E andAniki bandham - ఈ అందానికి బంధం
చిత్రం : జీవన తరంగాలు(jeevana tarangAlu) (1973)రచన : ఆచార్య ఆత్రేయ(achArya atrEya)
సంగీతం : జె.వి.రాఘవులు(J.V.rAghavulu)
గానం : ఘంటసాల, పి.సుశీల(ghanTasAla, PlsuSeela))
20 March - నేడు శోభన్‌బాబు వర్ధంతి
పల్లవి :
ఈ అందానికి బంధం వేశానొకనాడు
ఆ బంధమే నాకందమైనది ఈనాడు॥అందానికి॥
చరణం : 1
నీ కళ్లు ఆనాడు ఎరుపెక్కెను
నేడు ఆ ఎరుపే నీ బుగ్గపై పాకెను॥కళ్లు॥
నీ చేతులానాడు తెరలాయెను
నేడు ఆ తెరలే కౌగిలై పెనవేసెను॥అందానికి॥
చరణం : 2
నీ వేడిలోనే నా చలువ ఉందని
వాన ఎండను చేరింది
నీ చలువే నా వేడికి విలువని
ఎండే వానను మెచ్చింది॥వేడిలోనే॥
ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో
ఇంద్రధనుస్సే విరిసింది
ఏడురంగుల ముగ్గులు వేసి
నింగీనేలను కలిపింది
ప్రేమకు పెళ్లే చేసింది॥అందానికి॥
అసలు పేరు : ఉప్పు శోభనాచలపతిరావు
జననం : 14-01-1937
జన్మస్థలం : కుంటముక్కల, కృష్ణాజిల్లా
తల్లిదండ్రులు : రామతులశమ్మ, సూర్యనారాయణరావు
తోబుట్టువులు : చెల్లెళ్లు (ధనరంగ, ఝాన్సీ, నిర్మల), తమ్ముడు (సాంబశివరావు)
చదువు : బిఎస్సీ ( ‘లా’ చదువును మధ్యలో ఆపేశారు)
వివాహం : 15-5-1958
భార్య : శాంతకుమారి
పిల్లలు : కుమారుడు (కరుణశేషు),కుమార్తెలు (మృదుల, ప్రశాంతి, నివేదిత)
తొలి సినిమా-పాత్ర -పారితోషకం : దైవబలం (1959) - గంధర్వకుమారుడు - 200 రూపాయలు
ఆఖరి చిత్రం : హలో గురూ (1996)
నటించిన సినిమాలు : 231
అవార్డులు : ఉత్తమ నటుడిగా నాలుగు ఫిలింఫేర్ అవార్డులు (ఖైదీ బాబాయ్-1974, జీవనజ్యోతి-1975, సోగ్గాడు-1976, కార్తీకదీపం-1979), ఉత్తమ చిత్ర కథానాయకునిగా ఐదు నంది అవార్డులు (మనుషులు మారాలి-1969, చెల్లెలి కాపురం-1971, కాలం మారింది-1972, శారద-1973,జీవనజ్యోతి-1975), మరెన్నో సినీ అవార్డులు.
బిరుదులు : నటభూషణ, సోగ్గాడు
మరణం : 20-3-2008
విగ్రహం : మొదటి వర్ధంతినాడు కాంస్య విగ్రహాన్ని రాజమండ్రిలో ఆవిష్కరించారు