Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : సంపూర్ణ రామాయణం(sampUrNa rAmAyaNam) (1972)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి(dEvualplalli krishnaSAstri)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadEvan)
గానం : పి.సుశీల(P.suseela)
24 February - నేడు దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి


ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది
ఓరగా నెమలి పింఛ మారవేసుకుంటుంది
ఎందుకో... ఎందుకో ప్రతిపులుగు
ఏదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు
కనులు విప్పి చూస్తుంది
ఉండుండీ నా ఒళ్లు ఊగి ఊగి పోతుంది
అదుగో రామయ్యే
ఆ అడుగులు నా తండ్రివే
ఇదిగో శబరీ శబరీ వస్తున్నానంటున్నవి
కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని
నా కోసమె నా కోసమె నడచి నడచి నడచీ
నా కన్నా నిరుపేద
నా మహరాజు పాపం అదుగో
అసలే ఆనదు చూపు ఆపై ఈ కన్నీరు
తీరా దయచేసిన
నీ రూపు తోచదయ్యయ్యో
ఎలాగో నా రామా! ఏదీ? ఏదీ? ఏదీ?
నీల మేఘమోహనము నీ మంగళరూపము
కొలను నడిగీ తేటనీరు
కొమ్మనడిగీ పూలచేరు
చెట్టునడిగి పట్టునడిగీ
పట్టుకొచ్చిన ఫలాలు పుట్టతేనె రసాలు
దోరవేవో కాయలేవో
ఆరముగ్గిన వేవోగాని
ముందుగా రవ్వంత చూసి
విందుగా అందియ్యనా... (2)


Special Notes:
పూర్తిపేరు : దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
జననం : 01-11-1897
జన్మస్థలం : తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం
తల్లిదండ్రులు : సీతమ్మ, దేవులపల్లి కృష్ణశాస్త్రి (తమ్మన్న శాస్త్రి)
చదువు : బి.ఏ.
తోబుట్టువులు : ఇద్దరు అక్కలు (వెంకటరమణమ్మ, వెంకట రత్నమ్మ)
వివాహం-భార్య : 1918లో సుబ్బలక్ష్మి, 1923లో రాజహంస
సంతానం : అబ్బాయి - సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి : 11-09-1931)),అమ్మాయి - (సీత : 31-08-1937)
తొలిచిత్రం-పాట : మల్లీశ్వరి (1951) - ఊయలా జంపాలా... రావిచెట్టు మీద...
ఆఖరిచిత్రం : సృష్టి రహస్యాలు (1980)(కృష్ణపక్షంలోని తొలిగీతం ఆకులో ఆకునై..., జయ జయ జయ ప్రియభారత జనయిత్రీ... పాటలను కృష్ణశాస్త్రి ఎప్పుడో రాసుకోగా, తర్వాత వాటినే సినిమాలో ఉపయోగించారు)
పాటలు : 200కు పైగా (కృష్ణశాస్త్రిగారి మీద వచ్చిన పుస్తకాల ఆధారంగా)
గౌరవ పురస్కారాలు : 1975లో ఆంధ్రవిశ్వవిద్యాలయం వారిచే కళాప్రపూర్ణ, 1976లో పద్మభూషణ్, 1978లో సాహిత్య అకాడమీ అవార్డులు అందుకున్నారు.
ఇతర విషయాలు : 1920లో కృష్ణపక్షం ్జమొదలుపెట్టారు. 1925లో మొదటి ముద్రణ వేశారు. భావ కవిత్వాన్ని 1921 నుండి 46 వరకు (ఆయనివి, తన తోటి కవులవి) దేశమంతటా తిరిగి ప్రచారం చేశారు. మద్రాస్ కేంద్రంగా 1939-57 మధ్య కాలంలో రేడియోలో అనేక ప్రసంగాలు, సంగీత రూపకాలు రాశారు. అనారోగ్య కారణంగా 1964లో వారి స్వరపేటికను తొలగించారు. ఆ తర్వాత కూడా ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు.
మరణం : 24-02-1980

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |