ambadari jagadAmbari - అంబదరి జగదాంబదరి
చిత్రం : బద్రినాథ్(badrinAth) (2011)రచన : చంద్రబోస్(chandrabose)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : రేవంత్, శ్రావణ భార్గవి(revanth,SrAvaNi,bhArgavi)
పల్లవి : అంబదరి జగదాంబదరి
నా వెన్నదిరి కుడికన్నదిరి
లంబదరి భ్రమరాంబదరి
నా చెంపదిరి అరచెయ్యదిరి
నువ్వా ఆ దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ దరి పగలు ఈ దరి
రెండిట నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి
నిన్ను నన్ను కలిపెను బదరి (2)
ససా రిరీ గగా బదరి (2)
చరణం : 1
నువు పలికే మాటేదైనా
అది నాకు పాటకచేరీ
నువు న డిపే బాటేదైనా
అది నాకు పల్లకి స్వారీ
నువు నిలిచే చోటేదైనా
అది నాకు మధురానగరి
నీ చిలిపి పని ఏదైనా
అది నాకు మన్మథ లహరి
ప్రేమా ఆ దరి విరహం ఈ దరి
చివరికి విరహం చెదిరి
నిన్నా ఆ దరి నేడు ఈ దరి
రేపటి తాపం ముదిరి॥
చరణం : 2
క్షణమైనా విడలేనంటూ
కడుతున్నా కౌగిలి ప్రహరీ
కౌగిళ్లే సరిపోవంటూ
మోగించా ముద్దుల భేరి
ఉక్కసలే చాలదు అంటూ
తెస్తున్నా తేనె ఎడారి
తేనెలతో తీరదు అంటూ
తనువిచ్చా సరస విహారీ
సరసం ఆ దరి సిగ్గే ఈ దరి
మధ్యే మార్గం కుదిరి
స్వర్గం ఆ దరి భూమే ఈ దరి
మధ్యన మనకే ముదిరి॥॥