స్నేహితుడు... వంటి సినిమాలకు ఎన్నో సూపర్ హిట్‌సాంగ్స్ అందించాడు.