chakkani do~mgODA - చక్కని దొంగోడా
చిత్రం : మారిన మనిషి(mArina manishi) (1970)రచన : కొసరాజు(kosarAju)
సంగీతం : టి.వి.రాజు(T.V.rAju)
గానం : బి.వసంత(B.vasanta)
28 March - నేడు బి.వసంత పుట్టినరోజు
పల్లవి : చక్కని దొంగోడా చిక్కని చిన్నోడా
ఎపుడో చిక్కేవూ నాకే చిక్కేవూ
నేను నీదాన్నయా వదిలి పోనీనయా
చక్కని దొంగోడా చిక్కని చిన్నోడా
చరణం : 1
నీకై వస్తే నే తీపి మిఠాయి తెస్తే
రుచి చూడకుండా నిలిచి
మాటాడకుండా పోయేవా ॥
చల్లకు వచ్చి ముంతను దాచి
చల్లచల్లగా జారేవయ్యా రాజా
ఆగవోయ్ రాజా ॥॥
చరణం : 2
నిన్ను చూచి ఆనందంలో మైమరచి
నా వాడవంటూ తగిన సరిజోడువంటూ
వలచాను ॥
వలచిన చిన్నది పిలుస్తు వుంటే
చిలిపిగ పరుగులు తీస్తావేమి రాజా
తెలుసుకో రాజా ॥॥
External link:
chakkani do~mgODA - చక్కని దొంగోడా
పూర్తిపేరు : బొడ్డుపల్లి బాల వసంత
జననం : 28-03-1944
జన్మస్థలం : మచిలీపట్నం
తల్లిదండ్రులు : కనకదుర్గ, రవీంద్రనాథ్
తోబుట్టువులు : చెల్లెళ్లు (కళ్యాణి, రాధ, రాజ్యలక్ష్మి, సావిత్రి), తమ్ముడు (రామచంద్రమూర్తి)
చదువు : బి.ఎస్సీ.
వివాహం : 21-02-1968
భర్త : సుధాకర్
సంతానం : అమ్మాయిలు (సురేఖ, సుచిత్ర), అబ్బాయి (శరత్)
తొలిచిత్రం- పాట-పారితోషకం : వాగ్దానం (1961) - మా కిట్టయ్య పుట్టిన దినం (పిఠాపురంతో) - 150 రూపాయిలు
ఆఖరిచిత్రం-పాట-పారితోషకం : సీతక్క (1997) - ఆటభలే పాటభలే (రామకృష్ణతో)
- 1500 రూపాయిలు
పాటలు : దాదాపు నాలుగు వేలు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, తుళు, సింహళ, సంస్కృతం, హిందీ భాషలలో)
సంగీత దర్శకురాలిగా : కన్నడంలో ‘రాజనర్తకియ రహస్య’ (1976), తెలుగులో ‘మంచికి స్థానం లేదు’ (1979), మరో నాలుగు చిత్రాలకు (తెలుగులో స్వాతి వెన్నెల, మంజీరనాదాలు, ఒక రూపాయి, ఒకటి తమిళంలో) బాణీలందించారు. అయితే అవి విడుదల కాలేదు. తెలుగు, తమిళంలో ఎనిమిది భక్తిగీతాల ఆల్బమ్స్ చేశారు.
పురస్కారాలు-అవార్డులు : మద్రాస్ తెలుగు అకాడమీ వారి ఉగాది పురస్కారం, ‘ఉ మ్మాచు (1971)’ అనే చిత్రంలో పాటకు మలయాళీ అసోసియేషన్ నుండి ఉత్తమగాయని అవార్డు. తమిళనాడు వారి నుండి ‘కళైమామణి’, మళయాళం సినీ టెక్నీషియన్స్ అసోసియేషన్ తరపు నుండి, కమగర ఫౌండేషన్ నుండి ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డులు. మద్రాస్ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ నుండి జి.రామనాథన్ పేరిట, ‘వెటరన్’ అవార్డు, కళాసుధ అసోసియేషన్ వారి నుండి ‘మహిళారత్న’ (2012) అవార్డు.
ఇతర విషయాలు : తల్లిదండ్రులకు సంగీతం పట్ల అవగాహన ఉండటంతో వసంత సంగీత వాతావరణంలో పెరిగింది. 1954లో నాగార్జునసాగర్ శంకుస్థాపన కార్యక్రమంలో, అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ అధ్యక్షతన 10 ఏళ్ల వయసులో వసంత ప్రార్థనాగీతం పాడి అందరినీ అలరించారు. దేశవిదేశాలలో ఎన్నో కచేరీలు చేశారు. 1961 నుండి దాదాపు తెలుగు, తమిళ, కన్నడ, మళయాళీ భాషలలో అందరి సంగీత దర్శకుల దగ్గర, గాయనీగాయకులతో కలిసి పాడారు.