kAvAli kAvAli nEnE - కావాలి కావాలి నేనే
చిత్రం : మొగుడు(moguDu) (2011)రచన : సిరివెన్నెల (sirivennela)
సంగీతం : బి.బాబు శంకర్(B.bAbu sa~mkar)
గానం : మధుమిత, బాబు శంకర్(madhumita,bAbu sa~mkar)
పల్లవి :
నీ లోకం కావాలి
ఇవ్వాలి ఇవ్వాలి
నాకే నీ సర్వం ఇవ్వాలి
మగవాడివి ఐతే చాలదు
మొగుడువి కూడా కావాలి
మొగలిపువ్వులా వెన్ను నిమురుతూ
మగువకి హామీ ఇవ్వాలి
ఇచ్చేందుకు ఏమీ మిగలని
నిరుపేదవి అయిపోవాలి
వచ్చే జన్మకి కూడా నువ్వే కావాలి॥
పపపపా మమా మగరి మగరిరిగ
మమమమా మగరిసా ససరి సనిసా
ససరి సరిగా
పపపపా మమా మగరి మగరిరిగ
మమమమా రిగరిసా ససరి సనిసా
చరణం : 1
ఇంట్లో ఉంటే కొంగు వదలవని...
ఇంట్లో ఉంటే కొంగు వదలవని
విప్పే విరసం రావాలి
గడప దాటితే ఇంకా రావని
పట్టే విరహం కావాలి
నిద్దట్లో నువు కలవరించిన
అది నా పేరే కావాలి
అవునో కాదో
అనుమానంతో
నే మేలుకొనే ఉండాలి
నేనే లేని ఒక్క క్షణం
బతకలేవు అనుకోవాలి
అందుకనే వందేళ్ల పాటు
నీ ప్రాణం నాకే ఇవ్వాలి॥
చరణం : 2
చీకటినైనా చూడనివ్వనని
చీరై నను చుట్టెయ్యాలి
చెప్పకూడని ఊసులు చెప్పే
రెప్పల సడి వినగలగాలి
నాలో తెగువని పెంచేలా
నువు కొంచెం లోకువ కావాలి
నేను రెచ్చిపోతుంటే
ఎంతో అణకువగా ఒదిగుండాలి
నువ్వంటూ ఏం లేనట్టూ
నాలో కరిగిపోవాలి
చెట్టంతా నువ్వై చిట్టి గువ్వవై
కొత్త కుత్తుకతో రావాలి॥
Listen the Song: